తెలంగాణ
Cyberabad Traffic Police: నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న, ట్రాఫిక్ రూల్స్ గురించి సరికొత్తగా ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు
Hazarath Reddyసైబరాబాద్ పోలీసులు కొత్తగా ముందుకు వెళుతున్నారు. సినిమా పోస్టర్లను వాడుకుంటూ ట్రాఫిక్ మీద ప్రతి ఒక్కరికీ పోలీసులు (Cyberabad Traffic Police) అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని జెర్సీ మూవీని (Awareness With Using Jersey Poster) వాడుకున్నారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్‌లో బ్యాట్‌ పట్టుకుని ముఖాన హెల్మెట్‌ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్నాడు. ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్‌.. "నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న" అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్‌గా వాడుకున్నారు. హెల్మెట్‌ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్‌ షేర్‌ చేసిన విషయం తెలిసిందే!
Corona in Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, కొత్తగా మరో 431 పాజిటివ్ కేసులు నమోదు, మళ్లీ రాష్ట్రంలో ఆంక్షలు విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
Team Latestlyతాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,04,298కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 111 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 31 కేసులు, మేడ్చల్ నుంచి 37, జగిత్యాల మరియు మంచిర్యాల.....
MHA Fresh Guidelines: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నూతన మార్గదర్శకాలను జారీచేసిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 1 నుంచి కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన
Team Latestlyఈ నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి మరియు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. MHA జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి....
Schools Closed in Telangana: తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థ‌ల‌ు బంద్, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాష్ర్టంలోని ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల‌న్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు (Telangana Schools Closed)అసెంబ్లీ వేదిక‌గా విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. పాఠ‌శాల‌ల్లో క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో మంత్రి స‌బిత‌, విద్యా‌, వైద్యారోగ్య శాఖ‌ అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఆ త‌ర్వాత మంత్రి స‌బిత ఇంద్రారెడ్డి (minister sabitha indra reddy) శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు.
MP Revanth Reddy Covid: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌, ట్విట్టర్ ద్వారా తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
Hazarath Reddyమల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని రేవంత్ తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్‌లోకి వెళుతున్నట్టు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.
Telangana: డిప్రెషన్ తట్టుకోలేక ఇద్దరు యువతులు ఆత్మహత్య, గచ్చిబౌలిలో 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్థిని, మేడ్చల్‌ జిల్లాలో మరో యువతి అనుమానాస్పదంగా మృతి
Hazarath Reddyతెలంగాణలో మానసిక ఒత్తిడిని జయించలేక ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకుపాల్పడగా..మరొకరు చదువులో వెనకబడిపోతున్నాననే బాధతో ఆత్మహత్య చేఃుకున్నారు.
Audience Gallery Collapses: సూర్యాపేటలో ఘోర విషాదం, 150మందికి పైగా గాయాలు, కుప్పకూలిన ఆడియన్స్ గ్యాలరీ, 47వ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల చాంపియన్‌ షిప్‌– 2021 కబడ్డీ పోటీల సందర్భంగా ఘటన
Hazarath Reddyతెలంగాణలోని సూర్యాపేటలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీల (Kabbadi Tournament) కోసం ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన భారీ గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్టీల్‌, సెంట్రింగ్‌ కర్రలు, కలపతో నిర్మించిన భారీ గ్యాలరీ కావడంతో.. ప్రేక్షకుల్లో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డారు. వందల మందికి గాయాలు, క్షతగాత్రుల అరుపులతో భీతావహ వాతావరణం నెలకొంది.
COVID in Telangana: తెలంగాణలో మరింత ఉధృతమవుతున్న కరోనా, కొత్తగా 412 పాజిటివ్ మందికి పాజిటివ్, గ్రేటర్ హైదరాబాద్‌లో భారీగా బయటపడుతున్న కోవిడ్ కేసులు, ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి ఈటల సూచన
Team Latestlyప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని మంత్రి ఈటల కోరారు. ప్రజల సహకారం లేకుండా సంపూర్ణంగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించలేమని ఆయన అన్నారు. బయటకు వెళ్తే మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం, క్రమం తప్పకుండా చేతులను కడుక్కోవటం అలవాటు చేసుకోవాలని కోరారు. నిజంగా అవసరమైతే తప్ప అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి కోరారు.....
Telangana Lockdown Row: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ ఆలోచన ఏమీ లేదని తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రాత్రి పూట కర్ఫ్యూ విధించే అవకాశమే లేదని తెలిపిన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ
Hazarath Reddyగత ఏడాది ఏ చర్యలు చేపట్టామో ఇప్పుడూ అవే చర్యలు చేపడతామని డీహెచ్‌వో శ్రీనివాస్‌ పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల మద్దతు కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ కు అర్హులైన ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకోవాలని చెప్పారు. టీకా వల్ల కరోనా తీవ్రత ఎక్కువ కాకుండా చూడొచ్చని అన్నారు. స్కూళ్లలో కరోనా కేసులు వస్తుండటంతో... మళ్లీ లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పెడతారనే ప్రచారం జరుగుతోందని.. అయితే, అలాంటి ప్రపోజల్ ఇంత వరకు పెట్టలేదని చెప్పారు.
Telangana PRC: ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్లకు కేసీఆర్ సర్కారు తీపి కబురు, ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు, తాజా పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది
Hazarath Reddyపీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని (Telangana CM KCR announces 30% pay hike) ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని తెలిపారు. అలానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. 30శాతం ఫిట్ మెంట్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Virat Chandra: ఏడేళ్ల పసి ప్రాయంలో కిలిమంజారోను ఎక్కేశాడు, చిన్న వయసులోనే శిఖరాధిరోహణ చేసిన వారిలో చోటు సంపాదించుకున్న హైదరాబాద్ చిన్నారి విరాట్ చంద్ర, మార్చి 6న కిలిమంజారోలోని ఉహురు శిఖరాన్ని చేరుకున్న బుడతడు
Hazarath Reddyఏడేళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి శెభాష్ అనిపించుకున్నాడు హైదరాబాద్ చిన్నారి విరాట్ చంద్ర. ముందు చాలా భయమేసినా.. తన లక్ష్యాన్ని చేరాలన్న సంకల్పంతో శిఖరాన్ని అధిరోహించానని విరాట్ చెబుతున్నాడు. ఆ శిఖరాన్ని అధిరోహించి చిన్న వయసులోనే శిఖరాధిరోహణ చేసిన వారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మార్చి 6న విరాట్ బుడతడు ఈ ఘనత సాధించాడు. అతడిలో పర్వతాధిరోహణపై ఎంతో తపన ఉండేదని అతడి కోచ్ భరత్ చెప్పారు. అతడితో పాటు మిగతా పిల్లలకు శిక్షణనిచ్చినా వారు మధ్యలోనే తప్పుకొన్నారని, విరాట్ మాత్రం అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో కృషి చేశాడని అన్నారు. మార్చి 5న ట్రెక్కింగ్ ను మొదలుపెడితే.. మార్చి 6న కిలిమంజారోలోని ఉహురు శిఖరాన్ని చేరుకున్నామన్నారు.
COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 337 కోవిడ్ కేసులు నమోదు, విద్యార్థులకు కరోనా సోకుతుండటం పట్ల పేరేంట్స్ ఆందోళన, రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందన్న మంత్రి ఈటల
Team Latestlyరాష్ట్రంలో కేసులు పెరగటం, విద్యార్థులు కరోనా బారినపడటం రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ తెలిపారు. అయితే కోవిడ్19 పిల్లలపై పెద్దగా ప్రభావం చూపబోదని అని ఆయన అన్నారు, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ చాలా మంది పిల్లలు...
Fake Alert: తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, అలాంటిది ఏమీ లేదని తెలిపిన తెలంగాణ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్, ఆ క్లిప్ పాతది అంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ (TS Lockdown) విధించే ఆలోచన ఉందని ఓ వీడియో సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది.అయితే ఆ వీడియో గతేడాది నాటిదని ఈ వదంతులు నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్ (Konatham Dileep) ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
Telangana Weather Update: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు, విదర్భ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyమహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తు వరకూ ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం మధ్యప్రదేశ్‌ వరకూ విస్తరించింది. కర్ణాటక నుంచి మరఠ్వాడా వరకూ అదే ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని (Telangana Weather Update) వాతావరణశాఖ తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటున్నాయి. గాలిలో తేమ పెరిగింది.
Telangana Shocker: మంటల్లో కాలిపోయిన మూడు బస్సులు, ఓ వ్యక్తి సజీవ దహనం, తేనెటీగలను తరిమేందుకు బస్సుకు నిప్పు పెట్టడమే కారణం, నారాయణపేట జిల్లా మక్తల్‌లో విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తేనెటీగలను తరమాలనే ప్రయత్నంలో ఓ వ్యక్తి మంటల్లో సజీవ దహనం (man burnt alive in flames) అయ్యాడు. కరోనా సమయంలో పక్కన పెట్టేసిన బస్సుల్లో చేరిన తేనెటీగలను (honey bees ) చెదరగొట్టేందుకు నిప్పు పెట్టడంతో మూడు బస్సులు దగ్ధం అయ్యాయి. ఆ దగ్ఘమైన బస్సులతో పాటే ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
Covid Updates: మళ్లీ కరోనా విశ్వరూపం..ఒక్కరోజే 197 మంది మృతి, తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కల్లోలం, దేశంలో తాజాగా 43,846 కొత్త కేసులు, తెలంగాణలో 394 కొత్త కోవిడ్ కేసులు నమోదు, ఏపీలో 380 మందికి కోవిడ్ పాజిటివ్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు కరోనా
Hazarath Reddyదేశంలో గ‌త‌ 24 గంట‌ల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు( Coronavirus in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు (Covid Deaths in India) పెరిగింది.
Telangana MLC Results: ఫలించిన కేసీఆర్ వ్యూహం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ రెపరెపలు, సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘన విజయం, ఓటమితో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నా‌రెడ్డి, డబ్బుతో నన్ను ఓడించారని తెలిపిన బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు, దొంగ ఓట్లతో టీఆర్ఎస్ గెలిచిందన్న తీన్మార్ మల్లన్న
Hazarath Reddyతెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి (surabhi Vanidevi), నల్లగొండ-ఖమ్మం- వరంగల్‌ స్థానంలో డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) గెలిచారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్‌ఎస్‌ నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌లో వరుసగా రెండోసారి గెలుపొందింది.
Fire at Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం, భారీ ఎత్తున చెలరేగిన మంటలు, 'ఎమ్మెల్సీ' గెలుపు సంబరాల్లో అపశృతి
Hazarath Reddyతెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశృతి (fire-broaken-in-telangana-bhavan) చోటుచేసుకుంది. హైదరాబాదు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చుతుండగా అగ్నిప్రమాదం (Fire at Telangana Bhavan) సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి.
Telangana MLC Election 2021 Results: బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ఘన విజయం, రెండవ స్థానానికి పరిమితమైన రాంచంద్రరావు, కొనసాగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
Hazarath Reddyపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఘన విజయం (trs-vani-devi wins) సాధించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది.