తెలంగాణ

TS ICET 2022: టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ విడుదల, ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు, జులై 27, 28 తేదీల్లో ఐసెట్ ప‌రీక్ష

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ను కాక‌తీయ విశ్వవిద్యాల‌యం బుధ‌వారం విడుద‌ల (TS ICET 2022) చేసింది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Weather Forecast: తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు ఎండలే ఎండలు, బయట తిరగవద్దని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటన, 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈసారి ‘అంతకు మించి’ అన్నట్టుగా సూర్యుడి ప్రతాపం (Weather Forecast) ఉండబోతోందని.. ముఖ్యంగా రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ( Heatwave warning) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

CM KCR Writes PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ, ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని వినతి

Hazarath Reddy

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం లేఖ రాశారు

Covid in TS: తెలంగాణలో కొత్తగా 32 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 18,246 కరోనా పరీక్షలు నిర్వహించగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

Advertisement

IPS Umesh Chandra: దివంగ‌త ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రకు నివాళి అర్పించిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

దివంగ‌త ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రకు (IPS Umesh Chandra) తెలంగాణ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వారం నివాళి అర్పించారు. మార్చి 29న ఉమేశ్ చంద్ర జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఉమేశ్ చంద్ర నిలువెత్తు చిత్ర ప‌టం ముందు స‌జ్జ‌నార్ నివాళి అర్పించారు

Hyderabad Shocker: దారుణం.. బ్యాంక్ లాకర్ గదిలోనే రాత్రంతా వృద్ధుడు, జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్వాకం,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

Hazarath Reddy

జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలమీదకు వచ్చింది. లాకర్ గదిలోనే వృద్ధుడు కృష్ణారెడ్డిని ఉంచి బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం లాకర్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని సిబ్బంది గమనించారు.

Siddipet Shocker: వీళ్లు మనుషులేనా, సిద్ధిపేటలో దారుణం, 100 వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపేశారు, పాడుబడిన బావిలో మృతజీవాలను పూడ్చేసిన ఘటన...జాతీయ స్థాయిలో కలకలం..

Krishna

గ్రామస్తుడొకరు తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాదులోని స్ట్రే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. సంస్థ సభ్యులు ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చి విచారించగా అసలు విషయం వెల్లడైంది.

Telangana: తెలంగాణలో మరో ఘోర ప్రమాదం, బర్రెను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, తొమ్మిది మందికి గాయాలు, మరో ఘటనలో జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ హుండ్యాయ్‌ క్రేటా కారు బీభత్సం

Hazarath Reddy

మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ (TSRTC Bus Hits Tree) కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా 9మందికి గాయాలయ్యాయి.

Advertisement

Weather Forecast: ఎండలు బాబోయ్ ఎండలు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వడగాడ్పులు, తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే వడగాడ్పులు రంగప్రవేశం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండలు (Heat Wave) పెరుగుతున్నాయి. క్రమేపి పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 30 మందికి క‌రోనా, ప్ర‌స్తుతం రాష్ట్రంలో 492 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు

Hazarath Reddy

కరోనా వైర‌స్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 17,806 కరోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్షల‌లో రాష్ట్ర 30 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.

Hyderabad: వాట్సప్ కాల్ ఎత్తగానే మొబైల్‌లోకి నగ్న వీడియోలు, ఇతరులకు పంపించకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Hazarath Reddy

హైదరాబాద్‌లో 30 ఏళ్ల వ్యక్తి ఓ అనామక నంబర్‌ (anonymous number) నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్‌ రావడం.. అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ.55 వేలు (Video call costs Hyderabad man Rs 55,000) ఇవ్వాలని అడగడం జరిగింది.

TS EAMCET 2022: టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుదల, ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

Hazarath Reddy

టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను (TS EAMCET 2022) స్వీక‌రిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు.

Advertisement

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, ఉద్యోగం పేరుతో యువతిని లాడ్జీకి తీసకెళ్లి రేప్ చేసిన మృగాడు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యువతి...

Krishna

ఉద్యోగం పేరుతో ఓ మృగాడు యువతిపై అత్యాచారం చేశాడు. దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో యువతి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

CM KCR Yadadri Tour: యాదాద్రిలో పల్లకి మోసిన కేసీఆర్, విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం జ‌లాభిషేకం, కొనసాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన

Hazarath Reddy

యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్ (Telangana Chief Minister K Chandrashekar Rao), ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.

Telangana: వేకువ జామునే కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత, ఆస్పత్రిలో చావు బతుకుల్లో మరో చిన్నారి

Hazarath Reddy

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ( 5 People Killed in Bus-Car Collision) ఐదుగురు మృత్యువాత పడ్డడారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో సోమవారం వేకువ జామునే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 41 మందికి కరోనా, రాష్ట్రంలో ప్రస్తుతం 514 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

రాష్ట్రంలో ఆదివారం 13,158 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 41 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది. తాజాగా మరో 63 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7.86 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

Advertisement

CM KCR Yadadri Tour: యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్, మహాపూర్ణాహుతితో మొదలైన సంప్రోక్షణ ఉత్సవాలు, ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ

Hazarath Reddy

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ దంపతులతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వడ అజయ్ కుమార్, విప్ గొంగిడి సునీత తదితరులు యాదాద్రికి చేరుకున్నారు.

Sai Dharam Tej New Film: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వీడియో రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, కొత్త మూవీ అనౌన్స్ చేసిన తేజు, తనను కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల

Naresh. VNS

తేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌లకు (Pawan Kalyan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 36 మందికి కరోనా, సగానికి పైగా కేసులు హైదరాబాదులోనే

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,427 శాంపిల్స్ పరీక్షించగా, 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో సగానికి పైగా కేసులు హైదరాబాదులోనే వెలుగు చూశాయి. నగరంలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Hyderabad: ట్రాన్స్‌జెండర్ల కోసం హైదరాబాద్‌లో జాబ్ మేళా నిర్వహించిన సిటీ పోలీసులు, 600కి పైగా ఖాళీలను ప్రకటించిన 100 కంపెనీలు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నగర పోలీసులు నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ట్రాన్స్‌జెండర్ ఉద్యోగావకాశాల కోసం చాలామంది వచ్చారు. దాదాపు 100 కంపెనీలు వచ్చి 600కి పైగా ఖాళీలను ప్రకటించాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ఉద్యోగార్ధులు మరియు యజమానులను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ CV ఆనంద్ తెలిపారు.

Advertisement
Advertisement