తెలంగాణ

Telangana: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు..దిలావర్‌పూర్‌లో రైతుల ఆందోళన,ఆర్డీవో కారు ధ్వసం, రైతుల అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

Arun Charagonda

లగచర్ల లొల్లి మరువకముందే దిలావర్‌పూర్‌లో మొదలైంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని ఆమెను ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.

V Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కారుపై దాడి, ఇంటి ముందు పార్క్‌ చేసిన కారుపై రాళ్ల దాడి...పోలీసులకు ఫిర్యాదు, వీడియో ఇదిగో

Arun Charagonda

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్ళతో దాడి జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Hyderabad: మణికొండలోని అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం,ఈఐపీఎల్‌ అపార్ట్‌మెంట్‌ 9వ అంతస్తులో ప్రమాదం...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. మణికొండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో అపార్ట్‌మెంట్ వాసులు బయటికి పరుగులు తీశారు.

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

Arun Charagonda

తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్ల‌ను భార‌త విమాన‌యాన సంస్థ (AAI)కి అంద‌జేసినట్టు తెలిపారు.

Advertisement

CM Revanth Reddy: కేంద్రమంత్రిని రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం అనుమతి కోరిన తెలంగాణ సీఎం

Arun Charagonda

కేంద్రమంత్రిని రాజ్‌నాథ్ సింగ్‌ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాజ్‌నాథ్‌ని కలిసిన రేవంత్..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం అనుమతివ్వాలని కోరారు. అలాగే 222 ఎకరాల డిఫెన్స్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.

Telangana: మాగనూర్ ప్రభుత్వ స్కూల్‌లో మళ్లీ ఫుడ్ పాయిజన్, మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత, మక్తల్ ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

మక్తల్ - మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులకు వాంతులు కాగా తల, కడుపు నొప్పితో విలవిలలాడారు విద్యార్థులు. దీంతో మక్తల్ ఆస్పత్రికి 20 మంది విద్యార్థులను తరలించారు.

Hyderabad: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో మంటలు...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పు తుండగా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

Arun Charagonda

ముఖ్యమంత్రి నిన్న అదానీ అంశానికి సంబంధించి మాట్లాడిన కారణంగా మాట్లాడాల్సి వస్తోంది... రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్...రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత నేను వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడు అన్నారు.

Advertisement

Telangana: జ‌స్టిస్ జ‌గ‌న్నాధ‌రావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం, హైదరాబాద్‌లో జరగనున్న అంత్యక్రియలు

Arun Charagonda

జ‌స్టిస్ జ‌గ‌న్నాధ‌రావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా, కేర‌ళ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ జ‌గ‌న్నాధ‌రావు త‌న‌దైన ముద్ర వేశార‌ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌గ‌న్నాధ‌రావు అంత్య‌క్రియ‌లు జరగనున్నాయి.

Telangana: బస్సులోనే గుండెపోటుతో వ్యక్తి మృతి, పోచారం ఐటీ కారిడార్‌లో ఘటన, మృతుడు భువనగిరి పట్టణానికి చెందిన పాండుగా గుర్తింపు..

Arun Charagonda

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన గీతాకార్మికుడు డొంకెని పాండు(59) ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన పోచారం ఐటీకారిడార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Arun Charagonda

వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

Telangana: షాకింగ్...వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం, భయంతో బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్న విద్యార్థిని, బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

తెలంగాణలోని మంథని పట్టణ బాలికల వసతి గృహంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వసతి గృహంలో పనిచేసే వంట మనిషి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని యువతికి మాయ మాటలు చెప్పింది.

Advertisement

KTR: ఇంకెంత కాలం నిశ్శబ్దం..పొంగులేటి ఆస్తులపై దాడుల అప్‌డేట్ ఏది? ఈడీని ప్రశ్నించిన కేటీఆర్...కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఏమయ్యాయి? అని ప్రశ్న

Arun Charagonda

ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులపై ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇళ్లు & కార్యాలయాలపై 60 రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన దాడుల స్థితిగతులపై ఏమైనా అప్‌డేట్‌లు ఉన్నాయా? అని ఈడీని ప్రశ్నించారు. కనీసం ఐటీ దాడులకు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు కూడా వెల్లడించరా?, కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు.

Red Stream on Hyderabad Roads: హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)

Rudra

అది హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్‌ డివిజన్‌ వెంకటాద్రి నగర్‌ ప్రాంతం. సోమవారం సాయంత్రం కాలనీవాసులు కాస్త సేదతీరుతూ ముచ్చటించుకుంటున్నారు. పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వీధిలోని రోడ్డుమీదకు ఓ ఎర్రని ద్రవం ఏరులై పారింది.

Special Trains To Sabarimala: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. శబరిమలకు ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 27వరకు అందుబాటులోకి

Rudra

తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ నుంచి వరుసగా కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rudra

తెలంగాణపై చలి-పులి పంజా విసురుతున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Cigarette in Bawarchi Biryani: వీడియో ఇదిగో, ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక, తిన్న తర్వాత చివర్లో చూసి షాకైన కస్టమర్

Hazarath Reddy

బావర్చి బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక రావడంతో కస్టమర్లు ఖంగుతిన్నారు. హైదరాబాద్ - RTC ‘X’ రోడ్డు వద్ద బావర్చీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తింటుండగా కస్టమర్లకు చివర్లో సిగరెట్ పీక వచ్చింది.. దీంతో పీకను చూసి కస్టమర్లు షాకయ్యారు. దీంతో కస్టమర్లంతా యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

Hyderabad Shocker: తీవ్ర విషాదం, ఒకేసారి 3 పూరీలు తినడం వల్ల ఊపిరాడక బాలుడు మృతి, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన

Hazarath Reddy

హైదరాబాద్: భోజన విరామ సమయంలో ఒకేసారి 3 పూరీలు తినడం వల్ల ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. గౌతమ్ జైన్ (తండ్రి) తన కుమారుడి పాఠశాల నుండి తనకు కాల్ వచ్చిందని పోలీసులకు సమాచారం అందించాడు

Telangana: దారుణం, డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేసిన మహిళతో పాటు యువకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేశారు మహిళతో పాటు యువకులు. తరచు స్వీట్ షాపుకు వెళ్లి ఫోన్ పే చేస్తున్నట్లు నటించి మిఠాయిలు కొంటున్న వ్యక్తి

Telangana Shocker: దారుణం, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్న యువకుడు, వరంగల్ జిల్లాలో ఘటన

Hazarath Reddy

అమ్మాయి కోసం తల పగలకొట్టుకున్న యువకుడు. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఓ యువకుడు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్నాడు. ఎవరు చెప్పినా వినక పోవడంతో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement