తెలంగాణ
Telangana Student Dies in Philippines: వీడియో ఇదిగో, ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, పుట్టినరోజు నాడే విషాదకర ఘటన
Hazarath Reddyఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
Telangana Shocker: జగిత్యాలలో దారుణం, అనుమానంతో స్కూలు కెళ్లి విద్యార్థుల ముందే ప్రిన్సిపాల్ అయిన భార్యపై దాడి చేసిన భర్త, తమ్ముడు
Hazarath Reddyగురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల ప్రిన్సిపాల్ మమతపై భర్త సంపత్, ప్రిన్సిపాల్ తమ్ముడు రాజశేఖర్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినిలు, స్టాఫ్ సమక్షంలోనే చితకబాదిన కుటుంబసభ్యులు. దీంతో తీవ్ర భయాందోళనకు విద్యార్థినిలు గురైయ్యారు
Telangana: వీడియో ఇదిగో, బామర్ది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyజగిత్యాల జిల్లాలో గల మేడిపల్లి మండలం మోతుకురావుపేటలో బుధవారం అర్థరాత్రి పెళ్లిలో నృత్యం చేస్తూ గుండెపోటుతో సంజీవ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కమ్మరికుంటలో నివాసముంటున్న సంజీవ్ మోతుకురావుపేటలో జరిగే తన మేనమామ కుమారుడి వివాహానికి హాజరయ్యాడు.
Minister Ponnam Prabhakar: 35 శాతం కుటుంబ సర్వే పూర్తి..ఎలాంటి అపోహలు వద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజలంతా స్వచ్ఛందంగా సర్వేకు సహకరిస్తున్నారన్న పొన్నం
Arun Charagondaసిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో 9 వ వార్డు లో పంజాల కవిత నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే పై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్చందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు.
Addanki Dayakar: కేటీఆర్‌వి పొలిటికల్ డ్రామాలు, అధికారం కోసం ఇంతగా దిగజారాలా అని మండిపడ్డ అద్దంకి దయాకర్, తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని కామెంట్
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలని...దాడులు చేయించింది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికే రైతుల పేరు మీద పరామర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Gadwal: గద్వాలలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్, గాల్లోకి ఎగిసి పడి వృథాగా పోతున్న నీళ్లు....వీడియో ఇదిగో
Arun Charagondaమిషన్ భగీరథ పైపు లైన్ పగిలి నీళ్లు ఎగిసిపడుతున్నాయి. గద్వాల నియోజకవర్గం, ధరూరు మండలం, కోతుల గిద్ద స్టేజి సమీపంలో (పెట్రోల్ బంకు దగ్గర) మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి ఎగిసిపడుతున్నాయి నీళ్లు. మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి పోయి నీళ్లు వృధాగా పోతుండగా మిషన్ భగీరథ అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Warangal: కోచింగ్ లేకుండా ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన యువకుడు,అన్న బాటలోనే తమ్ముడు కూడా.. శభాష్ అంటున్న గ్రామస్తులు
Arun Charagondaవరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ అనే యువకుడు కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు. పంచాయితీ సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం మల్లంపల్లిలో PGT(SOCIAL)గా పనిచేస్తున్నాడు. ఇతని తమ్ముడు సంతోష్ కూడా అన్న స్ఫూర్తిగా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిపై గ్రామస్తులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
KTR In Sangareddy Central Jail: సంగారెడ్డి సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కేటీఆర్, లగచర్ల రైతులతో ములాఖత్...వీడియో
Arun Charagondaసంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ లో కలిసింది బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. రైతులను కలిసిన వారిలో కేటీఆర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనిల్ జాదవ్, రమావత్ రవీంద్ర కుమార్, జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు.
Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడు...రూ.14 కోట్లు ఇవ్వాలని బాధితుడు నరసింహరెడ్డి ఆరోపణ, బంధువని నమ్మితే నిండా ముంచేశాడని మండిపాటు
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఆయన బంధువు నరసింహరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి తనను దారుణంగా మోసం చేశాడని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాడారంలో నా 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటానాని మల్లారెడ్డి నన్ను సంప్రదించి ఎకరం రూ.2 కోట్లకు మాట్లాడుకున్నాడు. మొదలు మొత్తం కొంటానని నమ్మించి తరువాత రూ.8 కోట్లు మాత్రమే ఇచ్చి 9 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అన్నారు.
Koti Deepotsavam 2024: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం, భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు, ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాలు
Hazarath Reddyభక్తి TV మరియు NTV హైదరాబాద్‌లో నిర్వహించే వార్షిక కార్యక్రమం కోటి దీపోత్సవం అంగ రంగ వైభవంగా కొనసాగుతోంది. కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి హిందువు కార్తీక వేడుకల్లో భాగంగా దీపాలు వెలిగించి దేవతా పూజల్లో మునిగితేలుతున్నారు.
SBI Rate Hike: రుణాల వడ్డీ రేటును పెంచేసిన ఎస్బీఐ.. 0.05 శాతం ఎంసీఎల్ఆర్ పెంచిన దిగ్గజ బ్యాంకు
Rudraదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకింగ్ వార్త. అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది.
Tiger Spotted In Nirmal: నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం, ఖానాపూర్ అడవుల్లో పులి సంచారం..భయాందోళలో ప్రజలు..వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారానికి సంబంధించిన వీడయో వైరల్‌గా మారింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, గడ్డిమందు తాగి యువకుడు ఆత్మహత్య...11 నెలల క్రితమే పెళ్లి..వీడియో ఇదిగో
Arun Charagondaరాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బుర్రవేణి వేణు (27) వారం రోజుల క్రితం గడ్డి మందు సేవించగా నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
Telangana Samagra Kutumba Survey: మేడ్చల్ రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు, సిబ్బందితో వెళ్లి ఫారాలు తీసుకెళ్లిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి...వీడియో ఇదిగో
Arun Charagondaసమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు అయ్యాయి. మేడ్చల్ రోడ్డుపై అర కిలోమీటర్ పొడవునా జాతీయ రహదారి పక్కన దర్శనం ఇచ్చాయి. సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీనా సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Snake Dance at Dwaraka Tirumala: కార్తీక పౌర్ణమి రోజున పాముల సయ్యాట.. ద్వారకా తిరుమలలో కనిపించిన దృశ్యం.. వైరల్ వీడియో
Rudraనేడు కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినం రోజున రెండు పాములు చేసిన సయ్యాట కనువిందు చేసింది. ద్వారకా తిరుమలలో కనిపించిన ఈ దృశ్యానికి అందరూ పరవశితులయ్యారు. శివాలయానికి సమీపంలోనే ఇది జరగడంతో దేవుడి మహత్యంగా భక్తులు భావిస్తున్నారు.
Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. అయితే, దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది.
Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు
Arun Charagondaకార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వఃఇంచారు. ద్వారకా తిరుమలలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తులు.
Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraపరమశివుడితోపాటు శ్రీమహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. నేడే ఆ శుభదినం. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.
CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు
Arun Charagondaరాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏ సన్నబియ్యంతో తింటున్నారో గురుకుల హాస్టళ్లలో ఉంటున్న మా బిడ్డలకు కూడా అదే అన్నం పెట్టాలని చెప్పాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుతున్న ఆ బిడ్డలు తెలంగాణ ఆత్మగౌరవం. భావి భారత నిర్మాతలు. వారికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయని వారిపై కఠినమైన చర్యలు తప్పవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Subbaiah Hotel Seized: తింటున్న భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్‌పర్సన్ ఆగ్రహం.. కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ (వీడియో)
Rudraవిజయవాడలోని ప్రముఖ హోటల్ లో గురువారం మధ్యాహ్నం ఓ కస్టమర్ కు సర్వ్ చేసిన భోజనంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షమయ్యింది. నగరంలోని సూర్యారావు పేటలో ఉన్న సుబ్బయ్య హోటల్ లో ఈ ఘటన జరిగింది.