తెలంగాణ
GST Notices To Zomato: జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు, కస్టమర్ల నుండి వసూలు చేసిన రూ.803.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశం
Arun Charagondaప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొంది.ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
Telangana: గంట ముందే స్కూల్ నుండి వెళ్లిందని విద్యార్థిని చెయ్యి విరగ్గొట్టిన టీచర్, స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaనిజామాబాద్ - దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో నుంచి గంట ముందే పదో తరగతి విద్యార్థిని(అశ్విత) ఇంటికి వెళ్లింది.. అయితే ఆగ్రహించిన టీచర్ మరుసటి రోజు ఉదయం విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థిని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.విద్యార్థినిని కొట్టిన మహిళా టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad: ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ చేసుకుని తాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, భర్త వేధింపులే కారణమని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
Arun Charagondaఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ లో భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగలక్ష్మి. 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మికి వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది నాగలక్ష్మీ. భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి తల్లితండ్రులు.
Harishrao: ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు వృధా, కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు కాదు విద్యార్థులకు అన్నం పెట్టాలని హరీశ్ రావు ఫైర్
Arun Charagonda3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ అకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హరీష్ రావు.
Mohan Babu Apologize: ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెబుతున్నా.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మోహన్ బాబు లేఖ
Rudraతన నివాసం వద్ద టీవీ9 రిపోర్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి సదరు జర్నలిస్టుకు నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు.
Restrictions On New Year Celebrations: హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు.. జైలుకు కూడా పంపించొచ్చు.. జాగ్రత్త మరి..!!
Rudraన్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సిటీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో)
Rudraహైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో యూపీకి చెందిన సిరాజ్ అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Google Doodle 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్ భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు గూగుల్ వినూత్న డూడుల్
Rudraసందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్ ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Rudraతెలంగాణను చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
Revanth Reddy Meets Nitin Gadkari: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సుధీర్ఘ భేటీ, RRR అనుమతులు సహా అనేక అంశాలపై చర్చ
VNSఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు.
Hyderabad: కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో వ్యభిచారం, 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరిక
Hazarath Reddyకేపీహెచ్‌బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.
Jagga Reddy: ఏఐసీసీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్, పార్టీని చంపేయాలని చూస్తున్నారు..అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? అని మండిపాటు
Arun Charagondaఅధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? చెప్పాలని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు...ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? చెప్పాలన్నారు. దీపాదాస్ మున్షీ ఉందా? ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా?, కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా? ఫైనల్ అయ్యేవరకు మాకు చెప్పరా? అని మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి.
Mandakrishna Madiga: కేబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలి, మాదిగలంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు తగదన్నమందకృష్ణ మాదిగ,తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్న?
Arun Charagondaమాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ..కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మాదిగలకు పలుకుబడి లేదు అన్నారు.
MLA Raja Singh on Mohan Babu: జర్నలిస్టు దాడి ఘటనపై మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్
Hazarath Reddyజర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు.మోహన్ బాబు ఫ్యామీలి గొడవల్లో వారి కొడుకు మీడియాను పిలవడం వల్లే హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. మోహన్ బాబు మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది.. అని తెలిపారు.
Telangana: దారుణం, స్కూల్ నుంచి గంట ముందు ఇంటికి వెళ్లిందని విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్, దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
Hazarath Reddyస్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టింది ఓ టీచర్. నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు
Arun Charagondaముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు...కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి...అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? చెప్పాలన్నారు.
AP Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్‌పై గెలుపు
Arun Charagondaతెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. జితేందర్ రెడ్డి , మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీ నాథ్‌కి మధ్య ఎన్నిక జరగగా.. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జితేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.
Hyderabad: లాల్‌దర్వాజ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం, పసుపులో కుడికాలి పాదం..క్యూ కడుతున్న భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం జరిగింది. పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Telangana Shocker: ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి, ట్రేడింగ్‌లో కొడుక్కి నష్టాలు రావడంతో గడ్డి మందు తాగిన కుటుంబం..నలుగురు మృతి
Arun Charagondaఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి అయింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) అప్పు చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేశాడు. అందులో నష్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువవడంతో తండ్రి మొండయ్య(60), తల్లి శ్రీదేవి(54), అక్క చైతన్య(30)తో కలిసి గడ్డి మందు తాగాడు.వరంగల్ ఏంజీఏం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు.
Warangal: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి, మాదన్నపేట చెరువు మత్తడి వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు...వీడియో
Arun Charagondaవరంగల్ - నర్సంపేట పట్టణంలో నర్సింహులు పేటకు చెందిన ముగ్గురు యువకులు నర్సంపేటలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాదన్నపేట చెరువు మత్తడి వద్ద వారి కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. దీంతో వెంటనే ఇద్దరిని కాపాడగా.. మరో యువకుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.