తెలంగాణ
Cows Slaughtered in TS: గోవధ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు, సిద్ధిపేటలో 16 గోవులను వధించి హైదరాబాద్‌లో విక్రయించిన నిందితులు
Hazarath Reddyసిద్దిపేట పట్టణంలో శుక్రవారం పట్టణ శివారులోని ఓ కోళ్ల ఫాంలో కొందరు 68 గోవులను తీసుకొచ్చి వాటిని చంపి (Cows Slaughtered in TS) మాంసాన్ని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యా రు. తొలుత 16 గోవులను వధించిన విషయం విదితమే. ఈ గోవధ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana Shocker: నడిరోడ్డుపై తండ్రిని అతి దారుణంగా చంపేసిన కొడుకు, నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లిలో దారుణ ఘటన, పోలీసులపై మండి పడుతున్న స్థానికులు
Hazarath Reddyనిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని కన్నకొడుకే తండ్రిని బండరాయితో అతిదారుణంగా (Telangana Shocker) హత్యచేశాడు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగని పెద్ద రాజన్న, లింగవ్వ దంపతుల రెండో కుమారుడు రవి వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి తాను పంపిన డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు.
India Covid Updates: దేశంలో భారీ స్థాయిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా 16,752 మందికి కరోనా, మహారాష్ట్రలో కొత్తగా 8,623 మందికి కోవిడ్, తెలంగాణలో 176 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో 118 మందికి కోవిడ్
Hazarath Reddyదేశంలో గత కొద్ది రోజులుగా నిత్యం 16వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్‌ కేసులు (India Covid Updates) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,96,731కు పెరిగాయి.
Shadnagar Road Accident: అదుపుతప్పి..పల్టీలు కొట్టి..లారీని ఢికొట్టిన కారు, ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, షాద్‌నగర్‌ బైపాస్‌ వద్ద విషాద ఘటన
Hazarath Reddyరంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ బైపాస్‌ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Shadnagar Road Accident) చోటు చేసుకుంది. హైదరాబాద్‌-బెంగళూరు జాతియ రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన కారు షాద్‌ నగర్‌ బైపాస్‌ వద్ద అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
HYD Road Accidents: నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఆర్టీసీ బస్సు కింద పడి ఒకరు మృతి, మరో చోట రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ ఇంకొకరు మృతి, హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, హెచ్చరికలు జారీ చేసిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు
Hazarath Reddyలంగాణ రాజధాని నగరంలో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని ఎంత మొత్తుకున్నా గానీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా మృతిచెందాడు. రెడ్‌ సిగ్నల్‌ జంప్‌ చేసి బస్సుకు అడ్డంగా వెళ్లి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రామచంద్రాపురం(ఆర్‌సీ పురం)లో (RC Puram Road Accident) చోటుచేసుకుంది.
Hyderabad Road Accident: తాగాడు, ట్రాఫిక్ సిగ్నల్ స్థంభానికి కారును ఢీకొట్టాడు, హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధి హస్తినపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Hyderabad Road Accident) జరిగింది. వేగంగా దూసుకువెళ్తున్న ఓ కారు(TS05FH2356) అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్థంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైనుండి మరోపక్కకి దూసుకెళ్లింది.
Covid Updates: భారీగా పెరుగుతున్న కేసులు, మార్చి 31 వరకు కోవిడ్ నిబంధనలు పొడిగింపు, కొవాగ్జిన్ కోసం భారత్‌తో బ్రెజిల్ ఒప్పందం, దేశంలో తాజాగా 16,488 మందికి కోవిడ్, తెలంగాణాలో కొత్తగా 178 కరోనా కేసులు, ఏపీలో 96 మందికి కరోనా
Hazarath Reddyకోవిడ్ నిబంధనలను మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం (Covid Rules) పొడిగించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడేందుకు పూర్తి నిఘా అవసరమని... ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలును పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
New Horticulture Policy: రైతుల సాగు ఖర్చు తగ్గించాలి, అందుకోసం వెంటనే విధి విధానాలు రూపొందించండి, హార్టికల్చర్‌ యూనివర్శిటీని మరింత బలోపేతం చేయండి, అధికారులను ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఉద్యానసాగును వీలైనంత ఎక్కువగా విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదేశించారు. నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో హార్టికల్చర్‌ విధానాన్ని రూపొందించాలని (New Horticulture Policy) వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులకు సూచించారు.
Telangana: కోవిడ్19 బులెటిన్‌ను ప్రతిరోజు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం, సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన; మూడో విడత వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
Vikas Mandaప్రతిరోజు COVID-19 బులెటిన్‌ను విడుదల చేయాలని, రాష్ట్రంలో కోవిడ్ -19 పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ స్పష్టం చేసింది. కోవిడ్ బులెటిన్ ప్రభుత్వం నిలిపివేయటంతో హైకోర్ట్ ఈ విధంగా స్పందించింది....
Passport Scam in Telangana: ఒకే అడ్రస్ మీద 32 పాస్‌పోర్టులు, సహకరించిన ఎస్సై, ఏఎస్సైపై వేటు, ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని తెలిపిన సీపీ సజ్జనార్
Hazarath Reddyనిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నుంచి రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో (Bodhan Passport Case) ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఓ ఎస్సై, మరో ఏఎస్సైపై వేటు వేశారు. వారిని కూడా అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
Ghatkesar Incident: ఘట్‌కేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన విద్యార్థిని ఆత్మహత్య, తీవ్ర విమర్శల పాలు కావడంతో మనస్తాపానికి గురై షుగర్‌ ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యా యత్నం, చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో పది రోజుల క్రితం ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్‌ కలకలం రేపిన సంగతి విదితమే. పోలీసులు దీనిపై దర్యాప్తు జరపగా అదంతా ఆ అమ్మాయి ఆడిన డ్రామా (Ghatkesar Incident) అని తెలిసింది. దీంతో యువతిపై సోషల్ మీడియా వేదికగా అనేక మంది విమర్శలు చేశారు. ఈ విమర్శలతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య (Ghatkesar Incident B Pharmacy Student attempts suicide) చేసుకుంది.
JAC Member Tries to Hit BJP Leader: బీజేపీ నేతపై చెప్పుతో దాడి, ఆ ఛానలే దాడి చేసిన వ్య‌క్తిపై ఫిర్యాదు చేయాలని తెలిపిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ పాత్ర ఉందని తెలిపిన బీజేపీ పార్టీ ఎంపి జివిఎల్ నరసింహారావు
Hazarath Reddyఓ ఛానల్ లైవ్ డిబేట్ సంధర్భంగా ఇరు పార్టీల నేతలు దూషించుకున్నారు. ఈ దూషణల పర్వం కాస్తా కొట్టుకునే దాకా వెళ్లింది. అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు కోలికపుడి శ్రీనివాస రావు మంగళవారం అమరావతిలో ఏబీఎన్ టెలివిజన్ చర్చ సందర్భంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణు వర్ధన్ రెడ్డిని తన పాదరక్షలతో దాడి (JAC member Tries to Hit BJP Leader) చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
COVID19 in TS: కోవిడ్19 సెకండ్ వేవ్ మరియు వైరస్ యొక్క కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ
Team Latestlyకేంద్రం తాజా నివేదికతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా దాదాపు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలతో వచ్చే రోగుల శాంపుల్స్ లలో కొత్త వేరియంట్లను నిర్ధారించడానికి ప్రభుత్వం నేషనల్.....
Schools Reopen: తెలంగాణలో నేటి నుంచి 6- 8 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు పున: ప్రారంభం, కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం అదేశాలు, తరగతులకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
Team Latestlyఇప్పటికే 9 మరియు పదో తరగతి క్లాసులు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు 6 నుండి 8 వతరగతి వరకు క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విషయమై తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని అధికారులకు ప్రభుత్వం సూచించింది. తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి....
Telangana Schools Reopening: రేపటి నుంచి తెలంగాణలో 6, 7, 8 తరగతులు ప్రారంభం, మార్చి 1లోపు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని తెలిపిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్రంలో ఇంకా నియంత్రణలోకి రాని కరోనా
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (State Education Minister Sabita Indrareddy) తెలిపారు. అయితే రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని (classes 6 to 8 start from Tommorrow) ఆమె మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
TS Graduate MLC Elections: రెండు స్థానాలకు వందల సంఖ్యలో అభ్యర్థుల పోటీ, తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు, మార్చి14న పోలింగ్, మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
Hazarath Reddyతెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ (TS Graduate MLC Elections) ముగిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ముగిసింది.
Young Man Commits Suicide: మెదక్ జిల్లాలో విషాదం, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు, కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించడంతో మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య
Hazarath Reddyమెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడి కుటుంబాన్ని కులపెద్దలు కుల బహిష్కరణ చేయడంతో ఆ యువకుడు ఆత్మహత్య (Medak Young Man Commits Suicide) చేసుకున్నాడు.
Peddapalli Car Accident: పెద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరి వ్యాపారులు మృతి, మరో ఇద్దరికి గాయాలు, సంఘటన స్థలంలో కోటి రూపాయల విలువ గల బంగారం, స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyపెద్దజిల్లాలోని రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (car accident in peddapalli) జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి ( jewellery business men died ) చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Jagtial Shocker: అనుమానం..కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు, మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణం, తల్లి హత్య..తండ్రి జైలుకు వెళ్లడంతో బిక్కుబిక్కుమంటున్న రోదిస్తున్న పిల్లలు, జగిత్యాలలో విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా చెర్లపల్లిలో అనుమానంతో భార్యను గొడ్డలితో ఓ భర్త నరికి చంపేశాడు. మద్యంమత్తు, కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యను (Man kills wife suspecting infidelity in Jagtial) కడతేర్చాడు.
Vikarabad EX MPP Husband Murder: తెలంగాణలో మరో హత్య, వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త వీరప్పను దారుణంగా నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణలో నడిరోడ్డు మీద లాయర్ వామనరావు దంపతుల హత్య మరచిపోకముందే మరో దారుణ హత్య చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలంలో దారుణ హత్య జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎంపీపీ భర్త వీరప్ప దారుణ హత్యకు (Vikarabad EX MPP Husband Murder) గురయ్యారు. గర్తు తెలియని దుండగులు వీరప్పను రాళ్లతో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశారు.