తెలంగాణ
BRS Deeksha Diwas: నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది.
AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా
Rudraఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.
Class 10 Exam Pattern Revised: పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు, తెలంగాణ సర్కారు తెచ్చిన కొత్త రూల్ ఇదే
VNSపదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ లో (Tenth Exams) ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 శాతం మార్కులతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ పేర్కొంది.
Court Summons To Konda Surekha: మంత్రి కొండా సురేఖకు ఎదురుదెబ్బ, నాగార్జున పిటీషన్ పై సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు
VNSదేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna) వేసిన పరువునష్టం కేసులో మంత్రి సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణను నాంపల్లి కోర్టు Nampally Court( డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రి సురేఖను కోర్టు ఆదేశించింది.
Telangana: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన
Hazarath Reddyమాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఖండించింది.
Telangana Fire: వీడియో ఇదిగో, వాంటో సుట్‌కేస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బోర్లగూడెం గ్రామంలో ఉన్న వంటో సూట్‌కేస్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.
Allu Arjun: డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం అంటూ వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని పిలుపు
Hazarath Reddyడ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం అంటూ ఎక్స్ వేదికగా అల్లుఅర్జున్ వీడియో షేర్ చేశారు. ఇందులో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ స్పెషల్ వీడియో షేర్ చేశారు.
Khammam: హాస్టల్‌లో సీనియర్ వర్సెస్ జూనియర్‌ల మధ్య ఘర్షణ..మద్యం తాగి వచ్చాడని జూనియర్‌ను అనుమతించని సీనియర్లు..గొడవ పెరిగి కర్రలతో దాడి..వీడియో ఇదిగో
Arun Charagondaగురుకుల హాస్టల్ లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో సీనియర్, జూనియర్ల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి మద్యం తాగి వచ్చాడని జూనియర్ వేణును హాస్టల్ లోకి అనుమతించలేదు సీనియర్లు. దీంతో వేణు, సీనియర్ల మధ్య వాగ్వాదం జరుగగా వేణుపై కర్రలతో దాడి చేశారు సీనియర్లు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Telangana: ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫుడ్ సేఫ్టిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.. కమిటీ సభ్యులు తిన్నాకే పిల్లలకు ఆహారం పెట్టాలని ఆదేశం
Arun Charagondaతెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్, గురుకులాలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్పటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ / వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసింది.
MLC Jeevan Reddy: గురుకుల సిబ్బందిపై ఎమ్మెల్సీ జీవన్ ఫైర్..అల్లీపూర్ గురుకులాన్ని తనిఖీ చేసిన జీవన్ రెడ్డి..నాసిరకం భోజనం పెడతారా అని సిబ్బందిపై మండిపాటు
Arun Charagondaగురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు. పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం అని ప్రశ్నించారు.అన్నం ఉడకలేదు... నీళ్ల పప్పు, నీళ్ల చారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారు? అని మండిపడ్డారు. మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేయాలని సూచించిన తెలంగాణ సీఎం
Arun Charagondaయావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు.
Hyderabad: వామ్మో..చికెన్ కబాబ్‌లో ఎలుక మలం, లక్డికపూల్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు
Hazarath Reddyలక్డికాపూల్‌లో ఆహార భద్రత దాడుల్లో ఎలుకల మలం, సజీవ బొద్దింకలు కనుగొనబడ్డాయి. ప్రసిద్ధ బడేమియా కబాబ్ కూడా నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడింది. పేలవమైన పరిశుభ్రత, భద్రతా ప్రమాణాల గురించి దిగ్భ్రాంతికరమైన వెల్లడిలో, ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ లక్డికాపూల్‌లోని మూడు ప్రముఖ తినుబండారాలపై దాడులు నిర్వహించింది
CM Revanth Reddy: వసతి గృహాల ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం, తప్పుడు ప్రచారం చేస్తే శిక్షిస్తామని హెచ్చరిక
Arun Charagondaవసతిగృహాల్లో తరచూ ఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు. ఆదేశం. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలన్నారు.
Telangana: అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు..మహబూబాబాద్ బస్ డిపో సిబ్బందిపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం...వీడియో ఇదిగో
Arun Charagondaఅయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బందిపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించినవారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని ...ఈ రోజు డిపో ముట్టడికి పిలుపునిచ్చారు.
Telangana: సాంబారు,చట్నీలో బొద్దింక..మహబూబ్ నగర్ ఎస్సీ బాలికల హాస్టల్‌లో కలకలం...విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులకు బెదిరింపులు
Arun Charagondaమహబూబ్ నగర్ - పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో సాంబారు, చట్నీలో బొద్దింక రావడం కలంకలం రేపింది. ఈ విషయమై వంట సిబ్బందిని అడిగితే ఇంట్లో బొద్దింక వస్తే తీసేసి తినమా అంటూ విద్యార్థులను బెదిరించారు వంట సిబ్బంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంబారులో బొద్దింక వచ్చిందంటే ప్లేట్లోంచి పడేసి తినాలని సిబ్బంది చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని మండి పడ్డారు.
Harish Rao On Rythu Bharosa: రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Arun Charagondaప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
BRS Gurukula Bata: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరశంఖం, గురుకుల బాటకు పిలుపునిచ్చిన కేటీఆర్
VNSనవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గురుకుల బాట (Gurukula Bata) కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు(KGBVB), మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, సరోగసి కోసం ఇంటికి పిలిచి లైంగిక వేధింపులు, అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తుపై నుండి దూకి చనిపోయిన మహిళ
Hazarath Reddyహైదరాబాద్ మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ మృతిచెందింది. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను రాజేష్ బాబు అనే వ్యక్తి తెచ్చుకున్నారు.
Telangana: మానవత్వమా నువ్వెక్కడా?, కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు..కాలు విరిగి ఎనమిది రోజులుగా స్మశానంలోనే వృద్ధురాలు...వీడియో వైరల్
Arun Charagondaమానవత్వం మంటగలిసింది. జగిత్యాలలో కన్నతల్లిని స్మశానంలో వదిలేశారు కసాయి కొడుకులు. గత ఎనిమిది రోజులుగా స్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ ఉంది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదాడు కుమారుడు. కాలు విరగడంతో అచేతన స్థితిలో రాజవ్వ ఉండగా నలుగురు కొడుకులు ఉన్నా ఏం ప్రయోజనం లేదని వాపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించారు.
Telangana: అవమానం భరించలేక మంజీరా నదిలో దూకిన తల్లీకొడుకులు మృతి, ఆటో దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తీవ్ర మనస్థాపం
Hazarath Reddyదొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది.