టెక్నాలజీ
Amazon India Jobs: నిరుద్యోగులకు శుభవార్త, అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు, స్వతంత్ర కాంట్రాక్టర్లు,పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన అమెజాన్ ఇండియా
Hazarath Reddyకోవిడ్‌-19 సంక్షోభం, లాక్‌డౌన్‌ COVID-19 Lockdown) ఆంక్షల్లో చిక్కుకుని దిగ్గజాలనుంచి స్టార్టప్‌ కంపెనీల దాకా అందరూ ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్న విషయం విదితమే. అలాగే వేతనా కోత కూడా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్తను చెప్పింది. తమకు 50 వేల సిబ్బంది అవసరం (Amazon India Jobs) పడుతుందని అమెజాన్ ఇండియా (Amazon India) శుక్రవారం ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది.
WhatsApp Status video: వాట్స్‌యాప్ స్టేట‌స్ వీడియో ఇప్పుడు 30 సెకండ్లు, పాత స్టేటస్ టైమింగ్‌ని రీస్టోర్ చేస్తున్నట్లు ప్రకటించిన వాట్స్‌యాప్
Hazarath Reddyక‌రోనా (coronavirus )స‌మ‌యంలో వాట్స్‌యాప్ (WhatsApp) ద్వారా అనేక త‌ప్పుడు వార్త‌లు షేర్ అవుతున్న నేప‌థ్యంలో ప్రముఖ సోషల్‌మీడియా మేస్సేజింగ్‌‌ యాప్‌ సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు 15 సెకండ్లకు మించి నిడివి లేకుండా సెట్టింగ్స్ చేసింది. తాజాగా మ‌ళ్ళీ స్టేట‌స్ వీడియో (WhatsApp Status video) నిడివిని 30 సెకండ్లుగా ఫిక్స్ చేసింది. దీంతో యూజ‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వాట్స్‌యాప్ మొదలైనప్పడు స్టేటస్‌ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్న కొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
Satya Nadella: వర్క్ ఫ్రం హోం చాలా డేంజర్, మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం, కీలక వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ల
Hazarath Reddyదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. అన్ని కంపెనీలు ఉద్యోగులను మూడు నెలల నుంచి ఇంటి నుంచే పని (work from home) చేయమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ల (Microsoft CEO Satya Nadella) కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఉద్యోగుల చేత వర్క్ ఫ్రం హోం చేయించడం(ఇంటి నుంచే ఆఫీసు పని చేయడం) వారి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం (damaging for workers) ఉందని, వారి సామాజిక బంధాలు దెబ్బతినొచ్చని అభ్రిప్రాయపడ్డారు.
Reliance Jio New Plan: రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో
Hazarath Reddyరిలయన్స్‌ జియో తన వినియోగదారులకు మరొక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్న కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను (Reliance Jio New Plan) తీసుకువచ్చింది. రూ.999 తో రీఛార్జ్ (Rs. 999 Prepaid Plan) చేసుకోవడం ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. 84 రోజుల ( 84 Days) వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు.
Reliance Jio-Vista Deal: విదేశీ పెట్టుబడుల్లో జియో హ్యాట్రిక్ డీల్, విస్టా ఈక్వెటీ కంపెనీకి 2.3 శాతం వాటాను అమ్మేసిన ముఖేష్ అంబానీ, డీల్ విలువ సుమారు రూ. 11,367 కోట్లు
Hazarath Reddyరిలయన్స్ జియో (Reliance Jio) విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ (Vista Equity Partners) కంపెనీతో మరో మెగా ఒప్పందానికి (Reliance Jio-Vista Deal) సన్నద్ధమైంది. కంపెనీకి ఇది విదేశీ పెట్టుబడుల్లో హ్యాట్రిక్ డీల్ అని చెప్పవచ్చు. రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియోలో 2.3 శాతం వాటా షేర్లను అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ కొన్న‌ది. దీని ద్వారా విస్టా కంపెనీ జియోలో సుమారు 11,367 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 10, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ ప్యాక్-మ్యాన్, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. ప్యాక్-మ్యాన్ (2010) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను (Google Doodle Games) యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 8, నేటి గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ 2016, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ కాలక్షేపం చేయండి. హాలోవీన్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ (Halloween 2016), 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి. ఇప్పటిదాకా 8 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, స్కోవిల్ లొటరియా, తాజాగా హాలోవీన్ . ఈ రోజు వచ్చిన హాలోవీన్ (Halloween) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
Google Doodles: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 7, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ లొతరియా, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగూగుల్ డూడుల్‌తో నేటి ఆట లోటెరియా, ఇది మెక్సికన్ కార్డ్ గేమ్ (Mexican card game), ఇది 2019 లో ప్రవేశపెట్టబడింది. వినియోగదారులు క్లాసిక్ లోటెరియా ఆటను స్నేహితులతో ప్రైవేట్ మ్యాచ్‌లో ఆడవచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతో యాదృచ్ఛికంగా మ్యాచ్ చేయవచ్చు.గూగుల్ డూడుల్ (Google Doodles Lotería) లోటెరియా ఆటను అతిథి కళాకారులు, మెక్సికోకు చెందిన చాబాస్కి, మెక్సికోలో జన్మించిన సిసిలియా, హెర్మోసిల్లో జన్మించిన లూయిస్ పింటో, లాస్ ఏంజిల్స్‌కు చెందిన లోరిస్ లోరా మరియు మెక్సికో నగరానికి చెందిన వాల్స్ చిత్రీకరించారు.
Jio-Silver Lake Deal: జియో మరో భారీ డీల్, రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫాంపై సిల్వర్ లేక్ రూ. 5,656 కోట్ల పెట్టుబడులు, డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామం అన్న ముఖేష్ అంబానీ
Hazarath Reddyరిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కు చెందిన రిలయన్స్ జియో మరో భారీ డీల్ సాదించింది. ప్ర‌ఖ్యాత టెక్ కంపెనీ సిల్వ‌ర్ లేక్‌ (Silver Lake) రిల‌య‌న్స్ జియోలో భారీ పెట్టుబ‌డులు పెట్టింది. ఆ సంస్థ సుమారు రూ. 5,656 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీక‌రించింది. రిల‌య‌న్స్‌లో 1.15 శాతం షేర్ల‌ను సిల్వ‌ర్ లేక్ కొనుగోలు చేయ‌నున్న‌ది. ఇటీవ‌లే ఫేస్‌బుక్ కూడా సుమారు 5.7 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టి జియోలో 9.99 వాటాను కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.
Google Doodle: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 6, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ స్కోవిల్, 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. స్కోవిల్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను (Google Doodle Games) అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఇప్పటిదాకా 6 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, తాజాగా స్కోవిల్. ఈ రోజు వచ్చిన స్కోవిల్ (Wilbur Scoville) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 4, ఈ రోజు గూగుల్ డూడుల్‌లో రాక్‌మోర్ గేమ్, ఈ ఆటతో ఇంట్లోనే ఉంటూ సంతోషంగా గడిపేయండి
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. రాక్‌మోర్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ రోజు వచ్చిన రాక్‌మోర్ (Clara Rockmore) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే ఆఫీసుకు రండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, అందులో రిస్క్ చూపెడితే ఆఫీసుకు రావొద్దని హెచ్చరికలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా 'ఆరోగ్య సేతు' యాప్‌లో (Aarogya Setu App) వారి ఆరోగ్య స్థితిని సమీక్షించాలని, ఆ తర్వాతే కార్యాలయానికి బయలుదేరాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం (Govt Tells Central Govt Employees) ఆదేశించింది. భారతదేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల మధ్య, ప్రభుత్వం తమ మొబైల్ ఫోన్లలో 'ఆరోగ్యా సేతు' యాప్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని తన అధికారులు, సిబ్బంది (అవుట్‌సోర్స్ సిబ్బందితో సహా) అందరినీ కోరింది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 3, ఈ రోజు గూగుల్ డూడుల్‌లో ఫిషింగర్ గేమ్, ఈ ఆటతో ఇంట్లోనే ఉంటూ సంతోషంగా గడిపేయండి
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. ఫిషింగర్ (2017) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ రోజు వచ్చిన ఫిషింగర్ (Oskar Fischinger) గేమ్ చరిత్ర గురించి తెలుసుకోండి
Nokia-Airtel Deal: ఇండియాలో 5జీ కోసం రూ.7,636 కోట్ల డీల్, నోకియాతో భారతి ఎయిర్‌టెల్‌ భారీ ఒప్పందం, 2022 వ‌ర‌కు భార‌త్‌లో 3 ల‌క్ష‌ల కొత్త మొబైల్ ట‌వ‌ర్ల‌ ఏర్పాటు చేయడమే లక్ష్యం
Hazarath Reddyప్రముఖ మొబైల్ దిగ్గజం, ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా ఇండియాలో దూకుడు పెంచింది. ఇండియాలో దూసుకుపోతున్నటెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తో భారీ ఒప్పందాన్ని (Nokia-Airtel Deal) చేసుకుంది.1 బిలియ‌న్ డాలర్ల (రూ.7,636 కోట్లు) విలువైన ఒప్పందాన్ని నోకియా (Nokia) మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ (Airtel) కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా దేశంలో వినియోగదారులకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు, 50 సంవత్సరాల కిడ్స్ కోడింగ్ గేమ్, కొత్త కొత్తగా ముందుకు రానున్న గూగుల్ కోడింగ్ గేమ్స్
Hazarath Reddyకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. అందరినీ ఇంట్లోనే కట్టి పడేసింది. ప్రతిచోటా ప్రజలు వారి కుటుంబాలు లాక్డౌన్ (Lockdown) మధ్య ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ సమయంలో వారి మెదడును ఉత్తేజరపరచడానికి గూగుల్ (Google) ప్రసిద్ధ ఇంటరాక్టివ్ గూగుల్ డూడుల్ ఆటలను (Google Doodle Games) తిరిగి చూసే త్రోబాక్ డూడుల్ సిరీస్‌ను ప్రారంభించింది!
Asia's Richest Man: ఆసియాలో అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, మొత్తం సంపద విలువ 49.2 బిలియన్ డాలర్లు, ప్రపంచ ధనవంతుల్లో 17వ స్థానం
Hazarath Reddyఫేస్‌బుక్ , రిలయన్స్ జియో ( Jio, Facebook Deal) మెగా డీల్ అనేక సంచలనాలకు వేదిక అయింది. ఫేస్‌బుక్‌తో (Facebook) జరిగిన ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా (Asia's Richest Man) నిలిచాడు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను 570 కోట్ల డాలర్లకు (రూ.43,574 కోట్లు) ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ పూర్తయ్యాక ఫేస్‌బుక్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్‌ కానుంది.
Facebook-Reliance Jio Deal: జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్‌, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం
Hazarath Reddyదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీగా పెట్టుబడి (Facebook-Jio Deal) పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ (Facebook) బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో (Reliance Jio) 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసినట్లయింది. తద్వారా ఫేస్‌బుక్‌ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది.
Telangana e-Pass Apply Online: తెలంగాణ లాక్‌డౌన్‌, ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోమంటున్న పోలీసు శాఖ, పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ అంజనీ కుమార్
Hazarath Reddyలాక్‌డౌన్‌లో (Lockdown)అత్యవసర సేవలు సేవల కోసం పోలీసులు ఈ-పాస్ (Telangana e-Pass)జారీ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా అందజేస్తున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (HYD CP Anjani Kumar) తెలిపారు. ఈ -పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆయన చెబుతున్న వీడియోను పోలీసు శాఖ విడుదల చేసింది. అత్యవసర సేవల కోసం వ్యక్తులు, వాహనాలు, సంస్థలు, పరిశ్రమలకు పది నిమిషాల్లోనే ఈ-పాస్‌ లభిస్తుందని సీపీ చెప్పారు.
E-Commerce Firms Sales: 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ అమ్మకాలు, డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు
Hazarath Reddyకరోనా లాక్‌డౌన్ (Coronavirus lockdown) అమలులో ఉన్న సమయంలోనూ ఏప్రిల్ 20వతేదీ నుంచి నిత్యావసరేతర వస్తువులను కూడా డెలివరీ చేసేందుకు ఈకామర్స్ కంపెనీలకు (E-Commerce Firms Sales) కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించడానికి అనుమతించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.
Aarogya Setu App: ప్రధాని మోదీ చెప్పిన యాప్ ఇదే, ఆరోగ్య సేతు యాప్ మీ దగ్గరఉంటే కరోనా పూర్తి వివరాలు మీ చేతుల్లో ఉన్నట్లే, ఎలా వాడాలో తెలుసుకోండి
Hazarath Reddyఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది.