తెలంగాణ

Sandhya Theater Tragedy: రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అబద్దం, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన హీరో జగపతిబాబు

Hazarath Reddy

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణిస్తే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు

Sandhya Theatre Tragedy Row: పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్​ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్​ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్​ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు.

DK Aruna on Sandhya Theatre Tragedy: అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన డీకే ఆరుణ

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

Vijayashanti on Sandhya Theatre Tragedy: సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన విజయశాంతి, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ మండిపాటు

Hazarath Reddy

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Advertisement

Sandhya Theater Incident: సంధ్య థియేటర్ ఘటన, రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించే పనిలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి

Hazarath Reddy

సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది.సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే.

CV Anand Apology: జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)

Rudra

అల్లు అర్జున్- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.

Transgenders In Traffic Duties: నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌ జెండర్‌ కానిస్టేబుళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్‌ జెండర్‌ ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి విధుల్లో చేరుకోనున్నారు. మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌, ఔట్, ఇండోర్‌ తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు.

Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్

Rudra

సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.

Advertisement

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

Rudra

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం రాజస్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు అంగరంగ వైభవంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Rudra

అమెరికాలో తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు.

Allu Aravind: అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘ‌ట‌న గురించి స్పందించిన అల్లు అరవింద్, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే?

VNS

మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దేనికీ రియాక్ట్‌ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన వారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

Palla Srinivasarao: సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం, ఏపీలో అందమైన షూటింగ్ స్పాట్స్‌ ఉన్నాయన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

Arun Charagonda

అల్లు అర్జున్ ఉదంతం తరువాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం అన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అని చెప్పారు.

Advertisement

Pushpa 2 Controversy: అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం.. కేటీఆర్‌ను నమ్ముకుంటే బన్నీ రోడ్డున పడటం ఖాయమని హెచ్చరించిన బాబా ఫసీయుద్దీన్

Arun Charagonda

అల్లు అర్జున్‌‌పై మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సంచలనవ్యాఖ్యలు చేశారు. ఆయన కేటీఆర్ డైరెక్షన్‌లో నటిస్తున్నారని ఆరోపించారు. నిన్న అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందేనని విమర్శించారు. కేటీఆర్‌ను నమ్ముకుంటే అర్జున్ కుటుంబం రోడ్డున పడుతుందని వ్యాఖ్యానించారు.

Actor Jagapathi Babu: శ్రీతేజ్‌ను పరామర్శించిన హీరో జగపతిబాబు, షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ని పరామర్శించిన జగపతిబాబు, రేవతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

Arun Charagonda

షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించానని చెప్పారు హీరో జగపతిబాబు. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని... పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు.. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందన్నారు జగపతిబాబు.

MP Anil Kumar Yadav: 3 బంతుల్లో 35 రన్స్ ఇచ్చిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్...ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ను మార్చిన అంపైర్లు, వీడియో ఇదిగో

Arun Charagonda

రాజ్యసభ ఎంపీలకు, లోక్‌సభ ఎంపీలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 3 బంతుల్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వేసిన 13 బంతుల్లో 10 వైడ్స్ ఉన్నాయి. ఎంతకీ ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ని మార్చారు అంపైర్ల. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Arun Charagonda

అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని మండిపడ్డారు ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏసీపీ...మా పోలీసులు తలచుకుంటే అల్లు అర్జున్ రీల్స్ కట్ అవుతాయి - ఏసీపీ విష్ణు మూర్తి చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ లంచం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో

Arun Charagonda

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడికి పాల్పడింది ఓయూ జేఏసీ. ఓయూ జేఏసీ అల్లు అర్జున్‌ ఇంటిని ముట్టడించింది. రేవతి కుటుంబానికి బన్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అతడి వల్లే రేవతి చనిపోయిందంటూ జేఏసీ ఆరోపణలు చేసింది.

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

Arun Charagonda

సినిమా లో హీరో లు బయట పౌరులేనన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన జితేందర్..అందరూ చట్టానికి లోబడి ఉండాలన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటాం.. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకత కాదు అన్నారు.

Telangana: భద్రాచలంలో 5.25 కిలోల బాల భీముడు జననం, ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ..ఇది మూడో కాన్పు

Arun Charagonda

బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మదకం నందినికి పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాఉ. ఆపరేషన్ చేసి 5.25 కిలోలు ఉన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు వైద్యులు. కాగా, నందినికి ఇది మూడవ కాన్పు.. అంతకు ముందు ఇద్దరు కూడా మగ పిల్లలే.

MLC Balmoor Venkat On Allu Arjun: తెలుగు వాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా?, అల్లు అర్జున్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Arun Charagonda

అల్లు అర్జున్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడిన వెంకట్..అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి...ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే పశ్చాతాపం ప్రకటిస్తాడు అనుకున్నాం అన్నారు.

Advertisement
Advertisement