World
Somalia Bomb Blast: మళ్లీ యాక్టీవ్ అయిన అల్‌ ఖైదా, సోమాలియాలో వరుస బాంబు పేలుళ్లు, 100 మంది మృతి, ఎక్కడ చూసినా రక్తపు ముద్దలు, శవాల గుట్టలు
Naresh. VNSమొదటి పేలుడు సంభవించిన తర్వాత గాయపడిన వారికి సాయం అందించేందుకు అంబులెన్సులు, పెద్దఎత్తున జనాలు చేరుకున్న సమయంలోనే రెండో పేలుడు చోటుచేసుకుంది. పేలుళ్ల (Blast) ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ మృతదేహాలతో పరిసరాలు భీతావహంగా మారాయి.
Halloween Stampede: వీడియోతో... హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 151 మంది మృతి.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన.. జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా ఒక్కసారిగా ఘోరం..
Sriyansh Sదక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సంబరాల్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా 151 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Oklahoma House Fire: అయ్యో పాపం! ఓ ఇంట్లో ఎనిమిది శవాలు, ఆత్మహత్యా? లేక హత్యా? అనే అనుమానం, మృతుల్లో ఆరుగురు చిన్నారులు, మర్డర్ చేసి సూసైడ్‌గా చిత్రీకరించేందుకు భారీ కుట్ర చేశారంటున్న సాక్షులు
Naresh. VNSఈ ఇంట్లో కాలిపోయిన చనిపోయిన ఆరుగురు చిన్నారులు (Six children killed) ఒక సంవత్సరం నుంచి 13 ఏళ్ల లోపు వారని పోలీస్ చీఫ్ బ్రాండన్ బెర్రీహిల్ తెలిపారు. కానీ వీరు మరణాలు అగ్ని ప్రమాదం వల్ల మరణించినట్లు కనిపించడంలేదని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా తెలపడంతో ఈ ఘటనపై మరింత మిస్టరీగా మారింది
Human Washing Machine: ఈ మిషన్ బట్టల్ని కాదు, మనుషుల్ని ఉతుకుతుంది! జపాన్ సైంటిస్టులు కొత్త సృష్టి, మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ టెస్టింగ్, త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి....ఎలా పనిచేస్తుందో తెలుసా?
Naresh. VNSబట్టల్ని ఉతకడానికి వాషింగ్ మెషీన్ (Washing Machine) ఉంది. మరి మనుషుల్ని ఉతకడానికి కూడా వాషింగ్ మిషిన్ ఉంటుందా? అనే అనుమానం ఎవరికో ఒకరికి వచ్చే ఉంటుంది. మన దేశంలో ఇలాంటి ఆలోచనలు చాలా మట్టుకు ఆలోచన వరకే ఆగిపోతాయి. కానీ, ఇవే ఆలోచనలు జపాన్ (Japan) వాళ్లకు వస్తే.. వెంటనే ఆ ఆలోచన కాస్త ఆచరణగా మారుతుంది. అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ కొత్త వాషింగ్ మెషీన్
Viral Video: మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో కుమ్ములాట, అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్న వీడియోలు వైరల్
Hazarath Reddyన్యూయార్క్‌లోని స్టేటన్‌ ఐల్యాండ్‌లో తొలిసారి జరిగిన మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు కొట్టుకున్నారు.
US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు, ట్రక్కును ఢీకొట్టిన మినీ వ్యాన్
Hazarath Reddyఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురు విద్యార్థులు (Three students from Telugu states) మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.మంగళవారం కనెక్టికట్ రాష్ట్రంలో ట్రక్కు మరియు మినీ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఈ ప్రమాదం జరిగింది.
Covid in Wuhan: మళ్లీ అక్కడి నుంచే మొదలా, చైనా వుహాన్‌లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు,కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి, సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలు మినహా అన్నీ మూసివేత
Hazarath Reddyప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనావైరస్ మొట్టమొదటగా చైనాలోని వుహాన్‌లో (Wuhan) బయటపడిన సంగతి విదితమే.కరోనా మూలాలపై ఇంకా స్పష్టత లేనప్పటికీ వుహాన్‌లోనే కోవిడ్ వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి.
Python Swallows Woman: వామ్మో! మహిళను మింగేసి హాయిగా పడుకున్న 22 అడుగుల కొండ చిలువ, పొట్ట చీల్చి చూసి షాకైన భర్త, చెట్ల కోసం అడవిలోకి వెళ్లి కొండచిలువకు ఆహారమైన ఇండోనేషియా మహిళ, ఒళ్లు గగుర్పొడుస్తున్న సంఘటన
Naresh. VNSగ్రామస్థులందరూ కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. జరాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని స్థానిక అధికారులు తెలిపారు. ఆమెను మింగడానికి ముందు చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Video: రష్యా ఆక్రమిత నగరం మెలిటోపోల్‌లో కారు బాంబు పేలుడు, అయిదు మందికి గాయాలు, ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం ఆవరణలో పేలిన కారు
Hazarath Reddyఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత నగరం మెలిటోపోల్‌లో పేలుడు సంభవించడంతో కనీసం ఐదుగురు గాయపడ్డారు. ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం ఆవరణలో కారు పేలిపోయింది. మెలిటోపోల్ దాని రాజధాని తర్వాత జపోరిజ్జియా ఒబ్లాస్ట్‌లో రెండవ అతిపెద్ద నగరం.
Cyclone Sitrang: బంగ్లాదేశ్‌‌కు కన్నీటిని మిగిల్చిన సిత్రాంగ్ తుపాన్, 35 మంది మృతి, కుప్పకూలిన వేల ఇండ్లు, వేల హెక్టార్లలో పంట నష్టం, వేల సంఖ్యలో కొట్టుకుపోయిన ఫిషింగ్‌ ప్రాజెక్టులు
Hazarath Reddyసిత్రాంగ్‌ తుఫాను ధాటికి బంగ్లాదేశ్‌ అతలాకుతలమయింది.భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు సంభవించి 35 మంది ప్రాణాలు ( kills people in Bangladesh) కోల్పోయారు. దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు.ఈ తుపాను (Cyclone Sitrang) బెంగాల్‌ తీరం సమీపంలో బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌ వద్ద తీరందాటింది.
World's Dirtiest Man Dies: 60 ఏళ్ల తర్వాత తొలిసారి స్నానం చేశాడు! కొద్దిరోజులకే చనిపోయాడు, ఆరు దశాబ్దాలుగా ఒంటిపై నీటి చుక్క పడనీయకుండా ఉన్న వ్యక్తి, స్నానం చేయకుండా 94 ఏళ్లు బతికిన వరల్డ్ డర్జీయెస్ట్ మ్యాన్
Naresh. VNSఅయితే స్నానం చేసిన కొద్దిరోజులకే మరణించడం గమనార్హం. అతను ముళ్ల పందులను వండుకోకుండానే తినేవాడు. మురికి గుంటల్లోని నీటిని తుప్పుపట్టిన డబ్బాల్లో పట్టుకొని తాగేవాడు. ఎండిన పశువుల పశువుల పేడను తన దగ్గరున్న పాత పైపుల్లో పెట్టుకొని పొగతాగేవాడు. ఒకేసారి నాలుగు సిగిరెట్లు తాగేవాడు. అయితే ఒకసారి బలవంతంగా స్నానం చేయించేందుకు తీసుకెళ్తుండగా...మధ్యలోనే వ్యాన్ నుంచి దూకిపారిపోయాడు.
Myanmar Air Strike: మయన్మార్‌లో సైనిక పాలన అరాచకం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిపై మూడు జెట్‌ ఫైటర్లతో 4 బాంబులు, 80 మంది మృతి
Hazarath Reddyమయన్మార్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటంతో వారిని అణిచివేసేందుకు సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కచిన్‌ రాష్ట్రంలో జరుపుకుంటున్న వేడుకలపై సైన్యం విరుచుకుపడటంతో మారణకాండ చోటుచేసుకున్నది.
Rishi Sunak's First Speech: ప్రధాని హోదాలో రిషి సునక్ తొలి ప్రసంగం, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ను గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని సందేశం
Hazarath Reddyబ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా (UK prime minister) రిషి సునక్ పదవీ బాధ్యతలు చేపట్టారు. రిషి సునాక్ నేడు బకింగ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ తో భేటీ అనంతరం నెం.10 డౌనింగ్ స్ట్రీట్ లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయానికి విచ్చేశారు.
Arshad Killing: కెన్యాలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ కాల్చివేత.. ఉద్దేశపూర్వకంగానే హత్య?!
Jai Kకెన్యాలో జరిగిన పోలీసు కాల్పుల్లో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ మృతి చెందారు. అర్షద్ మృతిని ఆయన భార్య ధ్రువీకరించారు. పోలీసు కాల్పుల్లో తన స్నేహితుడు, భర్త, తన ఫేవరెట్ జర్నలిస్ట్ అర్షద్‌ మృతి చెందారని ఆయన భార్య జవేరియా సిద్ధిఖి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Rishi Sunak: చరిత్ర సృష్టించిన రిషి సునక్, బ్రిటన్ ప్రధానిగా విజయం సాధించిన రిషి సునక్, తెల్ల దొరల గడ్డపై ప్రధానిగా తొలి భారతీయ మూలవాసి
kanhaభారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా చరిత్ర సృష్టించాడు. పెన్నీ మోర్డాంట్‌ను ఓడించి రిషి సునక్ గెలుపు సాధించారు. రిషి సునక్‌కు 180 కంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభించగా, పెన్నీ మోర్డాంట్ మద్దతులో చాలా వెనుకబడి ఉన్నాడు, ఆ తర్వాత అతను తన పేరును ఉపసంహరించుకున్నాడు. రిషి సునక్ అక్టోబర్ 28న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Somalia Car Bomb:హోటల్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, విద్యార్థులతో సహా తొమ్మిది మంది మృతి, మరో 47 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyసోమాలియాలో రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. తొలుత పేలుడు పదార్థాలతో నింపిన కారుతో తవక్కల్‌ హోటల్‌ గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు.
Train through Flame: ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన గూడ్స్ ట్రెయిన్.. పట్టాలపై అగ్నికీలలు.. అయినా మంటల మధ్య నుంచే దూసుకెళ్లిన రైలు.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..
Jai Kసెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఓ గూడ్స్ ట్రెయిన్ అనంతరం ట్రాక్ పై రేగిన మంటల మధ్య నుంచే వేగంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారండి. ఈ ఘటనలో సమీపంలోని పలు ఇండ్లకు మంటలు అంటుకున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Indonesia: ఇండోనేషియాలో ఘోర విషాదం, సిరప్‌ తాగి 99 మంది చిన్నారులు మృతి, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినడంతో మృతి చెందినట్లుగా వార్తలు, సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyఇండోనేషియాలో సిరప్‌లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Liz Truss Resigns As UK PM: ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే.. బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా, లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరో మారు రాజకీయ సంక్షోభం
Hazarath Reddyబ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే ఆమె బాధ్యతల నుంచి వైదొలిగారు. బ్రిటన్‌లో చరిత్రలోనే అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేత ట్రసే కావడం గమనార్హం. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని (Liz Truss Resigns As UK Prime Minister) వెల్లడించారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్ వదిలి వెంటనే వెళ్లిపోండి, భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్‌ ఎంబసీ, 4 నగరాల్లో మార్షల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రష్యా
Hazarath Reddyరష్యా-క్రిమియాను కలిపే కెర్చ్‌ వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్‌పై మాస్కో దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి.రెండు దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్నది. రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా క్రెమ్లిన్‌ సేనల దాడులు కొనసాగుతున్నాయి.