తెలంగాణ
Lady Aghori: కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించారంటూ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు, మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Hazarath Reddyడి అఘోరి నాగసాధుపై కేసు నమోదైంది. కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో వరంగల్ జిల్లాలోని మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
Allu Arjun Dance at Pushpa-2 Event: చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ (వీడియో)
Rudraమరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Lift Fallen in Hyderabad: కేబుల్ వైర్ తెగిపోయి అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా కుప్పకూలిన లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
Rudraచలితో యావత్తు తెలంగాణ గజగజలాడుతున్నది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Telangana: వీడియో ఇదిగో, నాలుగు పిల్లలు జన్మనిచ్చిన పెంపుడు కుక్క, ఊరి వాళ్లందరిని పిలిచి వేడుక జరుపుకున్న దాని యజమాని కుటుంబం
Hazarath Reddyతెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన వినోద్ మరియు లావణ్య దంపతులు పెంచుకుంటున్న ShihTzu జాతి పెంపుడు కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో వాటికి బారసాల జరిపింది.
Telangana: దారుణం, ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు . అయితే తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను చిన్న కొడుకు సురేష్ అడ్డుకున్నారు.
Telangana: వీడియో ఇదిగో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగలబెట్టిన యువకుడు, ఇంటికి వచ్చి EMI కట్టాలని యువకున్ని బెదిరించిన ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు
Hazarath Reddyమెదక్ జిల్లాలోని శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక ఓ యువకుడు తన బైక్ తగలబెట్టాడు. ఇంటికి వచ్చి యువకున్ని EMI కట్టాలని ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు బెదిరించడంతో అతను కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు.
Actor Ali Gets Notices: ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీనటుడు అలీకి నోటీసులు, నిర్మాణాలు ఆపివేయాలని సూచన
Hazarath Reddyప్రముఖ సినీ నటుడు అలీకి అక్రమ నిర్మాణం వ్యవహారం నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ పనివారికి నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Viral Video: వీడియో ఇదిగో, చేపల వలకు చిక్కిన భారీ కొండచిలువ, అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలివేస్తామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు
Hazarath Reddyసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ కోఠే (వీడియో)
Rudraఅసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్ కోఠే తెలిపారు.
Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు గుడ్ న్యూస్.. డిసెంబరు 8 నుంచి హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ
Rudraఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు శుభవార్త. ఆర్మీ రిక్రూట్ మెంట్ బోర్డు.. అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
Accident in Shadnagar: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘటన (వీడియో)
Rudraరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ ప్రయాణికుల బస్సు రివర్స్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
CAT Exam Today: నేడు క్యాట్ ఎగ్జామ్.. మూడు సెషన్లలో పరీక్ష.. తెలంగాణలో సెంటర్లు ఇవే..!
Rudraఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది.
No Number Plate: వాహనాలకు నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు: ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్
Rudraనంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోతే భారీ జరిమానాతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ హెచ్చరించారు.
No Pharma City In Kodangal: కొడంగల్ భూసేకరణ విషయంలో వెనక్కు తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ వచ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రీయల్ పార్క్ మాత్రమే
VNSకొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ (Pharma City) కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను (Industrial Coridor) ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
KTR: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు
Arun Charagondaమహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు భారతీయ రాజకీయాల భవిష్యత్తు గా ఎప్పటి నుంచో ఉన్నాయి.. కొనసాగుతాయి అని తేల్చిచెప్పారు.
KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్
Arun Charagondaభూములను రేవంత్ దౌర్జన్యంగా గుంజుకుంటుంటే తిరగబడ్డ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి, పరామర్శించారు కేటీఆర్. రైతులు, వారి కుటుంబాలు భయపడకండి, మీ వెనుక కేసీఆర్ ఉన్నడు. న్యాయస్థానంలో కొట్లాడుదాం.. రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి గుణపాఠం చెబుదాం అన్నారు.
Telangana Shocker: వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం, కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పద మృతి...పోలీసుల దర్యాప్తు
Arun Charagondaవికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం రేపింది. వికారాబాద్ - ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది. వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి
Arun Charagondaమహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందన్నారు. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. తెలంగాణ లోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని...ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో అసంతృప్తి ఉందని చెప్పారు బండి.
KTR: చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్, కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు..పట్నం నరేందర్ రెడ్డి భార్య
Arun Charagondaవికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిశారు.కేటీఆర్ వెంట పట్నం నరేందర్ రెడ్డి భార్య, శ్రీనివాస్ గౌడ్, మహముద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు.