తెలంగాణ
Hyderabad: ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను కూల్చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికారులు...వీడియో ఇదిగో
Arun Charagondaరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురంలో ఫుట్ పాత్ లపై వెలిసిన అక్రమ నిర్మాణాలను GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ మరియు రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఫుట్ పాత్ ను కబ్జా చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిపారు అధికారులు.
Telangana: వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు, కీలక పత్రాలు స్వాధీనం
Arun Charagondaరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వడ్డీ వ్యాపారులపై కొరడా ఝుళిపించారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యపారుల ఇల్లు, ఆఫీసులపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. చెక్కులు, ప్రామిసరీ నోట్లు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ATMs Shutting Down: 12 నెలల్లో 4 వేల ఏటీఎంలు మూత.. డిజిటల్ లావాదేవీల పెరుగుదలే కారణం
Rudraదేశంలో నగదు చలామణి కొత్త రికార్డులకు చేరుకొంటున్నాయి. అయితే, విచిత్రంగా దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్ వర్క్ లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం, అతివేగంతో కారును ఢీకొట్టిన బస్సు...పోలీసులకు ఫిర్యాదు చేసిన కారు డ్రైవర్
Arun Charagondaహైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ - ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద అతివేగంతో దూసుకొచ్చి కారును ఢీకొట్టింది. అనంతరం కారును ఈడ్చుకెళ్లింది గో టూర్ ట్రావెల్స్ బస్సు. వాహనదారులు, జనం కేకలు వేయడంతో కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు కారు డ్రైవర్. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు కారు డ్రైవర్.
Road Accident at KPHB: బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న పాదచారుడు మృతి.. హైదరాబాద్ కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న పాదచారుడిని వేగంగా వచ్చిన ఓ బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Destruction Of Katta Maisamma's Trident: సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయ త్రిశూలం ధ్వంసం.. దుండగుడికి స్థానికుల దేహశుద్ధి.. హైదరాబాద్ శంషాబాద్ లో మరో ఘటన (వీడియో)
Rudraహిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం ధ్వంసం ఘటనను మరవక ముందే శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు బరితెగించాడు.
Lady Aghori at Mahanandi Temple: మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)
Rudraకర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.
Secunderabad-Shalimar Superfast Express Derailed: పట్టాలు తప్పిన షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు (వీడియో)
Rudraపశ్చిమ బెంగాల్ లోని నల్పూర్ స్టేషన్ వద్ద షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు పేర్కొన్నారు.
Komatireddy On KCR: కేసీఆర్‌ను ముక్కలు ముక్కలు చేస్తాం...మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్, మూసీ సుందరీకరణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక..వీడియో
Arun Charagondaమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణ వద్దని చెప్తే కేసీఆర్‌ను ముక్కలు, ముక్కలు చేసి మూసీలో పడేస్తాం అని హెచ్చరించారు. కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.
Telangana: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Arun Charagondaవైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రేబిస్ వ్యాక్సిన్ వికటించి గరిశెల రజిత అనే మహిళ మృతి చెందింది. నెల రోజుల క్రితం రజిత అనే మహిళను కుక్క కరవడంతో వంద పడకల ఆస్పత్రికి రాగా.. రేబిస్ ఇంజక్షన్ వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. మహిళ శరీరంలో ఆర్గాన్స్ అన్ని పాడవడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Bandi Sanjay: జన్వాడ ఫాం హౌస్ కేసులో కాంప్రమైజ్ అయిన బీఆర్ఎస్ - కాంగ్రెస్, అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నామన్న బండి సంజయ్
Arun Charagondaరేవంత్ రెడ్డి సంగెం వద్ద పాదయాత్ర కాదు, చేతనైతే మూసీ పక్కన ఇండ్లు కోల్పోయే బాధిత ప్రాంతాల్లో దగ్గర పాదయాత్ర చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన సంజయ్..రేవంత్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలన్నారు. రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు.
Venu Swamy: జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్ మళ్లీ నోటీసులు,ఈ నెల 14న విచారణకు రావాలని కోర్టు ఆదేశాలతో నోటీసులు
Arun Charagondaప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ చేసింది. మొదటి నోటీసుకు హాజరుకాకుండా కోర్టును ఆశ్రయించారు వేణుస్వామి. స్టే ఎత్తివేస్తూ వేణుస్వామిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Yadadri Now as Yadagirigutta: యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన
Hazarath Reddyయాదాద్రిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు
Hyderabad: ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ల ఆందోళన, నెలల తరబడి తిప్పించుకుంటున్నారని షోరూమ్‌కు చెప్పుల దండ వేసిన కస్టమర్..వీడియో
Arun Charagondaఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్ వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నెలల తరబడి తిప్పించుకుంటున్నారంటూ షోరూమ్‌కు చెప్పుల దండ వేశారు కస్టమర్. ఒక్కసారిగా బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చారు కస్టమర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hydra: మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా, ఈ సారి ఏకంగా 50 మందికి నోటీసులు...15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో వెల్లడి
Arun Charagondaహైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాలు నిర్మించిన 50 మందికి పోలీసులు నోటీస్ జారీ చేశారు. ఈసారి పార్కులు ,నాళాలు, ఫుట్‌పాత్‌లు అక్రమ నిర్మాణాలు తొలగించనున్నారు. వారం నుండి 15 రోజుల్లో గా అక్రమాలు కూల్చేయాలని హెచ్చరిక జారీ చేశారు. సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వే చేయించింది హైడ్రా.
Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం, తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లిన కారు, డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ పంజాగుట్టలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి దూసుకెళ్లింది కారు. ఆపకుండా కారును హోంగార్డును ఈడ్చుకెళ్లాడు డ్రైవర్ సయ్యద్. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదుచేశారు.
Bandi Sanjay: కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టివ్ సీఎం, కాంగ్రెస్ - బీఆర్ఎస్ కలిసి బీజేపీపై కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టివ్ సీఎం అని ఆరోపించారు. కేటీఆర్ రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తరు, రేవంత్ రెడ్డివి కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రెండు పార్టీలు కలిసి బీజేపీపై కుట్ర చేస్తున్నాయి.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరన్నారు.
Harishrao: హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చి..నల్గొండలో పాదయాత్ర?, సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రపై హరీశ్ రావు ఫైర్..దమ్ముంటే హైదరాబాద్ నుండి పాదయాత్ర మొదలుపెట్టాలని సవాల్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బందాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్..కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ..జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే గిఫ్ట్, పంట చేనులో సీఎం రేవంత్ ముఖచిత్రం..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే.. ఓ రైతు మాత్రం వినూత్నంగా రేవంత్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. తన పంటచేనులో రేవంత్ ముఖచిత్రం వచ్చేలా.. సాగు చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది. కాగా.. రైతులకు రుణమాఫీ చేసి వారికి ఆర్థికభారాన్ని రేవంత్ సర్కార్ తొలగించిన సంగతి తెలిసిందే.