తెలంగాణ
TS TET Notification:టీచర్ జాబ్ కోసం చూస్తున్నారా? గుడ్ న్యూస్, తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల, మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లై చేసుకోండి! జూన్ 12న టెట్ ఎగ్జామ్
Naresh. VNS: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల (Teacher Jobs) కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉపాధ్యాయుల నియామకానికి (Teacher recruitment) ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)కు సంబంధించి తెలంగాణ సర్కారు (Telangana Govt.) గురువారం రోజున నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
AP Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో 10 మందికి గాయాలు
Hazarath Reddyప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి దగ్గర ఆటోను కారు (AP Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా (Four persons killed on the spot) గుర్తించారు.
Telangana Government Jobs: తెలంగాణ కొలువుల జాతరలో కీలక ఘట్టం, 30వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతులు, శాఖల వారీగా వివరాలు ఇవే! ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారో తెలుసా?
Naresh. VNSకేసీఆర్ ప్రకటనతో భర్తీ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. మొత్తం 80,039 పోస్టులకు గాను తొలి విడుత 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇవాళ అనుమతులు జారీ చేసింది.
TRS Agitations on Fuel Prices: ఇక సమరమే! పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుపై టీఆర్‌ఎస్ ఆందోళనలు, పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్, భారీ నిరసనలకు ప్లాన్ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు
Naresh. VNSధరల పెరుగుదలపై టీఆర్ఎస్ భగ్గుమంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో జ‌ర‌గ‌నున్న ఈ నిర‌స‌న‌ల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోనున్నాయి.
Minor Rape In Hyderabad: హైదరాబాద్ లో దారుణం, సులభ్ కాంప్లెక్స్ లో 10 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం, కన్నతల్లి కళ్లముందే షాకింగ్ ఘటన, నిందితుడిని చితకబాదిన స్థానికులు
KrishnaRangareddy District మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బడంగ్ పేట్ లో స్థానికంగా ఉండే పండ్ల వ్యాపారి కూతురిపై పక్కనే ఉండే Sulabh Complex లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, తొలివిడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ, గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి అనుమతి..
Krishnaసీఎం కేసీఆర్ ప్రకటించిన మొత్తం 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
KCR Letter to Modi: జాతీయ ధాన్యం సేకరణ విధానం తీసుకురండి! ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, మొత్తం ధాన్యం కొనకపోతే కనీస మద్దతు ధరకు అర్ధం ఏముంది?
Naresh. VNSప్రధాని మోదీకి (Modi) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) లేఖ (Letter) రాశారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు పంటల సేకరణ పాలసీ (Procurement Policy) లేదని చెప్పారు. పంజాబ్ (Punjab), హర్యానాలో (Haryana) వందశాతం ధాన్యాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో (Telangana) ధాన్యం సేకరణ జరగడం లేదన్నారు.
Power Tariff Hike in Telangana: తెలంగాణ ప్రజలకు విద్యుత్ షాక్, ఛార్జీల పెంపునకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త చార్జీలు, గృహ విద్యుత్ పై 40 నుంచి 50 పైసలు పెంపు
Naresh. VNSతెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు (power tariff hike ) ఖరారైంది. 14 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచేందుకు టీఎస్‌ ఈఆర్సీ Electricity Regulatory Commission గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక స్పష్టత వచ్చింది. పెరిగిన ఛార్జీల ప్రకారం.. డొమెస్టిక్‌ (Domestic) పై 40 నుంచి 50 పైసలు పెంపు వర్తించనుంది. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున భారం పెరగనుంది.
Secunderabad Fire Accident: బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం
Hazarath Reddyబోయిగూడ స్క్రాప్ గోడౌన్‌ అగ్ని ప్రమాదం పెను నగరంలో విషాదాన్ని నింపిన సంగతి విదితమే. అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 53 కరోనా కేసులు, గత 24 గంటల్లో కరోనా మరణాలు నిల్
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 53 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా 77 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 615 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Bhoiguda Fire Accident: బోయిగూడలో కాలిన బతుకులు, గుర్తుపట్టలేని స్థితిలో 11 మంది మృతదేహాలు, షార్ట్ సర్క్యూట్ కారణంగా లోపల ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో పెరిగిన ప్రమాద తీవ్రత
Hazarath Reddyసికింద్రాబాద్‎లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‎తో మంటలు (Bhoiguda Fire Accident) ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగడంతో (Massive fire breaks out at scrap godown) స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Hyderabad Fire Accident: బోయిగూడ అగ్ని ప్రమాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం
Hazarath Reddyసికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సీఎం ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృత‌దేహాల‌ను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Secunderabad Fire Accident: అయ్యో పాపం! 11 మంది కూలీలు సజీవదహనం, టింబర్‌ డిపోలో చెలరేగిన మంటలు, లోపలున్న బీహార్ కూలీలంతా మృతి, కుటుంబాలను ఆదుకుంటామన్న మంత్రి
Naresh. VNSబోయిగూడలో (Bhoiguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్‌ డిపోలో (Tiber Depo) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు (Massive Fire)ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Karimnagar Shocker: కట్టుకున్న భార్య ఎదురింటి కుర్రాడితో శృంగారం చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది, కానీ అంతలోనే మనస్థాపం చెందిన భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ తింటారు...
Krishnaఓ వివాహిత ఎదురింటి కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. భార్య చేసిన మోసం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఇక బతకొద్దని నిర్ణయించుకొని, తనువు చాలించాడు.
Telangana: పీకేపై కేసీఆర్ ప్రశంసలు, జాతీయ రాజకీయాల్లోకి అప్పుడే ఎంట్రీ ఇస్తానన్న సీఎం, 95 నుంచి 105 స్థానాలతో రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణలో ముందస్తు ఎన్నికలపై (No early polls) సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ (TRS) విస్తృతస్థాయి సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులతో పాటు పారిశ్రామిక, ఐటీ పెట్టుబడులు సాధించాల్సి ఉంది
Hyderabad Road Accident: మేడ్చల్‌ జిల్లాలో ఘోర విషాదం, నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి, బెంగుళూరులో రోడ్డు దాటుతుండగా బాలికపై దూసుకెళ్లిన బీబీఎంపీ చెత్త లారీ
Hazarath Reddyమేడ్చల్‌ జిల్లాలోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ లారీ బీభత్సం (Hyderabad Road Accident) సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఐరన్‌ లోడుతో వచ్చిన ఓ లారీ... వెనక్కి చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి ( Truck runs over sleeping construction workers) దూసుకెళ్లింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 73 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,666 కరోనా పరీక్షలు నిర్వహించగా, 73 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Padma Awards 2022: పద్మశ్రీ అవార్డును అందుకున్న మొగులయ్య, గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావు, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం
Hazarath Reddyతెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఏపీకి చెందిన గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావు కూడా ప‌ద్మ‌శ్రీ అవార్డును రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్నారు.
CM KCR Press Meet: కేంద్రం ధాన్యం సేకరించే వరకు పోరాటం సాగిస్తాం, ఆహార ధాన్యాల సేక‌ర‌ణ విష‌యంలో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాలని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం ముగిసిన అనంత‌రం కేసీఆర్ మీడియాతో (CM KCR Press Meet) మాట్లాడారు. ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) ప్రకటించారు.