World
Philippines: మనీలాలో భారత్ కోచ్ దారుణ హత్య, ఇంట్లోకి చొరబడిన తుఫాకీతో కాల్చి చంపిన దుండగులు, తలలో తూటాలు దిగి అక్కడిక్కడే మృతి
Hazarath Reddyఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో.. భారత్‌లోని పంజాబ్‌, మోగా ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ గిండ్రూ(43)ను దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గుర్‌ప్రీత్‌ నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్‌ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారం ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు.
COVID Scare in China: ఇంతటి దారుణ పరిస్థితులా, రోడ్ల మీదనే కరోనా శవాలను కాల్చివేస్తున్న చైనా వాసులు, ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న వీడియోలు, కోవిడ్ మృతదేహాలతో నిండిపోయిన శ్మశానాలు
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్‌ చైనాను (COVID Scare in China) కకావికలం చేస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌7 ధాటికి నగరాలకు నగరాలే పెరుగుతున్న కేసులతో విలవిలలాడుతున్నాయి. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
US Shooting: ఉటాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు మైనర్లు
Rudraఅమెరికాలోని ఉటా రాష్ట్రంలో కాల్పుల కలకలం జరిగింది. ఎనోక్ పట్టణంలోని ఓ ఇంట్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు మైనర్లు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
XBB.1.5 Sub-variant: XBB.1.5 కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..
Hazarath Reddyయుఎస్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌ఫెక్షన్ యొక్క మరింత తరంగాలకు ఈ వైరస్ కారణమయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి.
ByteDance Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన బైట్‌డాన్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం, యుఎస్ జాతీయ భద్రతా ఆందోళనల మధ్య క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్న టిక్ టాక్ ఓనర్
Hazarath Reddyటిక్‌టాక్ యొక్క చైనా ఆధారిత యజమాని బైట్‌డాన్స్ అనేక విభాగాలలో వందలాది మంది కార్మికులను తొలగించినట్లు మీడియా నివేదించింది. 600 మిలియన్ల రోజువారీ క్రియాశీల వినియోగదారులతో టిక్‌టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్‌లోని ఉద్యోగులను తొలగించింది.
Heart-warming Video: గుండెల్ని హత్తుకునే వీడియో తప్పక చూడండి, సైన్యంలో పోరాడుతున్న భర్తను 30 వారాల తర్వాత చూసి కన్నీరు పెట్టుకున్న గర్భవతైన ఉక్రెయిన్ మహిళ
Hazarath Reddyఉక్రెయిన్‌లో గుండెను హత్తుకునే వీడియో వెలుగులోకి వచ్చింది. దేశం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైనికుడు చాలా కాలం తర్వాత గర్భవతిగా ఉన్న తన భార్యను కలుసుకుంటున్నట్లుగా వీడియోలో ఉంది. అంటోన్‌ గెరాష్చెంకో అనే ట్విటర్‌ అకౌంట్‌లో అ వీడియో పోస్టు చేశారు.
US: అమెరికాలో సంచలన కేసు, రహస్యంగా 560 మృతదేహాల అవయువాలను విక్రయించి లక్షలు పోగేసిన మహిళ, నేరం రుజువు కావడంతో 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు
Hazarath Reddyఅమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగు చూసింది. శ్మశన వాటిక మాజీ ఓనర్‌ (Former Colorado funeral home owner) అయిన ఓ 46 ఏళ్ల మహిళ.. 560 శవాల శరీర భాగాలను విడదీసి, చనిపోయిన వారి బంధువుల అనుమతి లేకుండా (selling body parts without permission) ఆ శరీర భాగాలను విక్రయించింది.
Tattoo on Eyes: యువతికి ఇదేమి జబ్బు, కళ్ళపైన టాటూవేయించుకుంటుండగా కంటిలోపలికి దూసుకుపోయిన సూది, టాటూ ఆర్టిస్ట్‌కు జరిమానా విధించిన కోర్టు
Hazarath Reddyఅలెక్సాండ్రా సడోవ్స్క్‌గా గుర్తించబడిన ఒక యువతి తన కంటి ఇంకింగ్ సరిగా ట్రీట్ కాకపోవడంతో అంధురాలు అయింది. తెల్లటి భాగానికి నలుపు రంగు వేయడానికి బొంగ్లింగ్ టాటూ ఆర్టిస్ట్ సూదితో చాలా లోతుగా కనుగుడ్డులోకి చొచ్చుకుపోయాడు. పచ్చబొట్టు కళ్లపై ఉపయోగించేందుకు ధృవీకరించబడని సిరాను ఉపయోగించారు. దీంతో ఆమె తన కన్నును కోల్పోయింది
2023's First Sunrise: ఈ ఏడాది తొలి సూర్యోదయం వీడియో ఇదే, సూర్యుడు మెల్లిగా బయటకు వస్తున్న దృశ్యం నిజంగా అద్భుతమే, కొత్త ఏడాది, తొలి సూర్యోదయం అంటూ ట్వీట్ చేసిన జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా
Hazarath Reddyకొత్త ఏడాదిలో మొదటి రోజు సూర్యోదయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా చెబుతున్నారు. ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న కొయిచీ.. కొత్త సంవత్సరాన్ని తొలి సూర్యోదయంతో స్వాగతించారు.
Recession In One-third Global Economy: ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కష్టకాలం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు మాంద్యంలో ఉందని తెలిపిన ఐఎంఎఫ్ చీఫ్
Hazarath Reddyఅమెరికా, చైనా, యూరప్‌లు మందగమనంలో ఉన్నందున 2023 ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కష్టతరమైన సంవత్సరంగా (Recession In One-third Global Economy) మారనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ క్రిస్టాలినా జార్జివా (IMF chief Kristalina Georgieva ) అన్నారు.
BSF Seizes Heroin: పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారత్‌లోకి హెరాయిన్ స్మగ్లింగ్, మాటువేసి పట్టుకున్న బీఎస్ఎఫ్ బలగాలు, డ్రోన్ స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
Hazarath Reddyపాకిస్తాన్ నుంచి ఒక కిలొ హెరాయిన్‌ను మోసుకొస్తున్న డ్రోన్ ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పంజాబ్ లోని గురుదాస్‌పూర్ సెక్లార్ సమీపంలో ఓ పాత డ్రోన్ ఈ హెరాయిన్ తీసుకువెళుతుండగా BSF దళాలు పట్టుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ డ్రోన్ పట్టుబడటం కలకలం రేపుతోంది,
Russia-Ukraine War: ర‌ష్యాపై మిస్సైల్‌తో విరుచుకుపడిన ఉక్రెయిన్, సుమారు 400 మంది సైనికులు మృతి, మ‌కీవ్‌కా న‌గ‌రంలో బిల్డింగ్‌ను టార్గెట్ చేసిన మిస్సైల్
Hazarath Reddyర‌ష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్‌తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఆక్ర‌మిత డోన‌స్కీ ప్రాంతంలో ఆ క్షిప‌ణి దాడి జ‌రిగింది. మ‌కీవ్‌కా న‌గ‌రంలో ఉన్న ఓ బిల్డింగ్‌ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్‌లో ర‌ష్యా ద‌ళాలు ఉంటున్న‌ట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్ప‌ష్టంగా తెలియ‌దు.
Brazil: ముచ్చటగా మూడోసారి, బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్లా ప్రమాణ స్వీకారం, బ్రెజిల్‌ను పునర్నిర్మిస్తానని హామీ
Hazarath Reddyబ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్లా (76) పదవీ ప్రమాణం చేశారు. లులా మూడోసారి బ్రెజిల్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నడుమ లులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్‌ బోల్సోనారోపై విజయం సాధించారు.
Australia: ల్యాండింగ్ అవుతూ ఒకేసారి ఢీకొన్న రెండు హెలికాప్టర్లు, నలుగురు ప్రయాణికులు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఆస్ట్రేలియన్ టూరిస్ట్ హాట్‌స్పాట్‌లో సోమవారం మధ్యాహ్నం రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
New Year Party: కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం... ఆనందోత్సాహాల్లో హైదరాబాదీలు, వైజాగ్ ప్రజలు.. వీడియోలు ఇవిగో!
Rudraప్రపంచంలోని పలు దేశాలు 2023 సంవత్సరానికి ఘనస్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సరాదిని అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ నగరం బాణసంచా వెలుగులతో నిండిపోయింది.
Omicron Subvariant XBB 1.5: భారత్ లో ప్రవేశించిన సరికొత్త ప్రమాదకరమైన కరోనా వేరియంట్, 120 రెట్లు వేగంగా వ్యాపించే చాన్స్, గుజరాత్ లో తొలి Omicron Subvariant XBB.1.5 కేసు నమోదు..
kanhaOmicron కొత్త సబ్ వేరియంట్ XBB.1.5 భారతదేశంలో ప్రవేశించింది. ఇండియన్ SARS కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నుండి వచ్చిన సమాచారం ప్రకారం, Omicron, XBB.1.5 ఉప-వేరియంట్ డిసెంబర్‌లోనే భారతదేశంపై దాడి చేసింది. ఈ వేరియంట్ మొదటి కేసు గుజరాత్‌లో కనుగొనబడింది.
Former Pope Benedict Dies: మాజీ పోప్ బెనిడిక్ట్ ఇక లేరు, 95 ఏట అనారోగ్యంతో కన్నుమూత, ప్రపంచ వ్యాప్తంగా రోమన్ కేథలిక్కుల్లో విషాదం..
kanhaమాజీ పోప్ బెనెడిక్ట్ XVI శనివారం వాటికన్‌లోని తన నివాసంలో మరణించారు. అధికారిక ప్రకటన ప్రకారం, ఆయన వయస్సు 95 సంవత్సరాలు. వాటికన్ ఒక ప్రకటనలో, "పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ XVI ఈ ఉదయం 9.34 గంటలకు వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో తుదిశ్వాస విడిచారని మీకు బాధతో తెలియజేస్తున్నాను" అని వాటికన్ పేర్కొంది.
Happy New Year Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు! న్యూ ఇయర్ 2023 సందేశాలు, 2023 ఫేస్‌బుక్ స్టేటస్ చిత్రాలు, 2023 Quotesకు సంబంధించి కొన్ని ఆణిముత్యాలను HD వాల్‌పేపర్ల రూపంలో మీకోసం
Vikas Mandaనూతన సంవత్సర శుభాకాంక్షలు , న్యూ ఇయర్ 2020 సందేశాలు, 2020 ఫేస్‌బుక్ స్టేటస్ చిత్రాలు, 2020 కోట్స్ HD వాల్‌పేపర్లకు సంబంధించి కొన్ని ఆణిముత్యాలను సేకరించి మీకోసం ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం, వీటిని మీ ప్రియమైన వారికి పంపి వారి ప్రేమాభిమానాలు మీ సొంతం చేసుకోవాలని, వారితో మీ అనుబంధం కలకాలం నిలవాలని ఆకాంక్షిస్తున్నాం....
China Corona Deaths: జనవరిలో కరోనా మరణమృదంగమే! చైనాలో ప్రతిరోజు 25వేల మంది చనిపోయే అవకాశముందని హెచ్చరిక
VNSడిసెంబర్‌ 1 నుంచి నెలాఖరు వరకు 1.86 కోట్ల మంది కరోనా బారినపడినట్లు తెలిపింది. అలాగే ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరినట్లు పేర్కొంది. గత వారం కంటే కరోనా మరణాలు రెట్టింపు అయ్యాయని, పత్రి రోజూ సుమారు 9 వేల మరణాలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త ఏడాది జనవరిలో చైనాలో మరింతగా కరోనా విజృంభిస్తుందని బ్రిటన్‌కు (Britain) చెందిన ఆ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
WHO Warns on Covid-19: బీ అలర్ట్! రానున్న రోజుల్లో మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే అవకాశం, దాదాపు 500కు పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వ్యాప్తి
VNSఇప్ప‌టికే 500కి పైగా ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్లు (Omicron Variant)వ్యాపిస్తున్నాయ‌ని పేర్కొంది. చైనాలో తీవ్ర‌స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగు చూడ‌డం ఆందోళ‌న‌క‌రం అని డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌తినిధి మ‌రియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. `ప్ర‌పంచ దేశాలు కొవిడ్ ఆంక్షలు స‌డ‌లించాయి. ఇదే టైంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్ర‌బ‌లంగా వ్యాపిస్తున్న‌ది.