తెలంగాణ
Telangana Weather Forecast: తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటు వణుకు తప్పదంటున్న వాతావరణ శాఖ, ఏపీలో రోజు రోజుకు తీవ్రమవుతున్న చలి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు తీవ్రత (Telangana Weather Forecast) పెరుగుతున్నది. ఒకేసారి రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ( Telangana as winter peaks ) తక్కువగా నమోదవుతున్నాయి.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 22, రంగారెడ్డి జిల్లాలో 14, సిద్ధిపేట జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.
First Gay Wedding in Telangana: తెలంగాణలో తొలి "గే" జంట వివాహం, పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు, ఇదేం చోద్యం రా బాబోయ్ అంటున్న నెటిజన్లు...
Krishnaతెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు.
Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా, మరో మూడు రోజుల పాటూ ఇదే పరిస్థితి, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Naresh. VNSతెలంగాణ(Telangana)లో చలి పంజా(cold wave) విసురుతోంది. ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు(temperatures dip)పడిపోయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటూ ఇదే రేంజ్‌లో చలి తీవ్రత కొనసాగే అవకాశముంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది ఐఎండీ.
Hyderabad Accident: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం, తాగి కారు నడపడంతో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, మరో వ్యక్తి మృతి, డివైడర్‌ ను ఢీకొట్టిన తుక్కు తక్కయిన కారు
Naresh. VNSహైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో (Gachibowli) ఘోర కారు ప్రమాదం(Car Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన(Over Speed) కారు హెచ్‌సీయూ(HCU) వద్ద అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌ సహా ఇద్దరు మహిళా జూనియర్‌ ఆర్టిస్టులు(junior artist) అక్కడికక్కడే మృతిచెందారు.
CM KCR on Rythu Bandhu: రైతుబంధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, దశల వారీగా దళితబంధు అమలు, కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపు
Hazarath Reddyతెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం కొన‌సాగింది. ధాన్యం కొనుగోళ్లు, గ‌నుల ప్ర‌యివేటీక‌ర‌ణ‌, ఇత‌ర అంశాల‌పై ఈ సమావేశంలో చ‌ర్చించారు. కేంద్రంపై పోరులో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సీఎం ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించారు. రైతుబంధు ప‌థ‌కం (CM KCR on Rythu Bandhu) య‌థావిధిగా కొన‌సాగుతుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.
Omicron in Telangana: కేసులు పెరిగినా ఎలాంటి లాక్‌డౌన్ ఉండదు, తెలంగాణలో మరొకరికి ఒమిక్రాన్, 8కి చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య, క‌రోనా మూడో ద‌శ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్న స‌ర్కారు
Hazarath Reddyతెలంగాణలో కొత్తగా ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయిందని దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి (Omicron in Telangana) చేరిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సంరం లేద‌ని, ప్ర‌జ‌లు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న సూచించారు. కొత్తగా హనుమకొండలో మహిళకు ఒమైక్రాన్‌ (One more omicron cases traced) నిర్థారించామని చెప్పారు
Corona in TS: తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13, హన్మకొండ జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.
Omicron in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు, తాజాగా 4 కేసులు నమోదుతో ఏడుకు చేరిన మొత్తం కేసుల సంఖ్య, అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ సహా పోలీసు, జీహెచ్‌ఎంసీలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు (Omicron in Telangana) నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ కేసులుతో కలపుకుని రాష్టంలో మొత్తంగా ఒమిక్రాన్ కేసులు ఏడుకు (tally raises to 7 in the state) చేరాయి. తొలి మూడు కేసులు వచ్చిన మరునాడే మరిన్ని కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది.
Doctors Remove 156 Stones: దేశంలోనే మొదటిసారిగా...కిడ్నీలో నుంచి 156 రాళ్లను తొలగించిన హైదరాబాద్ వైద్యులు, పెద్ద ఆపరేషన్‌ చేయకుండానే కీహోల్‌ పద్ధతిలో సర్జరీ పూర్తి
Hazarath Reddyభాగ్యనగరంలో ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా మొత్తం 350 గ్రాముల బరువున్న 156 రాళ్లు పేరుకుపోవడం చూసి వైద్యులే అవాక్కయ్యారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్‌ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్‌ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను (Doctors Remove 156 Stones) ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు.
TS Inter First Year Result 2021: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో వివరాలు, ఏపీ లాసెట్‌ ఆడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల
Hazarath Reddyతెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో (TS Inter First Year Result 2021) మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు.
Omicron in Telangana: ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు, మాస్కులు ధరించడం మరచిపోవద్దు, అప్రమత్తత అవసరమని తెలిపిన వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron in Telangana) తెలంగాణ‌లోకి ప్ర‌వేశించింది. ఇద్ద‌రు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డిన‌ట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు (G Srinivasa Rao) మీడియాకు వెల్ల‌డించారు
Telangana: డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే జైలుకే, ఇప్పటికి 36 మందిని జైలుకు పంపిన సైబాబాద్ పోలీసులు, ఆయా నిందితులకు రూ.16.16 లక్షల జరిమానా
Hazarath Reddyఇక మందుబాబులు అలర్ట్ కావాల్సిందే.. తాగి రోడ్ల మీదకు వచ్చినా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా జైలుకు వెళ్లక తప్పదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Traffic Police) స్పెషల్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు.
Telangana MLC Election Results 2021: స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను కైవసం చేసుకున్న కేసీఆర్ సర్కారు
Hazarath Reddyతెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో (Telangana MLC Election Results 2021) అధికార టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే (TRS Party) కైవ‌సం చేసుకుంది. విప‌క్షాలు క‌నీసం పోటీలో కూడా నిలవలేకపోయాయి. మొత్తం 12 స్థానాల్లో 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా, మ‌రో 6 స్థానాల‌కు ఎన్నిక‌లు (Telangana MLC Election) నిర్వ‌హించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు.
Rythu Bandhu 2021: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రేపటినుంచి రైతు బంధు నిధులు విడుదల, రైతుబంధు కోసం దాదాపు రూ. 7,500 కోట్లను సిద్ధం చేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ
Hazarath Reddyరైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రేపటి నుంచి రైతుబంధు నిధులను (Rythu Bandhu 2021) పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. వీలైనంత త్వరగా రైతులందరి అకౌంట్లలోకి డబ్బు జమ (Telangana farmers will get Rythu Bandhu funds) అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
Telangana EV Policy: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ ధరలు ఇంత తక్కువా..? అంతేకాదు ఈ రేంజ్‌లో సబ్సిడీ ఇస్తుంటే ఇక ఈవీని ఎవరు ఆపలేరు, ఈవీ చార్జింగ్ రేట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Naresh. VNSతెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicle) కొనుగోళ్లు పెరగడంతో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల(Charging stations)ను ఏర్పాటు చేయడంతో పాటు, ఈవీలను ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జింగ్ చేసుకుంటే ఎంత ధర చెల్లించాలో(EV charging prices) కూడా ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది.