తెలంగాణ

Veerlapalli Shankar: నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా..వెలమ కులస్తుల్ని తిట్టలేదు, కేసీఆర్‌ కుటుంబాన్నే తిట్టానని స్పష్టం చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Arun Charagonda

నా మాటలను వెనుకకు తీసుకుంటున్నాను అన్నారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వెలమ కులస్తుల్ని దృష్టిలో పెట్టుకుని నేను తిట్టలేదు అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వెలమ కుటుంబం అని తిట్టాను తప్ప వేరే వారిని అనలేదు అని స్పష్టం చేశారు.

Hyderabad: 2254 కిలోల భారీ కేక్.....గిన్నిస్ రికార్డ్స్ లో చోటు, భారీ కేకును తయారుచేసిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ

Arun Charagonda

హైదరాబాద్ కు చెందిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ అద్భుతం సృష్టించింది. 2254 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్ ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. 200 మంది చెఫ్ లు 90 రోజులపాటు శ్రమించి ఈ భారీ కేక్ ను తయారు చేశారు. తేనె, వెన్న, క్యారమెల్, చీజ్ క్రీమ్ వంటివి వాడి కేక్ తయారు చేశారు.

Vemulawada Temple: వివాదంలో మంత్రి కొండా సురేఖ..భక్తులు విరాళంగా ఇచ్చిన కోడెల విక్రయం, మంత్రి సిఫారసుతోనే జరిగిందని భక్తుల ఫైర్, వీడియో ఇదిగో

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న కోడెల విక్రయం కలకలం రేపింది. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడేలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. 49 కోడెలను అక్రమంగా విక్రయించారు రాంబాబు. దైవభక్తితో భక్తులు రాజన్నకు సమర్పించిన కోడలను మంత్రి సిఫారసుతో రాంబాబు పొంది విక్రయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

SI Suicide Case: ఎస్సీ - ఎస్టీ కేసు....ఆత్మహత్య డ్రామా...వెరసీ ఎస్‌ఐ ఆత్మహత్య..వాజేడు ఎస్‌ఐ హరీష్ ఘటనలో పోలీసుల నిర్థారణ

Arun Charagonda

వాజేడు SI ఆత్మహత్య ఘటనలో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేటలో ఇద్దరు యువకులను, ఓ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది యువతి. పరిచయం పెంచుకుని ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసింది.

Advertisement

CM Revanth Reddy: విద్యార్థులకు వేడి భోజనం, ప్రతీరోజు ప్రిన్సిపాల్- మెస్ ఇంఛార్జీ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం పెట్టాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు

Arun Charagonda

గురుకులాల్లో, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వంట వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్ఛార్జి రుచి చూడాలి.. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలన్నారు. సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలి.. రెండు పూటలకు పప్పు ఒకేసారి వండకూడదు అన్నారు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి.. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదంటూ ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు.

Ponnam Meets KCR: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??

Rudra

తెలంగాణలో నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్‌ ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు.

Viral Video: ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తలపెట్టిన చిన్నారి.. ఇరుక్కుపోయిన తల.. ఆ తర్వాత ఏమైంది? (వీడియో)

Rudra

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో తృటిలో ఓ చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పిల్లర్ల మధ్య తల పెట్టింది.

Dil Raju As TFDC Chairman: టీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్‌ గా నిర్మాత‌ దిల్ రాజు.. తెలంగాణ ప్రభుత్వం నియామకం

Rudra

ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌విలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌ మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌ డీసీ) ఛైర్మ‌న్‌ గా రాజును నియ‌మిస్తున్నట్టు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

Rudra

ఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

Accident in Yadadri: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మ‌ర‌ణం.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

Rudra

తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఓ కారు అదుపుత‌ప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

Shadnagar MLA Controversial Comments: వెల‌మ‌ల భ‌ర‌తం ప‌డ‌తం, ఉరికిచ్చి కొడ‌తం! షాద్ న‌గ‌ర్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

VNS

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ (Veerlapalli Shankar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై (Velama) భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్‌ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Pickup Vans For TGSRTC Passengers: ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్, దూర ప్రాంత ప్ర‌యాణికుల కోసం పికప్ వ్యాన్లు, తొలుత ఈ రూట్ లో ప్రారంభం

VNS

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల (Pick Up vans) సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది.

Advertisement

Cabinet Approves New KVs: తెలుగు రాష్ట్రాల‌కు గుడ్ న్యూస్, కొత్త కేంద్రీయ విద్యాల‌య‌, న‌వోద‌య విద్యాల‌యాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

VNS

దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalaya), 28 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalaya) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

KCR Meeting With Party MLAs & MLCs: రంగంలోకి కేసీఆర్, అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు, ఈ నెల 8న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో కీల‌క భేటీ

VNS

ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు (Telangana Assembly) ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ (KCR). ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం కానున్నారు.

Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎవరైనా హడావుడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఫ్రెండ్లీ పోలీస్ ప్రజల కోసమేనని నేరగాళ్లకు కాదని అన్నారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనని తెలిపారు. అత్యధికంగా కష్టపడేది పోలీసులే.. విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే అని సీఎం అన్నారు. ప్రజా పాలనలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందని రాజకీయ ఒత్తిళ్లు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Telangana: తెలంగాణలో హోంగార్డుల దినసరి భత్యం రూ.921 నుంచి రూ.1000కి పెంపు, శుభవార్తను అందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Hazarath Reddy

Advertisement

Telangana: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య, కాలేజ్ బయట ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు

Hazarath Reddy

హైదరాబాద్‌ దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని హస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తను ఉండే హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

Hazarath Reddy

ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.

Patnam Narender Reddy: పోలీస్ కస్టడీకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రెండు రోజుల విచారణకు అనుమతిచ్చిన న్యాయస్థానం

Arun Charagonda

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడికి విధించింది న్యాయస్థానం. రెండు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. రేపు, ఎల్లుండి నరేందర్ రెడ్డిని విచారించనున్నారు పోలీసులు.

Hyderabad: వీడియో ఇదిగో, మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద పార్కింగ్‌ చేసిన బైక్‌లు మంటల్లో దగ్ధం

Hazarath Reddy

మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్‌ కింద పార్క్‌ చేసిన ఐదు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Advertisement
Advertisement