తెలంగాణ
Telangana BJP: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ చార్జ్‌షీట్, సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలపై డిసెంబర్ 6న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి
Arun Charagondaకాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. డిసెంబర్ 6న కాంగ్రెస్ వైఫల్యాలపై భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేపట్టే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, రైతుల పక్షాన పోరాడతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Shocker: నర్సాపూర్‌లో దారుణం..పెట్రోల్ పోసి మహిళ దారుణ హత్య, మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..పందులు..షాకింగ్ వీడియో
Arun Charagondaమెదక్ జిల్లా నర్సాపూర్‌లో దారునం జరిగింది. పెట్రోల్ పోసి మహిళను హత్య చేశారు దుండగులు. నర్సాపూర్ నియోజకవర్గం హాత్నూర (మం) గ్రామ శివారులో ఘటన చోటు చేసుకోగా నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతినగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Nadendla Manohar: కాకినాడ పోర్టును లాక్కునేందుకు జగన్ దౌర్జన్యం, కేవీ రావు కుటుంబాన్ని హింసించారు...జగన్‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్
Arun Charagondaకాకినాడ పోర్ట్ ను తన చేతుల్లోకి లాక్కోడానికి జగన్ ఎందుకు ఇంత దౌర్జన్యం చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల... కేవీ రావు కుటుంబాన్ని జగన్ ఎందుకు హింసించాడు? చెప్పాలన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా 41% షేర్లను అరబిందోకి కట్టబెట్టారు...దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.
Controversy On MLA Vivek Birthday: వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ బర్త్ డే వేడుకలు, ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులు..వీడియో వైరల్
Arun Charagondaకాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు పోలీసులు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు చేయగా వారితో కలిసి చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్, మందమర్రి పోలీసులు సైతం పాల్గొన్నారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Khammam: చేపల వేటకు వెళ్లి మోరీలో ఇరుక్కుపోయిన వ్యక్తి, , ఖమ్మం జిల్లా మధిరలో ఘటన..జేసీబీ సాయంతో సహాయక చర్యలు..వీడియో ఇదిగో
Arun Charagondaచేపల వేటకు వెళ్లి మోరీలో ఇరుక్కుపోయాడు ఓ వ్యక్తి. ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిపురం టోల్గేట్ సమీపంలో ఓ వ్యక్తి చేపలు వేటకు వెళ్లి అక్కడ ఉన్న మోరీలు ఇరుక్కుపోయాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి వెంటనే జెసిపి సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
Malala Simha Garjana Sabha: మాలల సింహగర్జన సభ, కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..అంబేద్కర్ అభయ హస్తం పథకంపై తెలంగాణ సీఎం ప్రకటన
Arun Charagondaసికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇవాళ మాలల సింహగర్జన సభ జరగనున్న సంగతి తెలిసిందే. మాలల సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. 200మంది అతిథులు కూర్చునేలా వేదికను సిద్దం చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ నీటి వాటాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ అనుమతులు తీసుకోవాలని సూచన
Arun Charagondaకృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని నీటి పారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు.
AEE Nikhesh Kumar: అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేశ్ కుమార్ అరెస్ట్.. 14 రోజులు రిమాండ్
Rudraఅక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
Black Magic in Stream: మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం, బట్టలను వదిలేసి వాగులో క్షుద్ర పూజల కలకలం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం (వీడియో)
Rudraజయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కుదురుపల్లి గ్రామానికి చెందిన యువకులు వాకింగ్ కు వెళ్లగా వాగులో క్షుద్ర పూజలు చూసి భయాందోళనలకు గురయ్యారు.
Hyderabad: రోడ్డుపై పడ్డ ఆయిల్.. బైకులు స్కిడ్ అయి 60 మందికి గాయాలు..నాగారం రోడ్డుపై ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaనాగారం - ఎస్వీ నగర్ మెయిన్ రోడ్డుపై ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ నుండి ఆయిల్ లీక్ అయింది. అది గమనించని బైకర్స్ ఆయిల్ మీద నుండి వెళ్లి స్కిడ్ అవడంతో 60 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి ఆయిల్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CM Revanth Reddy: పాలమూరును అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు, రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ.. , రైతు సంక్షేమంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
Arun Charagondaఅధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
Horrific Accident in Hyderabad: హైదరాబాద్ రోడ్డుపై డీజిల్ లీక్.. జారి పడిపోయిన 70 మంది వాహనదారులు.. ఒకరి మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుషాయిగూడ డీమార్ట్ నుంచి నాగారం వరకూ రోడ్డుపై డీజిల్ లీక్ అయ్యింది. ఇది గమనించకపోవడంతో బైక్స్ పై అటుగా వెళ్లిన దాదాపు 60 నుంచి 70 మంది వాహనదారులు రోడ్డు మీద జారిపడ్డారు.
Encounter in Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Rudraతెలంగాణలోని దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Cyclone 'Fengal' Update: వణికిస్తున్న'ఫెంగల్' తుఫాను.. తమిళనాడు సహా దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. తూర్పు తెలంగాణలోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుఫాను తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటింది.
Harish Rao Challenge To Revanth Reddy: కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్, నిరూపించేందుకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరిన హరీష్ రావు
VNSముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా..? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా..?అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Hydraa Police Station: లొటస్ పాండ్ లో ఎకరం కబ్జా చేసేందుకు యత్నం, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్, రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
VNSచెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ఎక్కువగా దృష్టిపెట్టామన్న రంగనాథ్.. లోటస్‌పాండ్‌లో (Lotus Pond) ఏకంగా ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు.
Cyclone Fengal Update: తీరం దాటిన ఫెంగల్ తుఫాన్, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం
VNSతుఫాను ప్రభావంతో చెన్నైలో వర్షాలు కొనసాగుతున్నాయి. చెన్నై విమానాన్ని తాత్కాలికంగా మూసివేయగా.. పలు విమానాలు రద్దయ్యాయి. వర్షాలతో హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై మధ్య నడవాల్సిన విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
Teegala Krishna Reddy: టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీటీడీపీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం!
Arun Charagondaతెలంగాణ టీడీపీపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే టీటీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు. డిసెంబర్ 3న టీడీపీలో చేరనున్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. చేరిక అనంతరం తీగలకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు చంద్రబాబు.
Hyderabad: కీచక టీచర్... విద్యార్థినితో తప్పుడు ప్రవర్తన, కాలేజీ ముందు విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళన
Arun Charagondaచదువు చెప్పాల్సిన టీచర్ కీచకుడిగా మారాడు. విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. తప్పుగా ప్రవర్తించిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను కాలేజీ నుంచి తొలగించింది యాజమాన్యం.
Cyclone Fengal Updates: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు!
Arun Charagondaనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.