తెలంగాణ

CM KCR on Rythu Bandhu: రైతుబంధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, దశల వారీగా దళితబంధు అమలు, కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపు

Hazarath Reddy

తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం కొన‌సాగింది. ధాన్యం కొనుగోళ్లు, గ‌నుల ప్ర‌యివేటీక‌ర‌ణ‌, ఇత‌ర అంశాల‌పై ఈ సమావేశంలో చ‌ర్చించారు. కేంద్రంపై పోరులో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సీఎం ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించారు. రైతుబంధు ప‌థ‌కం (CM KCR on Rythu Bandhu) య‌థావిధిగా కొన‌సాగుతుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Omicron in Telangana: కేసులు పెరిగినా ఎలాంటి లాక్‌డౌన్ ఉండదు, తెలంగాణలో మరొకరికి ఒమిక్రాన్, 8కి చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య, క‌రోనా మూడో ద‌శ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్న స‌ర్కారు

Hazarath Reddy

తెలంగాణలో కొత్తగా ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయిందని దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి (Omicron in Telangana) చేరిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సంరం లేద‌ని, ప్ర‌జ‌లు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న సూచించారు. కొత్తగా హనుమకొండలో మహిళకు ఒమైక్రాన్‌ (One more omicron cases traced) నిర్థారించామని చెప్పారు

Corona in TS: తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13, హన్మకొండ జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.

Omicron in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు, తాజాగా 4 కేసులు నమోదుతో ఏడుకు చేరిన మొత్తం కేసుల సంఖ్య, అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ సహా పోలీసు, జీహెచ్‌ఎంసీలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు (Omicron in Telangana) నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ కేసులుతో కలపుకుని రాష్టంలో మొత్తంగా ఒమిక్రాన్ కేసులు ఏడుకు (tally raises to 7 in the state) చేరాయి. తొలి మూడు కేసులు వచ్చిన మరునాడే మరిన్ని కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది.

Advertisement

Doctors Remove 156 Stones: దేశంలోనే మొదటిసారిగా...కిడ్నీలో నుంచి 156 రాళ్లను తొలగించిన హైదరాబాద్ వైద్యులు, పెద్ద ఆపరేషన్‌ చేయకుండానే కీహోల్‌ పద్ధతిలో సర్జరీ పూర్తి

Hazarath Reddy

భాగ్యనగరంలో ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా మొత్తం 350 గ్రాముల బరువున్న 156 రాళ్లు పేరుకుపోవడం చూసి వైద్యులే అవాక్కయ్యారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్‌ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్‌ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను (Doctors Remove 156 Stones) ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు.

TS Inter First Year Result 2021: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో వివరాలు, ఏపీ లాసెట్‌ ఆడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో (TS Inter First Year Result 2021) మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Omicron in Telangana: ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు, మాస్కులు ధరించడం మరచిపోవద్దు, అప్రమత్తత అవసరమని తెలిపిన వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron in Telangana) తెలంగాణ‌లోకి ప్ర‌వేశించింది. ఇద్ద‌రు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డిన‌ట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు (G Srinivasa Rao) మీడియాకు వెల్ల‌డించారు

Telangana: డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే జైలుకే, ఇప్పటికి 36 మందిని జైలుకు పంపిన సైబాబాద్ పోలీసులు, ఆయా నిందితులకు రూ.16.16 లక్షల జరిమానా

Hazarath Reddy

ఇక మందుబాబులు అలర్ట్ కావాల్సిందే.. తాగి రోడ్ల మీదకు వచ్చినా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా జైలుకు వెళ్లక తప్పదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Traffic Police) స్పెషల్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు.

Advertisement

Corona in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు, గత 24 గంటల్లో 210 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

CM KCR Meets MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ, యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం, థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు చర్చించినట్లుగా వార్తలు

Hazarath Reddy

Telangana MLC Election Results 2021: స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను కైవసం చేసుకున్న కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో (Telangana MLC Election Results 2021) అధికార టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే (TRS Party) కైవ‌సం చేసుకుంది. విప‌క్షాలు క‌నీసం పోటీలో కూడా నిలవలేకపోయాయి. మొత్తం 12 స్థానాల్లో 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా, మ‌రో 6 స్థానాల‌కు ఎన్నిక‌లు (Telangana MLC Election) నిర్వ‌హించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 70 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

Advertisement

Rythu Bandhu 2021: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రేపటినుంచి రైతు బంధు నిధులు విడుదల, రైతుబంధు కోసం దాదాపు రూ. 7,500 కోట్లను సిద్ధం చేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ

Hazarath Reddy

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రేపటి నుంచి రైతుబంధు నిధులను (Rythu Bandhu 2021) పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. వీలైనంత త్వరగా రైతులందరి అకౌంట్లలోకి డబ్బు జమ (Telangana farmers will get Rythu Bandhu funds) అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Telangana EV Policy: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ ధరలు ఇంత తక్కువా..? అంతేకాదు ఈ రేంజ్‌లో సబ్సిడీ ఇస్తుంటే ఇక ఈవీని ఎవరు ఆపలేరు, ఈవీ చార్జింగ్ రేట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Naresh. VNS

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicle) కొనుగోళ్లు పెరగడంతో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల(Charging stations)ను ఏర్పాటు చేయడంతో పాటు, ఈవీలను ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జింగ్ చేసుకుంటే ఎంత ధర చెల్లించాలో(EV charging prices) కూడా ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది.

Hyderabad Shocker: అక్రమ సంబంధముందనే అనుమానంతో భార్య తల నరికిన భర్త, నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన యువకుడు, రాజేంద్రనగర్‌లో ఘటన

Naresh. VNS

తన భార్య ఇంకెవరితోనే అక్రమ సంబంధం(extramarital relationships) పెట్టుకుందనే అనుమానం పర్వేజ్ మెదడును తొలిచేసింది. అప్పటికే గంజాయి(Ganja)తో పాటూ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు పర్వేజ్. గురువారం రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన పర్వేజ్‌...తన భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కత్తితో సమ్రీన్ గొంతు కోశాడు.

TS MLC Election 2021: ముగిసిన స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికల పోలింగ్, భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ (TS MLC Election 2021 Polling) సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

Advertisement

MLC Polls 2021: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

తెలంగాణలోని 5 జిల్లాల్లోని 6 స్థానాలకు పోలింగ్ (MLC Polls 2021) కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మ.2 గంటల వరకు 96.69 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఖమ్మం జిల్లాలో మ.2 గంటల వరకు 79.95 శాతం పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మ.2 గంటల వరకు 87.73 శాతం పోలింగ్ జరిగింది.

Telangana Shocker: భర్త మరో మహిళతో.. చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, తెలంగాణ జనగామ జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఓ వివాహిత మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య (married woman committed suicide) చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెంలో జరిగింది.

Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 76 మందికి కరోనా

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో ఒకరు మృతి చెందగా... 184 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.83 శాతంగా ఉంది.

Singareni Coal Blocks: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్, బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తి, 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్, ప్రధాని మోదీకి లేఖ రాసిని సీఎం కేసీఆర్

Hazarath Reddy

సింగరేణిలో తలపెట్టిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి (PM Narendra Modi) నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలాన్ని (Singareni Coal Blocks Auction) వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి

Advertisement
Advertisement