తెలంగాణ
Cockroaches In Chutney: బయట టిఫిన్ చేస్తున్నారా?, ఇది చూస్తే ఇకపై జన్మలో బయట టిఫిన్ చేయరు?..ఒక్క చట్నీలోనే ఎన్ని బొద్దింకలో తెలుసా?
Arun Charagondaబయట టిఫిన్ చేస్తున్నా? అయితే ఇది మీ కోసమే. హైదరాబాద్ - కేపీహెచ్‌బీలోని నెక్సస్ మాల్ వద్ద ఉన్న మధురం టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒకేసారి చాలా మందికి చట్నీలో బొద్దింకలు వచ్చాయి. బొద్దింకలతో ఉన్న ఆహారాన్ని సగం తిన్నాక అవి బయటపడటంతో టిఫిన్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!
Arun Charagondaఓ వైపు ఓటమి మరోవైపు నేతల పార్టీ జంప్ దీనికి తోడు ఎమ్మెల్యేల ఫిరాయింపులు వెరసీ గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ నేతలకు కీలకంగా మారింది. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి కేసీఆర్‌ది. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ఉంటుందా? ఉండదా అనే సందేహం కూడా అందరిలో నెలకొంది. కానీ ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వేసిన త్రిముఖ వ్యూహం ఫలించింది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్ పడింది.
Hyderabad Police: సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసుల ఫోకస్, సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా..అసభ్య పోస్టులు పెడితే ఇకపై కఠిన చర్యలే
Arun Charagondaసోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా పెట్టామని, ఇలాంటి పోస్టులు పెట్టి కేసులు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు మరియు చిరు వ్యాపారులు ఉన్నారు.
Complaint Against Ram Charan: అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎయిర్ పోర్టు పీఎస్ లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు
Rudraటాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ పై అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప దీక్షలో ఉండి చరణ్ కడప దర్గాను దర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Theft in Yellamma Temple: మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. గుడిలో అమ్మవారినీ ఎత్తుకెళ్ళిన దుండగులు (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫకిరిటెక్యా తండాలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతోపాటు అమ్మవారికి అలంకరించిన ఐదు గ్రాముల బంగారు పుస్తెలు, 5 తులాల వెండి కళ్లను దుండగులు దొంగిలించారు.
Telangana BC Commission: పిచ్చకుంట్ల అనే పదం వాడితే క్రిమినల్ కేసు..బీసీ కమిషన్ సంచలన నిర్ణయం, త్వరలో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వస్తాయని నిరంజన్ వెల్లడి
Arun Charagondaఇకపై పిచ్చకుంట్ల అనే పదం వాడితే క్రిమినల్ కేసు నమోదుకానుంది. రాజకీయ నాయకులు గానీ, ఇతర కులాలు ఎవరైనా పిచ్చకుంట్ల అనే పదం వాడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం అన్నారు బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్.
Maoists Killed Two Men: ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య.. మృతుల్లో పంచాయతీ కార్యదర్శి కూడా
Rudraములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు.
Accident at Kondagattu: కొండగట్టులో రెండు లారీలు ఢీ.. ముగ్గురికి గాయాలు.. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటమే కారణం (వీడియో)
Rudraకరీంనగర్-జగిత్యాల రహదారి కొండగట్టు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా అందులో రాజస్థాన్ నుండి టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ దేవిలాల్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.
Hanuman Idol Set on Fire: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారడం కలకలం రేపుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది.
America Tragedy: గన్ మిస్ ఫైర్.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి.. బర్త్ డే రోజే విషాదం.. మృతుడు ఉప్పల్ వాసి ఆర్యన్ రెడ్డిగా గుర్తింపు
Rudraపుట్టినరోజే ఆ యువకుడి జీవితంలో చివరి రోజుగా మారింది. అమెరికాలో తెలుగు యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Telangana: వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు
Hazarath Reddyనల్లగొండ జిల్లా విద్యాధికారి(DEO) భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చంది. అతను మరో మహిళతో ఉండగా భార్య తన కుటుంబ సభ్యులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భిక్షపతిని నిలదీయగా ఆమెను ఇంటి నుంచి బయటకు పోమ్మంటూ బెదిరించాడు.
Posani Krishna Murali: వీడియో ఇదిగో, తెలంగాణ తెచ్చాడని కేసీఆర్‌కు ఓటేసా, తర్వాత విమర్శించినా ఏనాడు నా మీద కేసులు పెట్టలేదని తెలిపిన పోసాని
Hazarath Reddyపోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
Telangana: చార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..జగిత్యాలలో ఘటన, స్కూటర్ తో పాటు డబ్బు బూడిద పాలు
Arun Charagondaచార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఈ ఘటన జరుగగా 40 రోజుల క్రితం ఓ ప్రముఖ టూవీలర్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రమాద సమయంలో స్కూటర్ డిక్కిలో రూ.1.90 లక్షలు ఉన్నాయని...స్కూటర్, డబ్బు కాలి బుడిద కావడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు తిరుపతి రెడ్డి.
Rahul Gandhi: అదాని ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే, ఎవరిని వదిలిపెట్టొదన్న ఎంపీ రాహుల్ గాంధీ..అదాని వెనుక ఉంది మోడీనే అని కామెంట్
Arun Charagondaఅమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు అని మండిపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదాని వెనుక ఎవరు ఉన్న అరెస్ట్ చేయాల్సిందే అన్నారు . ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆదాని దగ్గర డబ్బులు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ.
KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్
Arun Charagondaఅదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదాని కంపెనీ - తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన
Hazarath Reddyఒక వానరం విద్యుత్ షాక్ గురై అక్కడే పడిపోయింది. అయితే ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.నాగరాజు అనే యువకుడు దానికి సిపిఆర్ చేశాడు. కొంత సేపటి తర్వాత చనిపోయిందనుకున్న వానరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగిరింది.
Hyderabad Accident: ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం
Hazarath Reddyరక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.
Telangana: హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాల్సిందే, అయ్యప్ప మాల తొలగించాలని డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా లాయర్లు, మాలలో దర్గా దర్శనం తప్పేనని కామెంట్
Arun Charagondaసినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లా లాయర్లు. వెంటనే రామ్‌చరణ్ అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Mahabubabad: శభాష్ పోలీస్..ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్...మహిళ ప్రాణం కాపాడిన కానిస్టేబుల్....వీడియో ఇదిగో
Arun Charagondaఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడారు ఓ కానిస్టేబుల్. మహబూబాబాద్‌కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు.
Software Engineer Suicide: హైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేసిన నవీన్ రెడ్డి..పోలీసుల విచారణ
Arun Charagondaహైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.