తెలంగాణ
No Pharma City In Kodangal: కొడంగల్ భూసేకరణ విషయంలో వెనక్కు తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ వచ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రీయల్ పార్క్ మాత్రమే
VNSకొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ (Pharma City) కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను (Industrial Coridor) ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
KTR: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు
Arun Charagondaమహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు భారతీయ రాజకీయాల భవిష్యత్తు గా ఎప్పటి నుంచో ఉన్నాయి.. కొనసాగుతాయి అని తేల్చిచెప్పారు.
KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్
Arun Charagondaభూములను రేవంత్ దౌర్జన్యంగా గుంజుకుంటుంటే తిరగబడ్డ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి, పరామర్శించారు కేటీఆర్. రైతులు, వారి కుటుంబాలు భయపడకండి, మీ వెనుక కేసీఆర్ ఉన్నడు. న్యాయస్థానంలో కొట్లాడుదాం.. రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి గుణపాఠం చెబుదాం అన్నారు.
Telangana Shocker: వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం, కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పద మృతి...పోలీసుల దర్యాప్తు
Arun Charagondaవికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం రేపింది. వికారాబాద్ - ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది. వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి
Arun Charagondaమహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందన్నారు. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. తెలంగాణ లోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని...ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో అసంతృప్తి ఉందని చెప్పారు బండి.
KTR: చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్, కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు..పట్నం నరేందర్ రెడ్డి భార్య
Arun Charagondaవికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిశారు.కేటీఆర్ వెంట పట్నం నరేందర్ రెడ్డి భార్య, శ్రీనివాస్ గౌడ్, మహముద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు.
Telangana: సిగరేట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Arun Charagondaసిగరెట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థి(16)ని సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించడంతో 6 నెలల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స అందించడంతో కోలుకోగా, విద్యార్థి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు.. కాగా నిన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Student Suicide: హైదరాబాద్ మియాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజయవాడ
Rudraహైదరాబాద్ లోని మియాపూర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Cyber Nude Call: ఇంజినీరింగ్ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్.. ఘట్ కేసర్ లో మరో స్కాం.. ఏంటది??
Rudraహైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఓ అనామక యువతి నగ్న వీడియో కాల్ చేసి.. డబ్బులు వసూలు చేసింది.
Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది.
Free Bus Service In Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఫ్రీ బస్, కార్తీక మాసం సందర్భంగా ప్రారంభించిన అధికారులు
VNSశ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం నుంచి ఉచిత బస్సు సౌకర్యం (Free bus) ప్రారంభించింది. వారాంతపు సెలవులతోపాటు పర్వ దినాల్లో అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి (Free Bus in Srisailam) భక్తులు తరలి వస్తున్నారు.
Sarpanch Dies by Suicide: కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన హరీష్ రావు, మీ అన్నదమ్ముళ్లపై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలని డిమాండ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయన అన్నారు
Harishrao: రోడ్డెక్కిన ప్రజాపాలన దరఖాస్తులు...సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటి?..హరీశ్ రావు ప్రశ్న
Arun Charagondaనాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు..నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం..రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? ఏంటన్నారు.
Telangana: వీడియో ఇదిగో, పురాతన శివాలయంలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు ధర్నా
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఉన్న పురాతన శివాలయంలో రాత్రి శివలింగాన్ని తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. శివుని పక్కనే ఉన్న వినాయకుడు విగ్రహాన్ని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేశారు. హిందూ సంఘాలు చేరుకొని శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను గుర్తించి అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.
Hydra: చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్ సమావేశం, మూడు గంటల పాటు చర్చ, హైడ్రా కూల్చివేతలు ఆగవని స్పష్టం
Arun Charagondaచెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులు, నాళాలకు FTL బౌండరీల నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ ENC లు, మైనర్ ఇరిగేషన్ సీఈలు , వీసీలు, ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, పీసీబీకి చెందిన సీనియర్ అధికారులతో రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా మీటింగ్ జరుగగా మేధావుల సలహలు, సూచనలు తీసుకున్నారు.
KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్
Arun Charagondaఅదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్ .. ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి అన్నారు. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు.. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడిందన్నారు.
Siddipet: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన డీసీఎం...ఆరుగురికి తీవ్ర గాయాలు...బాధితులను ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaసిద్దిపేట - పొన్నాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆటోను అతివేగంగా వెనకనుంచి ఢీకొట్టింది డీసీఎం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Hyderabad: ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ టోకరా..రూ. 150 కోట్లు వసూలు, బాధితులు 600 మందికి పైనే!
Arun Charagondaఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ టోకరా వేసింది. ఆర్జే గ్రూప్ పేరుతో వినియోగదారులతో డబ్బులు కట్టించుకున్నారు భాస్కర్, సుధారాణి. దాదాపు 600 మంది నుంచి రూ.150 కోట్ల వసూలు చేశారు. డబ్బులు కట్టి నాలుగేళ్లు అయినా ఇంతవరకూ ఫ్లాట్స్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని బాధితుల ఆరోపించారు.
Lagacharla Incident: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు, రూ.10 కోట్లు కేసీఆర్ ఇచ్చారని ప్రభుత్వ తరపు లాయర్ ప్రస్తావన, మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆధారాలు సమర్పణ
Arun Charagondaలగచర్ల ఘటనలో తొలిసారి కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. కోర్టులో కేసీఆర్ పేరు ప్రస్తావించారు ప్రభుత్వ తరపు న్యాయవాది నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చారని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ ని హైకోర్టుకు అందజేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఇదంతా చేశారని కోర్టుకు వెల్లడించారు ప్రభుత్వ తరపు న్యాయవాది.
Telangana: ఉరి వేసుకొని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
Arun Charagondaరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో విషాదం నెలకొంది. 10వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో 10వ. తరగతి చదువుతున్నారు వెంకటేష్. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తుండగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.