టెక్నాలజీ

PSLV-C53 Launch: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్, సింగ‌పూర్‌, కొరియాకు చెంది మూడు ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి తీసుకువెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53

Hazarath Reddy

ఇస్రో గురువారం నిర్వ‌హించిన పీఎస్ఎల్వీ-సీ 53 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ (PSLV-C53 Launch) గురువారం సాయంత్రం 6.02 గంట‌ల‌కు నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకెళ్లింది.

SBI Servers Down: దేశ వ్యాప్తంగా SBI సర్వర్లు డౌన్, నిలిచిపోయిన యోనో యాప్‌, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డౌన్‌పై సోషల్ మీడియాలో ఫిర్యాదులు

Hazarath Reddy

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్‌, యూపీఐ సేవలు (SBI Servers Down) నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు.

Mukesh Ambani Resigns: జియో డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న ముఖేస్ అంబానీ, కుమారుడు ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్‌గా ప్రకటించిన సంస్థ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు

Hazarath Reddy

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జియో​ డైరెక్టర్ పదవి నుంచి ముఖేశ్‌ అంబానీ వైదొలగినట్టు జియో మంగళవారం తెలిపింది.

Pallonji Mistry Dies: నిద్రలోనే కన్నుమూసిన పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ, ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన బిజినెస్‌ టైకూన్‌

Hazarath Reddy

పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు.

Advertisement

#instagramdown: ఇన్‌స్టా‌గ్రాం డౌన్, ట్విట్టర్లో ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు, మీరు ఆ మీమ్స్‌ను చూస్తారా..

Hazarath Reddy

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్‌స్టా‌గ్రాం సోమవారం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. యూజర్లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. దీంతో యూజర్లంతా ట్విట్టర్ వేదికగా #instagramdown డౌన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. రకరకాల Funny Memesతో ట్విట్టర్లో యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా వీటిని ఓ సారి చూసేయండి.

Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు

Hazarath Reddy

27 ఏళ్ళ తరువాత ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (Internet Explorer) కథ ముగిసింది. జూన్‌ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయడం లేదని వార్తలు వస్తున్నాయి.

PAN-Aadhaar Linking: ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే రూ. 1000 ఫైన్, పాన్ కార్డు బ్లాక్, మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.10వేల వరకు జరిమానా, వెంటనే ఈ వివరాల ద్వారా ప్రాసెస్ పూర్తి చేయండి

Hazarath Reddy

పాన్ కార్డు (PAN Card) కు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు సమీపిస్తోంది. ఒక‌వేళ మీరు ఇప్ప‌టికీ మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయ‌కుంటే వెంటనే చేయండి.ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఆధార్‌-పాన్‌కార్డు అనుసంధానంపై రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 దాటితే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

Fact Check: ఫాస్టాగ్‌ స్కాన్‌ చేసి డబ్బులు కొట్టేయడం అసాధ్యం, ఆ బుడ్డోడి వీడియో ఫేక్, క్లారిటీ ఇచ్చిన NPCI,పేటీఎం సంస్థలు, ఫాస్టాగ్‌ వ్యక్తికి, వ్యక్తికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్‌ కాదని వెల్లడి

Hazarath Reddy

జాతీయ రహదారులపై టోల్‌ గేట్ల వద్ద చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌ వ్యవస్థలో వ్యక్తుల మధ్య లావాదేవీలు సాధ్యం కాదని భారత జాతీయ చెల్లింపుల మండలి(ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది.

Advertisement

RBI: కస్టమర్ మొబైల్‌ వాలెట్‌ లేదా కార్డులో నగదు జమ చేయవద్దు, ఫిన్‌టెక్‌లకు ఆర్‌బీఐ షాక్‌, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

Hazarath Reddy

ఫిన్‌టెక్‌లకు ఆర్‌బీఐ షాక్‌ ఇచ్చింది. అమెజాన్‌పే, ఫోన్‌పే, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సింపుల్‌ వంటి 35కు పైగా నాన్‌ బ్యాంకింగ్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) కంపెనీలకు (Fintech firms) ఆర్‌బీఐ ఝలక్ ఇచ్చింది.

Tokenisation Rules: డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లు అలర్ట్ అవ్వండి, జూలై 1 నుంచి టోకెనైజేషన్‌ నిబంధనలు అమల్లోకి, మర్చంట్లు కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాలని RBI ఆదేశాలు

Hazarath Reddy

కార్డుల ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు గత ఏడాది ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ నిబంధనలు (Tokenisation Rules) జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధన అమలుతో మర్చంట్లు కస్టమర్ల కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాల్సి ఉంటుంది.

Credit Card Minimum Due: క్రెడిట్ కార్డు మినిమం అమౌంట్ కడితే ఏమవుతుంది, దాని వల్ల మీరు ఎంత డబ్బు వడ్డీ రూపంలో లాస్ అవుతారు

Hazarath Reddy

క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన తర్వాత కచ్చితంగా నెల చివరిలో క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే కొంత మంది మినిమమ్ బ్యాలెన్స్ ( Minimum Amount Due in Credit Card) కూడా చెల్లిస్తూ ఉంటారు.

Facebook Special Section: ఫేస్‌బుక్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్, మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదో తెలుసుకోవచ్చు, ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీ

Naresh. VNS

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో (Facebook) ఇంట్రెస్టింగ్ ఫీచర్ (Interesting Feature) గురించి తెలుసా? మీరు ఎంతమందికి ఫ్రెండ్ రిక్వెస్టులు (Friend request) పంపారో.. ఎవరెవరో మీ రిక్వెస్ట్ అంగీకరించలేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లకు సంబంధించి ఫేస్‌బుక్ ఎప్పుడో ఈ సెక్షన్ ప్రవేశపెట్టింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయని లిస్టు మొత్తం ఈ సెక్షన్‌లోనే చూడొచ్చు.

Advertisement

Fake Electricity Bill Scam: కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్, దాన్ని ఓపెన్ చేయగానే అకౌంట్ నుంచి రూ.48,500 కట్, ముంబై డాక్టర్‌కి చేదు అనుభవం, ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

Hazarath Reddy

ఫేక్ మేసేజ్ లతో జాగ్రత్త అని సైబర్ నిపుణులు చెబుతున్నా చాలామంది మోసపోతున్నారు. తాజాగా ముంబైలో ఓ డాక్టర్ హ్యాకర్ల చేతిలో మోసపోయాడు. ఫేక్ మెసేజ్ ఓపెన్ చేయడం ద్వారా ఏకంగా రూ.48500 పోగొట్టుకున్నాడు.

WhatsApp Groups Banned: వాట్సప్ గ్రూపులతో జాగ్రత్త, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న 10 మంది అరెస్ట్, 35 వాట్సాప్‌ గ్రూప్‌లను నిషేధించినట్లు తెలిపిన కేంద్ర హోంశాఖ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో అగ్నిపథ్‌ పథకం, అగ్నివీర్‌లకు సంబంధించి వాట్సాప్‌ గ్రూప్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్‌ గ్రూప్‌లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Find Your Wi-Fi Password: వైఫై పాస్‌ వర్డ్‌ను మర్చిపోయారా? ఇలా చేస్తే చాలు ఈజీగా తిరిగి తెలుసుకోవచ్చు, విండోస్ 11 లో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి

Naresh. VNS

పాస్ వర్డ్ మరిచిపోయి వైఫై నెట్ వర్క్ లాగిన్ (Wifi) అవ్వడంలో ఇబ్బంది పడుతుంటారు. వైఫై నెట్ వర్క్ లాగౌట్ అయిన తర్వాత మళ్లీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పాస్ వర్డ్ ఏమై ఉంటుందో తెలియక ఆందోళన పడుతుంటారు. అదే మీరు విండోస్ 11లో వై-ఫై పాస్ వర్డ్ మరిచిపోయినా ఈజీగా గుర్తుపట్టవచ్చు.

China Sky Eye telescope: ఏలియన్స్ నుంచి చైనా శాస్త్రవేత్తలకు సంకేతాలు? ఖగోళ పరిశోధనల్లో ట్విస్ట్, సిగ్నల్స్ ను విశ్లేషిస్తున్న సైంటిస్టులు, అతిపెద్ద టెలిస్కోప్ కు విశ్వం నుంచి అందిన సంకేతాలు

Naresh. VNS

స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త స‌మాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవ‌త‌ల కూడా ప్రాణులు ఉన్న‌ట్లు టెలిస్కోప్ స్కై ఐ (Sky Eye) గుర్తించింది. చైనాకు (China)చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని తెలిపింది. మొదట ఈ రిపోర్ట్‌ను ప్ర‌చురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని తొలగించింది.

Advertisement

Water on Moon:చంద్రుడిపై నీళ్లున్నాయ్! చైనా పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడి, 200 డిగ్రీల సెల్సియస్‌ లో శాంపిల్స్ సేకరించిన చైనా లునార్, ఎంత మోతాదులో ఉన్నాయో అంచనా వేస్తున్న పరిశోధకులు

Naresh. VNS

షాంగ్‌ఈ-5 గతేడాది భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు తన వెంట తెచ్చిన శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సూర్యుడి వైపు ఉన్న చంద్రుడి భూభాగంపై 200 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ శాంపిల్స్‌ను ల్యాండర్ సేకరించింది. వాటిపై చేసిన పరిశోధనల ఫలితాలు కూడా లూనార్ ల్యాండర్ (lunar lander) పంపిన ఫలితాలతో సరితూగినట్లు చైనా సైంటిస్టులు చెబుతున్నారు.

UIDAI: అప్పుడే పుట్టిన పిల్లలకు, చనిపోయిన వారికి కూడా ఆధార్, రెండు పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించే యోచనలో కేంద్రం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా చర్యలు

Hazarath Reddy

5G Spectrum: 5జీ సేవలపై కేంద్రం కీలక నిర్ణయం, 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించిన కేంద్ర కేబినెట్, జులై నెలాఖరుకి వీటిని వేలానికి తీసుకురానున్నట్టు తెలిపిన మోదీ సర్కారు

Hazarath Reddy

దేశంలో 5జీ టెలికం సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించింది.

LaMDA: షాకింగ్ న్యూస్... రోబోలకు ఫీలింగ్స్ వస్తున్నాయట, గూగుల్ ఇంజనీర్ తన సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు

Hazarath Reddy

రోబోలకు ఫీలింగ్స్ ఉంటాయా అంటే.. ఉంటాయని అంటోంది గూగుల్. గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజినీర్‌, సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సహాయంతో పని చేసే ఆ బాట్ అచ్చం మనిషిలాగే ప్రవర్తించడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement
Advertisement