ప్రపంచం

‘Nokia 4G on The Moon’: చంద్రునిపై నోకియా 4జీ నెట్‌వర్క్, ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు తెలిపిన నాసా, ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో ప్రారంభించేందుకు నాసా కసరత్తు

Hazarath Reddy

చందమామ మీదకు వెళ్లేందుకు ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో నాసా ప్రారంభించిందేకు రెడీ అవుతోంది. అయితే దీని కోస నాసాకు సహజంగా సమర్థవంతమైన మరియు నమ్మదగిన కమ్యూనికేషన్ సెటప్ అనేది చాలాఅవసరం. ఈ నేపథ్యంలో నాసా నోకియాతో జత కట్టింది. చంద్రునిపై 4 జి ఎల్‌టిఇ సెల్యులార్ నెట్‌వర్క్‌ను (Nokia 4G Networks On The Moon) నిర్మించేందుకు నోకియాకు భారీ ఎత్తున నిధులు అందించేందుకు నాసా రెడీ అయింది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి నోకియా (Nokia) చేపట్టిన ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు నాసా (Nasa) ప్రకటించింది.

Covid in India: రెమెడిసివర్‌ ఔషధంపై డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ వ్యాఖ్యలు, గులాం నబీ ఆజాద్‌‌కు కరోనా, కోవిడ్‌తో బీహార్ మంత్రి మృతి, దేశంలో తాజాగా 62,212 మందికి కరోనా, 1,12,998 మంది కరోనాతో మృత్యువాత

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 62,212 పాజిటివ్‌ కేసులు (Coronavirus Outbreak in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,681కి చేరింది. నిన్న ఒక్క రోజే 837 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,12,998 మంది కరోనాతో మృత్యువాత (Coronavirus Deaths) పడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 65,24,596 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

COVID-19 in India: కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న ఆశలు, రష్యా నుంచి రెండవ వ్యాక్సిన్, చైనా వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు, దేశంలో తాజాగా 63,371మందికి కోవిడ్-19, బ్లడ్‌ గ్రూప్‌ O ఉన్నవారు సేఫ్ అంటున్న శాస్త్రవేత్తలు

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 63,371 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (2020 Coronavirus Pandemic in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. నిన్న ఒక్క రోజే 895 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,12,161 మంది కరోనాతో మృత్యువాత (Covid Deaths) పడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 64,53,780 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

'I Feel so Powerful, I'll Kiss Everyone': నేను అందరినీ గాఢంగా ముద్దుపెట్టుకోగలను, చాలా బలంగా ఉన్నాను, ఫ్లోరిడా ప్రచార సభలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు, అమెరికా అధినేతకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపిన వైట్ హౌస్

Hazarath Reddy

కరోనావైరస్ సోకి దాదాపు 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో (Donald Trump Returns to Campaign) కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డాను. నా శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా ఉంది" అని ఆయన అన్నారు. "నేనిప్పుడు చాలా బలంగా ఉన్నాను. అద్భుతమైన శక్తి నాలో ప్రవేశించింది. నేను ఎవరి మధ్యకైనా వచ్చి, మీలో ఎవరినైనా ముద్దు పెట్టుకోగలను ('I Feel so Powerful,I'll Kiss Everyone'). ఎవరికైనా గట్టిగా ముద్దివ్వగలను" అని వందలాది మంది మద్దతుదారుల కేరింతల మధ్య ట్రంప్ వ్యాఖ్యానించారు.

Advertisement

COVID-19 Vaccine Update: ఆశలు ఆవిరవుతున్నాయా? జే అండ్‌ జే కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత, అస్వస్థతకు గురైన వాలంటీర్, కీలక ప్రకటన చేసిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి నిరోధానికి పలు ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు చివరి దశకు చేరాయి. ఈ వ్యాక్సిన్‌ పరీక్షలు (COVID-19 Vaccine Update) ఆశాజనకంగా సాగుతున్న క్రమంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే) (Johnson & Johnson) కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. మూడో దశ(ఫేజ్-3) ట్రయల్స్‌లో పాలు పంచుకుంటున్న వలంటీర్లలో ఒకరు అనారోగ్యం బారిన పడటంతో ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సంస్థ (J&J) సోమవారం నాడు ప్రకటించింది.

Coronavirus in India: కరోనాపై మళ్లీ షాకింగ్ నిజాలు, మనుషుల చర్మంపై 9 గంటల దాకా బ్రతికే ఉంటుంది, శీతాకాలంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం, దేశంలో తాజాగా 66,732 మందికి కోవిడ్-19

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం పేర్కొంది. మహమ్మారి కారణంగా కొత్తగా 816 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి (COVID-19 Count in India) చేరింది. ఇందులో 8,61,853 క్రియాశీల కేసులున్నాయి. 61,49,536 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు.

Kim Jong-un: కన్నీరు కార్చిన కిమ్ జోంగ్-ఉన్, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానంటూ ఆవేదన, ఉత్తరకొరియా కమ్యునిస్టు పార్టీ ఏర్పాటై 75 సంత్సరాలు సందర్భంగా భారీ ఖండాంతర క్షిపణిని ప్రదర్శించిన ఉత్తర కొరియా

Hazarath Reddy

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ (Kim Jong-un) కన్నీళ్లు పెట్టుకున్నారు. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా కమ్యునిస్టు పార్టీ ఏర్పాటై 75 సంత్సరాలు పూర్తైన నేపథ్యంలో శనివారం నాడు కిమ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగానికి (sobbing tears) లోనయ్యారు. ఉత్తర కొరియా ఇప్పుడు తీవ్ర ఆహార సంక్షోభాన్ని (North Korea crisis) ఎదుర్కుంటోంది.

Thailand Bus Accident: బస్సును ఢీకొట్టిన రైలు, ధాయిలాండ్‌లో ఘోర ప్రమాదం, 17 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు, బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు వెళుతుండగా ఘటన

Hazarath Reddy

థాయిలాండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో (Bus-Train Collision in Central Thailand) 17 మంది మృతి చెందారు. మరో 29 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా ఈ దుర్ఘటన (Thailand Bus Accident) చోటు చేసుకుందని ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు.

Advertisement

‘Beware Unmarried Men’: పెళ్లి కాని మగవారికి కరోనా మరణం రిస్క్ ఎక్కువట, సంచలన విషయాలు వెల్లడించిన స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో వ్యాసం ప్రచురణ

Hazarath Reddy

వివాహం ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగిస్తుంది, అయితే ఈ మహమ్మారి సమయంలో పెళ్లి కాని వారిపై (Unmarried Men) దిమ్మ తిరిగే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, అవివాహితుడిగా ఉండటం వల్ల COVID-19 తో చనిపోయే ప్రమాదం ఉందట (Unmarried Men At Higher Risk Of Corona Death). దీనితో పాటు, తక్కువ ఆదాయం, తక్కువ స్థాయి విద్య మరియు తక్కువ లేదా మధ్య-ఆదాయ దేశాలలో జన్మించిన వ్యక్తి ఈ వ్యాధికి గురయ్యే ఇతర ప్రమాద కారకాలు అని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు (Stockholm University in Sweden Study) హెచ్చరించారు.

India-China Tensions: బుద్ధి మారని చైనాతో ప్రమాదం, 60 వేల మందిని భారత ఉత్తర సరిహద్దులో మోహరించింది, సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో

Hazarath Reddy

సరిహద్దులో భారత్-చైనా ఉద్రికత్తలు కొనసాగుతున్న వేళ (India-China Tensions) అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించిందంటూ (China Deployed 60,000 Soldiers) చైనాపై అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.కాగా ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య ల‌డాఖ్‌లో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే. చైనా వైఖ‌రిని ఖండించిన అమెరికా విదేశాంగ మంత్రి.. డ్రాగన్ దేశం త‌న చెడు ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్లు ఆయన (US secretary of state Mike Pompeo) ఆరోపించారు.

Coronavirus in India: కరోనా మా దేశంలో పుట్టలేదంటున్న చైనా, భారత్‌లో తాజాగా 73,272 మందికి కరోనా, 24 గంటల్లో 926 మంది మృతితో 1,07,416 కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 73,272 కొత్త కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,79,424కు (Coronavirus Outbreak in India) చేరుకుంది. గత 24 గంటల్లో 926 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,07,416 కు (Coronavirus Deaths in India) చేరుకుందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 59,88,822కు చేరుకుంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,83,185 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 12.65 శాతం ఉన్నాయి.

Donald Trump: కరోనా వచ్చినా మాస్క్ లేకుండా ఫోటోలకు ఫోజు ఇచ్చిన ట్రంప్, మిలటరీ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్, తీవ్రస్థాయిలో వెలువెత్తుతున్న విమర్శలు, అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న బైడెన్

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (US President Donald Trump) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ బారిన పడి మిలటరీ ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం శ్వేతసౌధానికి తిరిగి వచ్చారు. వాల్టర్‌ రీడ్‌ మెడికల్‌ హాస్పిటల్‌ నుంచి (Discharged From Hospital) ప్రత్యేక హెలికాప్టర్‌లో వైట్‌హౌజ్‌కు చేరుకున్న ట్రంప్‌... ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌లో రిపోర్టకు అభివాదం చేస్తూ... థమ్సప్‌ సింబల్ చూపుతూ తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు.

Advertisement

Covid-19 Updates: కరోనాపై మరో షాకింగ్ న్యూస్, ప్రతి పదిమందిలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు, సంచలన విషయాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉందని హెచ్చరిక

Hazarath Reddy

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న సంగతి విదితమే.అయితే దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు పది మందిలో ఒకరు కరోనా బారినపడ్డారని (One in 10 worldwide may have had virus) ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఉన్నత స్థాయి అత్యవసర నిపుణుడు మైఖేల్ జె. ర్యన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Nobel Prize in Medicine 2020 Winners: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమానాలు, హెపటైటిస్ సి వైరస్‌ను కనిపెట్టినందుకు అవార్డులు,ఈ వ్యాధి ద్వారా కాలేయ క్యాన్సర్‌ సోకే ప్రమాదం

Hazarath Reddy

వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ బహుమానాలు (Nobel Prize in Medicine 2020 Winners) వరించాయి. ఇందులో ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు కాగా, మరొకరు బ్రిటిష్ శాస్త్రవేత్త. అమెరికాకు చెందిన హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్ కు చెందిన హైకెల్ హోటాలన్‌కు ఈ పురస్కారం లభించింది. ‘హెపటైటిస్ సి’ వైరస్‌ను (Hepatitis C virus) కనిపెట్టినందుకు గాను వీరికి ఈ అవార్డును ప్రకటించారు.

Coronavirus in India: కరోనా సెకండ్ వేవ్ మొదలయిందా? దేశంలో తాజాగా 74,442 మందికి కోవిడ్, రష్యాలో మరోమారు ఒక్కరోజే 10 వేలకు పైగా కేసులు నమోదు, సెకండ్ వేవ్ మొదలైందనే అనుమానాలు..

Hazarath Reddy

దేశంలో గడచిన 24 గంటలలో 74,442 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదవ్వగా.. 903 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,816గా (Coronavirus Update in India) ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,34,427గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,86,703కు చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది.

Donald Trump Health Update: పుకార్లు నమ్మకండి.. నాఆరోగ్యం బాగానే ఉంది, వీడియోని విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు, డిశ్చార్జ్‌ అయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడతానని తెలిపిన డొనాల్డ్ ట్రంప్

Hazarath Reddy

కరోనావైరస్ బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఆరోగ్యం (Donald Trump Health Update) విషమిస్తోందన్న వార్తల నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ఓ వీడియో ను ప్రజల ముందు ఉంచారు. ఈ వీడియోలో సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఆస్పత్రిలో చేరే సమయంలో అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడ్డా. ప్రస్తుతం బాగానే ఉన్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజులు నాకు అత్యంత కీలకం అని ఆయన అన్నారు.

Advertisement

Coronavirus in China: చైనాలో మళ్లీ కరోనావైరస్, తాజాగా మెయిన్‌లాండ్‌లో 10 మందికి కోవిడ్ పాజిటివ్, విదేశాల నుంచి వస్తున్న వారితో కరోనా వస్తుందని తెలిపిన చైనా జాతీయ ఆరోగ్య కమిషన్

Hazarath Reddy

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకిన విషయం విదితమే. అయితే చైనా కోవిడ్ ను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ మళ్లీ చైనాలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా చైనా దేశంలోని మెయిన్‌లాండ్‌లో (mainland) 10 మందికి కరోనా (Coronavirus in China) సోకింది. దీంతో చైనాలో మొత్తం విదేశాల నుంచి వచ్చిన 2,885 మందికి కరోనా సోకిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది.

Corona Rapid Test Update: కేవలం 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కరోనా లక్షణాలను గుర్తించడం ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కల్లోలాన్ని రేపుతోంది. ఇంకా వ్యాక్సిన్ (Coronavirus Vaccine) అందుబాటులోకి రాకపోవడంతో ఇది ప్రజలను మరింతగా భయానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ రెండు రోజులకొకసారి కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. అయితే టెస్టులు చేయించుకున్న తరువాత రిపోర్ట్ రావడానికి చాలా సమయం తీసుకుంటుండంతో కొంచెం ఆందోళనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పది నిమిషాల్లోనే గుర్తించే ఓ వినూత్న పరికరాన్ని (Corona Rapid Test Update) అభివృద్ధి చేయడంలో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (California Institute of Technology) విజయం సాధించింది.

Donald Trump: ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాకి కరోనా, మాస్క్ ధరించకపోవడం వల్లే కరోనా వచ్చిందని తెలిపిన ట్రంప్‌ ప్రత్యర్థి జో బైడెన్‌

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్‌ ఆరంభిస్తున్నామని ట్రంప్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్‌నకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్‌ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ (Donald Trump), మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్‌హౌస్‌లోనే వారి క్వారంటైన్‌ జరుగుతుందని చెప్పారు.

India's COVID19 Update: భారత్‌లో 63 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, లక్షకు చేరువైన కరోనా మరణాలు, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,821 పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినిచ్చింది. అయితే, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు....

Advertisement
Advertisement