తెలంగాణ
Theft Caught on Camera: వీడియో ఇదిగో, డోర్ బెల్ కొట్టి మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిన దొంగ, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
Hazarath Reddyనార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్షి కోట్ సన్ సిటీలో ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో కాలింగ్ బెల్ కొట్టి తెరిచిన వెంటనే మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Online Betting Trap: ఆన్‌లైన్ బెట్టింగ్ ట్రాప్..వీసీ సజ్జనార్ ట్వీట్ వైరల్, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఎలాంటి వేశాలు వేస్తున్నారో మీరు చూడండి..
Arun Charagondaఆన్ లైన్ బెట్టింగ్ ఫ్రాడ్‌పై ట్విట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శక్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండిని సూచించారు.
Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, 24 గంటలు గడవకముందే మరో విద్యార్థిని కాటు వేసిన పాము...భయాందోళనలో విద్యార్థులు
Arun Charagondaజగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం యశ్వంత్ అనే మరో విద్యార్థికి పాము కాటు వేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్నారు యశ్వంత్. వెంటనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించింది సిబ్బంది. నిన్న అఖిల్ అనే విద్యార్థికి పాముకాటు వేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అఖిల్. గతంలో ఇదే గురుకులంలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందారు.
Telangana High Court: అధికారులకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, స్టే ఆర్డర్ ఉన్న ఇంటిని కూల్చేయడంపై ఆగ్రహం..అధికారుల సొంత ఖర్చులతో తిరిగి కట్టించాలని ఆదేశం
Arun Charagondaతెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ఇంటిని, హోటల్‌ని కూల్చేశారు అధికారులు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధికారుల సొంత ఖర్చుతో తిరిగి కట్టించి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
Balagam Mogilaiah: బలగం మూవీ నటుడు మొగిలయ్య కన్నుమూత, కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య...స్వగ్రామంలో జరగనున్న అంత్యక్రియలు
Arun Charagondaబలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మొగులయ్య..ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలపగా మొగిలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రం. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
Hyderabad: వనస్థలిపురంలో షాకింగ్ సంఘటన, కారులో మహిళ ఆత్మహత్య, పురుగుల మందు తాగి సూసైడ్...పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు
Arun Charagondaవనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇంజాపూర్ రాజశ్రీ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్నారు రామకృష్ణారెడ్డి, ఉమాశ్రీ దంపతులు. తమ కారులో కూర్చుని పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది ఉమాశ్రీ. ఉమాశ్రీ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోదరుడు.
Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, స్నానం చేసే సమయంలో కాటు వేసిన పాము..పెద్దాపూర్ గురుకులంలో ఘటన, వీడియో
Arun Charagondaగురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు కలకలం రేపింది. జగిత్యాల - పెద్దాపూర్ 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి స్నానం చేసే సమయంలో కాటు వేసింది పాము. హుటాహుటిన విద్యార్దిని ఆస్పత్రికి తరలించగా 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోంది చికిత్స.
Cherlapally Terminal: చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు. ఈ నెల 28న రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
VNSసికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గిచేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను రైల్వేశాఖ (Railway Ministry) అభివృద్ధి చేసింది. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
Hyderabad: విగ్గులు మారుస్తూ 50 మంది యువతులను పెళ్లి పేరుతో మోసం చేసిన ఘనుడు, మహిళా డాక్టర్ ని రూ.50 లక్షల మేర మోసం చేయడంతో ఘటన వెలుగులోకి..
Hazarath Reddyహైదరాబాద్‌కి చెందిన వంశీ కృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేశాడు. ప్రస్తుతం అతడి కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పేర్కొన్న వంశీ
Telangana: దారుణం, 8వ తరగతి విద్యార్థితో వంట చేయించిన ప్రిన్సిపాల్, ఒంటిపై నూనె పడటంతో తీవ్ర గాయాలు, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ తల్లిదండ్రుల డిమాండ్
Hazarath Reddyభువనగిరి - నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో వంట పనులు చేయించాడు ప్రిన్సిపాల్. అయితే వంట చేస్తుండగా విద్యార్థి ఒంటిపై నూనె పడి తీవ్ర గాయాలు అయ్యాయి
Telugu YouTuber Prasad Behara Arrest: లైంగిక వేధింపుల కేసులో తెలుగు యూట్యూబర్ ప్రసాద్ బెహర అరెస్ట్, షూటింగ్ సమయంలో తన ప్రైవేట్ భాగాలను తాకాడని యువతి ఫిర్యాదు
Hazarath Reddyప్రముఖ తెలుగు యూట్యూబర్ ప్రసాద్ బెహరను లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. తన సహచర నటిపై లైంగిక వేధింపులు చేశాడంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Telangana: నల్గొండలో ప్రిన్సిపాల్ అమానుషం, విద్యార్థినుల చేతి వేళ్లు విరిగేలా కొట్టిన ప్రిన్సిపాల్...ఎందుకో తెలిస్తే షాకవుతారు
Arun Charagondaనల్గొండ - వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావ తాగుతుండగా ప్రిన్సిపల్ జావ ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టడంతో చేతి మణికట్టు, బొటనవేలు విరిగినట్లు బాధిత విద్యార్థినులు తెలిపారు. ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: వీడియో ఇదిగో, మైలార్‌దేవ్‌పల్లిలో ఫుట్‌పాత్ ఆక్రమణలను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ, పాదచారుల భద్రత ముఖ్యమని వెల్లడి
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం మైలార్‌దేవ్‌పల్లిలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు.
Telangana TET Exam Schedule: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్, జనవరి 2 నుండి 20 వరకు టెట్ పరీక్షలు...వివరాలివే
Arun Charagondaతెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ జరగనుంది.
CM Revanth Reddy: రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, అదానీ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్
Arun Charagondaఆదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు.
Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hazarath Reddyతెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలైంది, ఉదయం 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..మంత్రులు, అదానీ వ్యవహారంపై ప్రధాని స్పందించాలని డిమాండ్
Arun Charagondaఅదానీ, మణిపూర్ అంశాలపై పర్ధాని మోడీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఇందిరాపార్క్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
Arun Charagondaకేటీఆర్ అరెస్టు అయితే పుష్ప -3 లెవెల్ లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయినప్పుడు ప్రజల సానుభూతి లభించిందన్నారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు...కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో నాలుగు కేసులు నమోదు, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా పోస్టులు
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు...నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.