తెలంగాణ
Statue Of Equality: 11వ రోజు వైభవంగా శ్రీభగద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం, రామానుజాచార్యుల విగ్రహం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Krishnaముచ్చింతల్‌లోని సమతా క్షేత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషిజీ, అశ్వనీకుమార్ చౌబే, మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. 216 అడుగుల శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు.
CM KCR Yadadri Tour Highlights: యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోంది, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyయాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్‌ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుందన్నారు. మిషన్‌ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, . భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు.
MHA: తెలుగు రాష్టాల మద్య సమస్కల పరిష్కారానికి తొలి దఫా చర్చలు, ఈ నెల 17న హాజరు కావాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం, తెర పైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక సమావేశం (MHA Crucial Meeting) ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ఫిబ్రవరి 17న జరగనుంది.
Telangana: ఆయుధాలను పరిశీలిస్తుండగా పేలిన గన్, హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి, మరొక ఘటనలో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయిన బాలిక
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో తుపాకీ ( gun misfires in Kothagudem) మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందారు.
Medaram Maha Jatara:మేడారం భక్తులకు గుడ్ న్యూస్, ఆన్‌లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకునే అవకాశం, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా కానుకలు చెల్లించవచ్చు
Naresh. VNSమేడారం జాతరకు (Medaram Jatara) భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు అధికంగా ఉండడంతో కానుకలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కానుకలు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదంటోంది కెనరా బ్యాంక్ (Canara bank). క్యూ ఆర్ కోడ్(QR Code) ద్వారా భక్తులు తమ కానుకలను చెల్లించవచ్చని తెలిపింది.
Statue Of Equality 6th Day: ఆరోరోజు అత్యంత వైభవంగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరు
Krishnaసమతా క్షేత్రానికి వీవీఐపీలు తరలివస్తున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు.
TSRTC Reduced Charges: తెలంగాణలో తగ్గిన ఆర్టీసీ ఛార్జీలు, గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం, ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్న యాజమాన్యం
Naresh. VNSటీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రయాణీకుల‌కు శుభ‌వార్త వినిపించింది. గ‌రుడ ప్లస్ ఛార్జీలు (Garuda Plus charges) త‌గ్గించింది. ప్రయాణికుల‌కు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఈ నిర్ణయం తీసుకున్నది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్పష్టం చేసింది.
COVID in TS: తెలంగాణలో భారీగా తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 767 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 228 కేసులు నిర్ధారణ
Hazarath Reddyతెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 228 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 2,861 మంది కోలుకున్నారు.
TRS MLC Kavitha on Hijab Controversy: స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది, హిజాబ్ వివాదంపై MLC కల్వకుంట్ల కవిత స్పందన..
Krishnaహిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని చెప్పారు.
TRS Mps Protest: ఏపీ విభజనపై ప్రధాని వ్యాఖ్యలు, ఉభయ సభల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, ప్రధానిపై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చిన ఎంపీలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. సాయంత్రం 4 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. వెల్‌లోకి దూసుకువెళ్లి నిర‌స‌న (TRS Mps Protest) చేప‌ట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని మోదీ రెండు రోజుల క్రితం అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు (Telangana formation remark ) చేసిన విష‌యం తెలిసిందే.
Corona in TS: తెలంగాణలో తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో 865 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గత 24 గంటల్లో 61,573 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి.
TRS MPs Protest: ప్రధాని మోదీ వ్యాఖ్యలు కలకలం, పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.
Telangana: తెలంగాణలో దుమారం రేపుతున్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలు దగ్ధం
Hazarath Reddyతెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు (PM Modi insulted Telangana) వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఆగ్రహావేశాలు రగిల్చాయి. ముఖ్యంగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మోదీ అంటేనే మండిపడుతోంది
COVID in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 1,061 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,892 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 1,061 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డి జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయి.
Amit Shah At Statue Of Equality: యుగాల వరకు సనాతన ధర్మ పరిరక్షణకు రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుంది, ముచ్చింతల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Krishnaకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తుల నుద్దేశించి ప్రసంగించారు. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు.
Parliament Budget Session 2022: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ
Hazarath Reddyపార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని (Andhra Pradesh) హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు.
TS Inter Exams 2022: తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు, టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు (TS Inter Exams 2022) జరుగనున్నాయి. 20న ఫస్టియర్‌కు, 21న సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్‌ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి.
Cheruvugattu Shiva Brahmotsavams: నేటి నుంచి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
Hazarath Reddyతెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Cheruvugattu Jadala Ramalingeswara Swamy Brahmotsavams) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.