తెలంగాణ
CM Revanth Reddy: UPSC విజేతలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా రూ.లక్ష ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం
Arun Charagondaతెలంగాణ నుంచి #UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు
KTR Open Letter To Rahul Gandhi: మూటలపై ఉన్న శ్రద్థ, మీరిచ్చిన మాటలపై లేదా? రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
VNSచేతి గుర్తుకు ఓటేస్తే చేతగానీ ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని అన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని మండిపడ్డారు.
Manchu Manoj Bindover: మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం, రాచకొండ కమిషనర్ ముందు మంచు మనోజ్ బైండోవర్
VNSమంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు.
Droupadi Murmu Telangana Tour: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన ఖరారు, మహిళావర్సిటీతో పాటూ పలు ప్రాంతాల్లో టూర్
VNSరాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు
Cold Wave in Telugu States: హైదరాబాద్ గజగజ, రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం, ఏపీలోనూ పడిపోయిన ఉష్ణోగ్రతలు
VNSబుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గి 29.3 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీలు తగ్గి 17.7 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) అధికారులు వెల్లడించారు.
Allu Arjun Approached High Court: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో కేసు కొట్టివేయాలని పిటీషన్
VNSహీరో అల్లు అర్జున్ హైకోర్టును (High Court) ఆశ్రయించాడు. హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.
Hyderabad Fire: వీడియో ఇదిగో, హైదరాబాద్ నాంపల్లి పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, పరుగులు పెట్టిన స్థానికులు, నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత
Hazarath Reddyహైదరాబాద్ నాంపల్లిలోని ఏక్‌మినార్ కూడలి వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ నింపడానికి హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ సమయంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు.
Telangana: వీడియో ఇదిగో, రెండు కరెంట్ స్థంభాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆటో, భయంతో కేకలు పెట్టిన విద్యార్థులు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బై పాస్ రోడ్డు లో స్కూల్ నుండి విద్యార్దులను ఇంటికి తీసుకెతున్న ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి రెండు స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది.
Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని క్లాస్ నుండి బహిష్కరించిన యాజమాన్యం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్
Hazarath Reddyహైదరాబాద్ లో ఓ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కొంపెల్లిలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్‌లో అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ విద్యార్థిని క్లాస్ రూమ్‌కి అనుమతించకుండా ఇంటికి పంపింది స్కూల్ యాజమాన్యం. అ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. స్కూలు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
BRS Vinod Kumar: కమీషన్లు అన్నం పెట్టవు..వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. ఎస్సారెస్పీ ఫేస్ 1, ఫేస్ 2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు అన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం...రైతులకు యాసంగి పంట ముఖ్యమైందన్నారు.
Gas Cylinder Explosion: వీడియో ఇదిగో, గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు, భారీగా ఆస్తి నష్టం
Hazarath Reddyగ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు అయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోస పహాడ్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్దం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Manchu Family Dispute: ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు
Hazarath Reddyటాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచారు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Telangana: సారంగపూర్ కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులకు అస్వస్థత, ఆరుగురిని ఆస్పత్రికి తరలింపు...పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు
Arun Charagondaజగిత్యాల జిల్లా సారంగపూర్ KGBV పాఠశాలలో అస్వస్థత కు గురయ్యారు విద్యార్థులు. ఆరుగురు విద్యార్థులకు అస్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర చలితో కాళ్లు చేతులు తిమ్మిర్లు వచ్చాయని తెలియగా ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు వైద్యులు.
Telangana: రైల్వే పట్టాలపై పులి సంచారం, వీడియో తీసిన రైల్వే అధికారులు...కొమురం భీం జిల్లాలో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaకొమురం భీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. వేంపల్లి రైల్వే క్యాబిన్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం రైల్వే సిబ్బందికి పులి కంట పడింది. పులి రైల్వే ట్రాక్ దాటుతుండగా సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పులి సంచారంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Telangana: నల్గొండలో దారుణం, భూ వివాదం..గొడ్డలితో దాడి చేసుకున్న అన్నదమ్ముల పిల్లలు...వీడియో ఇదిగో
Arun Charagondaభూవివాదం నేపథ్యంలో గొడ్డలితో దాడి చేసుకున్నారు సొంత అన్నదమ్ముల పిల్లలు. ఈ ఘటనలో నలుగురికి గాయాలుకాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఘటన చోటు చేసుకోగా గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తిప్పర్తి పోలీసులు.
CM Revanth Reddy: ఢీల్లీ, జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మూడు రోజుల పర్యటన, ఈసారైనా నామినేటెడ్ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చేనా?
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 11,12,13 మూడు రోజుల పాటు ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్... అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు
Vikarabad Food Poisoning: తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 30 మంద విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Hazarath Reddyవికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్‌లో వండిన ఆహారం తిని 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Telangana:వీడియో ఇదిగో, అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఆన్ లైన్ షేర్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టి లాస్
Hazarath Reddyమంచిర్యాల జిల్లాలో అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తాండూరు మండలం కాసిపేట్‌లో కిరణాషాపు, పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు.కుమార్తె చైతన్య వికలాంగురాలు
Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)
Rudraతమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు
Rudraమంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ ఒకరికపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.