తెలంగాణ

Vikarabad: కూతురు కళ్ల ముందే బావిలో దూకేసిన తల్లి - కొడుకు, వికారాబాద్‌లో విషాదం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం గేటువనంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురు, కొడుకును పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ అనే మహిళ. కూతురు ఏడవడంతో ఇంటికి పంపించేసి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Medak: మెదక్‌లో ముసుగుదొంగ, 4 రోజులుగా వరుస దొంగతనాలు...పోలీసులకు సవాల్‌గా మారిన దొంగతనాలు..సీసీటీవీ వీడియో

Arun Charagonda

మెదక్ జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నాడు ముసుగు దొంగ. పాపన్నపేట మండలంలో గత 4 రోజులుగా అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడుతున్నాడు అగంతకుడు. ఇంటి బయట ఏ వస్తువులున్నా ఎత్తుకెళ్తున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

Telangana: మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, వీల్ ఛైర్‌లో ఉన్న మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు..కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని కోడలు..వీడియో ఇదిగో

Arun Charagonda

మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది ఓ కోడలు. నల్గొండ - వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామ పై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది . కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు కోడలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

KCR BRSLP Meeting: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చ

Rudra

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది.

Advertisement

Raging in School: స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మహబూబాబాద్ లో ఘటన

Rudra

మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు.

CM Revanth Reddy: ఎన్ని కష్టాలైనా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం...సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు..స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అన్నారు.

Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన

Rudra

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.

Traffic Restrictions At Tankbund: ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఈ వేళ‌ల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తూ నిర్ణ‌యం

VNS

వాయుసేన విమానాలు విన్యాసాలు ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Bandi Sanjay Slams CM Revanth Reddy: ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే తెలంగాణ‌లో కాంగ్రెస్ కు మూడో స్థాన‌మే, రేవంత్ రెడ్డి పాల‌నపై బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

VNS

మనం కొట్లాడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (bandi Sanjay) అన్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ (BJP) గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీవీలు చూపిస్తున్నాయని నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) మండిపడ్డారు.

Telangana Govt Gazette on GP Merging: ఓఆర్ఆర్ స‌మీప మున్సిపాలిటీల్లో 51 గ్రామ పంచాయ‌తీల విలీనం, గెజిట్ విడుద‌ల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

VNS

హైదరాబాద్‌ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Pushpa 2 Success Meet: ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అల్లు అర్జున్, స‌క్సెస్ మీట్ లో ప‌వ‌న్ పేరు ఎత్త‌గానే క్రేజ్ మామూలుగా లేదు

VNS

ధరల పెంపునకు అనుతిచ్చి రికార్డుల సాధనకు సహకరించారన్నారు. ఏపీలో టికెట్ రేట్లు పెంచినందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు థ్యాంక్స్ అంటూ చెప్పారు అల్లు అర్జున్. అయితే వెంట‌నే హాల్ మొత్తం హోరెత్తింది. దీంతో నా ప‌ర్స‌న‌ల్ నోట్ గా థ్యాంక్యూ క‌ల్యాణ్ బాబాయ్ అన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి..నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని మండిపాటు

Arun Charagonda

సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా జీబీ గూడెం గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలు సభలో పాల్గొని ప్రసంగించారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా నుంచే అనేక మంది ప్రాతినిధ్యం వహించారు అన్నారు.

Advertisement

Ponnam Prabhakar Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా వినతి, రాజకీయాలు చర్చించలేదన్న పొన్నం

Arun Charagonda

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్‌ను ఆహ్వానించాం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 9న సచివాలయంలో జరిగే విగ్రహావిష్కరణకు ప్రోటోకాల్ అధికారులతో కలిసి కేసీఆర్‌‌కు ఆహ్వానం అందించాం అని చెప్పారు

KTR: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం..పోయింది అధికారమే కానీ పోరాడేతత్వం కాదన్న కేటీఆర్, రసమయి రూపొందించిన పాట రిలీజ్

Arun Charagonda

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కెసిఅర్ పదవి త్యాగం నుంచి మొదలైన పార్టీ ప్రయాణం ఆయన ప్రాణత్యాగం దాకా సాగిందని, అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పోయింది అధికారమే, కానీ ప్రజల కోసం పోరాడే పార్టీ లక్షణం కాదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అంతే నిబద్దతతో పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.

Minister Seethakka: క్రికెట్ ఆడిన మంత్రి సీతక్క, భార‌త్ జోడో యాత్ర స్పూర్తితో క్రీడా పోటీలు నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ

Arun Charagonda

ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో స‌న‌త్ న‌గ‌ర్ ఎంసీహెచ్ గ్రౌండ్‌లో జ‌రిగిన భార‌త్ జోడో స్పోర్ట్స్ మీట్‌కి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు మంత్రి సీత‌క్క. కాసేపు బ్యాటింగ్‌ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర స్పూర్తితో క్రీడా పోటీలు నిర్వ‌హించ‌డంపై నిర్వాహకులను అభినందించారు సీత‌క్క‌.

Earthquake In Mahbubnagar: తెలంగాణలో మరోసారి భూకంపం..మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు

Arun Charagonda

తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్ నగర్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 భూకంప తీవ్రత నమోదుకాగా భయంతో ప్రజలు పరుగులు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

KTR: రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ..రైతులు ఆశపడతారు కానీ అడుక్కోరు, కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించిన కేటీఆర్...రైతులకు మేలు చేసింది బీఆర్ఎస్ అని వెల్లడి

Arun Charagonda

కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు. అడగకుండానే రైతుబంధు,అడగకుండానే రైతుబీమా,అడగకుండానే సాగునీళ్లు, అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు,అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు ఇవన్నీ ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.

MP Kirankumar Reddy: రాహుల్ గాంధీపై దుష్ప్రచారం..గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు, కేసు నమోదు చేయాలని హయత్‌నగర్ పీఎస్‌లో కంప్లైంట్

Arun Charagonda

బీజేపీ గుజరాత్ అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌పై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ గుజరాత్ ఎక్స్ ఖాతాలో మార్ఫింగ్ ఇమేజ్ పోస్టు చేసి రాహుల్ గాంధీ నల్లధనం కలిగి ఉన్నారంటూ దుష్ర్పచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత న్యాయ సంహిత, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Telangana: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..డేట్ అయిపోయిన మెడిసిన్స్ విద్యార్థులకు ఇచ్చిన వైద్య సిబ్బంది, మండిపడుతున్న తల్లిదండ్రులు...వీడియో

Arun Charagonda

గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చారు వైద్య సిబ్బంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరిలోనే ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలోని చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చారు వైద్య సిబ్బంది. నిన్ననే మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇచ్చారని చెప్తున్న అటెండర్..ఒక వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే.. మరో వైపు డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నారని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు.

Hyderabad: ఆంబులెన్స్‌ చోరి...సినిమా స్టైల్‌లో చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..పారిపోయే క్రమంలో ఏఎస్‌ఐని ఢీకొట్టిన దొంగ..తీవ్ర గాయాలు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌లో ఆంబులెన్స్‌ను ఎత్తుకుపోయాడు ఓ దొంగ. సినిమా స్టైల్లో అంబులెన్స్‌ను చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ - హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోయాడు దొంగ. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు.

Advertisement
Advertisement