ప్రపంచం
Trump Thanks PM Modi: 'మీ బలమైన నాయకత్వం, మానవత్వానికి సహాపడుతుంది'. ప్రధాని నరేంద్ర మోదీపై యూఎస్ ప్రెసిడెంట్ ప్రశంసలు, హైడ్రోక్లోరోక్విన్ ఎగుమతిపై ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
Vikas Manda"అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత పరస్పర సహకారం అవసరం. హెచ్‌సిక్యూపై నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌కు, భారతీయ ప్రజలకు ధన్యవాదాలు. మీ సహకారాన్ని మర్చిపోలేము! ఈ పోరాటంలో భారతదేశానికి మాత్రమే కాకుండా, మానవత్వానికి సహాయం చేయడంలో ప్రదర్శించిన బలమైన నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు..........
'Boycott TikTok': చైనాపై నెటిజన్ల ఫైర్, ప్రపంచదేశాల వినాశనానికి చైనానే కారణమంటూ ఆగ్రహం, #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేక ప్రచారం
Hazarath Reddyవినాశనానికి చైనానే కారణమని, ప్రారంభ దశలోనే వైరస్‌ను చైనా (China) కట్టడి చేయలేకపోయిందని ప్రపంచ దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #MakeChinaPay, #ChinaLiedPeopleDied అనే హ్యష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇక ఈ ప్రభావం ఇండియాలోనూ అధికంగానే ఉంది. వైరస్‌ వ్యాప్తికి కారణమైందన్న కోపంతో ఇప్పటికే అనేక మంది చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరిస్తున్నారు.
Hydroxychloroquine: హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై వార్, అమెరికాకు ఎగుమతి చేయకుంటే ఫలితాలు వేరేగా ఉంటాయన్న ట్రంప్, ఎగుమతులపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని భారత్
Hazarath Reddyహైడ్రాక్సీ క్లోరోక్విన్ (Hydroxychloroquine) మాత్రలు భారత్ - అమెరికాల (India-America) మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి. భారత్ తీరుపై ట్రంప్ (Trump) కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను భారత్‌ (India)తమకు పంపించనట్లయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని(వాణిజ్య పరంగా) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. భారత్‌తో తమకు సత్పంబంధాలు ఉన్నాయని... అవి అలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు.
UK PM Boris Johnson: మరింత క్షీణించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం, ఐసీయూలో చికిత్స, ఫారెన్ సెక్రెటరీ డొమినిక్ రాబ్‌కు బాధ్యతల అప్పగింత, ప్రశ్నార్థకంగా మారిన పాలన
Vikas Mandaఒకవేళ ప్రధాని ఆరోగ్యం మరింత క్షీణించి ఆయన పాలించలేని పక్షంలో లేదా చనిపోతే ఆయన వారసుడిగా ఎవరుండాలనే దానిపై యూకే కేబినేట్ మినిస్టర్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బోరిస్ జాన్సన్ ఐసీయూలో చేరడంతో 'అవసరం మేరకు' విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌ను అపద్ధర్మ ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా....
Coronavirus: కరోనాపై యుద్ధానికి రూ.7900 కోట్లు రెడీ, ఏడాది పాటు ప్రధాని,రాష్ట్రపతి,ఎంపీల జీతాల్లో 30 శాతం కోత, ఎంపీల్యాడ్స్ స్కీం రెండేళ్ల పాటు రద్దు
Hazarath Reddyదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి (Coronavirus Pandemic) వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్‌ (Union Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ ప్రభుత్వం కోత విధించింది. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత (30 percent salary cut) విధించాలని నిర్ణయించారు.
Coronavirus in Sweden: మీరంతా చావు కోసమే చూస్తున్నారు, సామాజిక దూరం పాటించకపోవడంపై స్వీడన్ ప్రధాని లావ్‌వెన్‌ ఆగ్రహం, 6,830కి చేరిన కోవిడ్ 19 కేసులు
Hazarath Reddyమీరంతా చావు కోసమే ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ స్వీడన్ ప్రధాని లావ్‌వెన్‌ (Swedish PM Stefan Lofven) దేశ ప్రజలపై విరుచుకుపడ్డారు. దీనికి కారణం లేకపోలేదు. స్వీడన్‌లో కరోనా వైరస్‌ (Coronavirus in Sweden) రోజు రోజుకు విస్తరిస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకుండా రెస్టారెంట్లకు, బీచ్‌లకు వెళుతున్నారు.
New COVID-19 Cases in China: చైనాలో మళ్లీ కరోనా కలకలం, కొత్తగా 39 కేసులు నమోదు, ఒకరు మృతి, ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటిన కరోనా కేసులు
Hazarath Reddyచైనాలోని దక్షిణ ప్రాంతంలో తాజాగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు (New COVID-19 Cases in China) నమోదు అయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్‌ అధికారులు ప్రకటించారు. శనివారం నమోదైన 30 కేసుల్లో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని, ఐదుగురు మాత్రం స్థానికులేనని తెలిపారు. దీంతో చైనా మళ్లీ ఒక్కసారిగా కలవరపాటుకు గురయింది.
Diya Jalo India: దీపాల వెలుగుల్లో మెరిసిన ఇండియా, దియా జలావొ గ్రాండ్ సక్సెస్, కరోనాను తరిమికొట్టడానికి ఏకమైన దేశ ప్రజలు, విద్యుత్‌ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపిన కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌
Hazarath Reddyదీప కాంతిలో భారతావని (India light lamp) వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. కరోనా వైరస్‌ పై (Coronavirus) జరుగుతున్న పోరాటంలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా అధ్బుతమైన రెస్సాన్స్ కన్పించింది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్‌ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారుసరిగ్గా 9గంటలకు ( 9 PM 9 Minutes) ఇళ్లలోని విద్యుత్తు దీపాలు ఆపివేసి దీపాలు వెలిగించారు.
Trump Urges PM Modi: అమెరికాలో కరోనా మృత్యుఘోష,మోడీ సాయం కోరిన ట్రంప్, హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ ఎగుమతి చేయాలని ఇండియాను కోరిన అమెరికా
Hazarath Reddyకరోనా కోరల్లో నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌ భారత సహాయాన్ని (Trump urges PM Modi) కోరారు. మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌(hydroxy chloroquine) మెడిసిన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్‌ భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) అభ్యర్థించారు. కోవిడ్-19 బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని మోదీని ట్రంప్ కోరారు.
Tablighi Jamaat Links: 17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్‌ మత ప్రకంపనలు, దేశ వ్యాప్తంగా మర్కజ్‌కు సంబంధించి 1023 కేసులు, 22వేల మంది క్వారెంటైన్‌ కేంద్రాలకు, వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
Hazarath Reddyగత నెలలో ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత ప్రార్థనలు (Tablighi Jamaat congregation) ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus positive cases), మరణాల మూలాలన్నీ మర్కజ్‌ నుంచే ఉన్నట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు. మర్కజ్‌ మత ప్రార్థనలకు(Nizamuddin markaz) వెళ్లిన వారు 17 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు నివేదికను తయారు చేశారు.
COVID-19 in Delhi: కోవిడ్-19లో కీలక మలుపు, పండంటి బాబుకు జన్మనిచ్చిన పాజిటివ్ మహిళ, పుట్టిన బిడ్డకు నో వైరస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఘటన
Hazarath Reddyదేశంలో రోజురోజుకీ కొత్త కరోనా కేసులు (Coronavirus Cases) నమోదు అవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. అయితే ఢిల్లీలో (Delhi) ఓ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ 19 పాజిటివ్ ఉన్న మహిళ ( COVID-19 Positive Woman) పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు కరోనా నెగిటివ్ అని తేలింది.
US Coronavirus Deaths: కరోనా కోరల్లో అమెరికా, రికార్డు స్థాయి మరణాలు, 2.70 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు, మృతదేహాలను భద్రపరిచేందుకు లక్ష సంచులు కావాలని ఫెమా ఆర్డర్
Hazarath Reddyకరోనా కోరల్లో చిక్కి అగ్రరాజ్యం అమెరికా (United States Coronavirus) అతలాకుతలమవుతున్నది. కాగా కరోనా మరణాల ( Coronavirus) విషయంలో ఇతర దేశాలు అందుకోలేనంత ఎత్తులోకి అమెరికా (America) చేరుకుంది . గురువారం-శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు (Coronavirus Deaths) సంభవించాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది.
COVID-19 in Pakistan: పాకిస్తాన్‌లో వివక్ష కుట్ర, సింధ్‌లో హిందువుల ఆకలి కేకలు, 5 లక్షలకు పైగా హిందువులకు రేషన్ నిరాకరించిన అధికారులు
Hazarath Reddyకరాచీలో హిందువుల పట్ల వివక్ష చూపిస్తున్నారు ముస్లింలు. ఇటీవల, రేషన్ మరియు ఇతర నిత్యావసర వస్తువులను అక్కడ ప్రజలకు పంపిణీ చేశారు, కాని హిందువులను ఖాళీ చేతులతో ఇంటికి పంపించారు. సరుకులు ముస్లిం సమాజంలోని ప్రజలకు మాత్రమే ఇస్తున్నారని (Hindus Denied Ration In PAK)అక్కడి హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Nizamuddin Markaz Row: మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా, మార్చి 23న భవనం ఖాళీ చేయాలంటూ ఢిల్లీ పోలీసుల ఆదేశాలు, సంచలన వీడియో వెలుగులోకి
Hazarath Reddyయావత్ దేశాన్నిఇప్పుడు తీవ్ర ఆందోళనలోకి నెట్టి వేసిన అంశం ఏదైనా ఉందంటే అది ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో జరిగిన కార్యక్రమం (Nizamuddin Markaz Row) అనే చెప్పవచ్చు. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ (Coronavirus) లక్షణాలు కన్పించడం ఆ వైరస్ అక్కడికి వెళ్లిన వారికి రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు (Delhi Police) మార్చి 23న భవనాన్ని ఖాళీ చేయమన్నట్లుగా వీడియో బయటకొచ్చింది.
'Very, very painful' : వైరస్ ధాటికి అగ్రరాజ్యం అతలాకుతలం, 'చాలా.. చాలా బాధకరం' అంటూ విచారం వ్యక్తం చేసిన ట్రంప్, రెండు వారాల్లో పెరిగే మరణాలపై తీవ్ర ఆందోళన
Vikas Mandaఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ కూడా రానున్న రోజుల్లో ప్రపంచం కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని హెచ్చరించారు. కోవిడ్-19పై పోరును ప్రపంచ దేశాలన్నీ మరింత ఉధృతం చేయాలని, రాజకీయాలను పక్కనబెట్టి ఐక్యంగా......
Coronavirus Global Report: ప్రపంచాన కరోనా మృత్యుఘోష, ఇటలీలో 50 మంది డాక్టర్లు బలి, 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, 37 వేలకు చేరిన మృతులు, కోలుకుంటున్న ఇటలీ
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,820 మంది కరోనా (Coronaviru) మహమ్మారికి బలైయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 8 లక్షలకు దగ్గర్లో ఉంది. వైరస్‌ నిర్థారణ అయినవారిలో మంగళవారం ఉదయం నాటికి 1,65,659 మంది కోలుకున్నారు.
Donated To Fight Coronavirus: కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్, సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా.., పీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు, ఇప్పటివరకు అందిన మొత్తం లిస్టు ఇదే
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Coronavirus) మెల్లిగా విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించేందుకు కార్పోరేట్ (Corporates) ప్రపంచం ముందుకు వచ్చింది. సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా అందరూ దాన్ని అంతు చూసేందుకు రెడీ అయ్యారు. ఇండియాలో సోమవారం సాయంత్రానికి 1071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే 34 మంది మరణించారు. భారతదేశం కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడుతూనే ఉండటంతో, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు (Business Mans) మరియు రాజకీయ నాయకులతో (Political Leaders)సహా అన్ని వర్గాల ప్రజలు దాని నియంత్రణకు భారీగా విరాళాలు (Donated To Fight Coronavirus) అందిస్తున్నారు. భారతదేశంలో కరోనావైరస్‌పై పోరాటానికి ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జాబితాను ఓ సారి చూద్దాం.
COVID-19: నిర్లక్ష్యానికి భారీ మూల్యం, ఒకే కుటుంబంలో 25 మందికి కరోనావైరస్, దేశ వ్యాప్తంగా 1071 పాజిటివ్ కేసులు, 34కు చేరుకున్న కోవిడ్ 19 మరణాలు
Hazarath Reddyఓ కుటుంబంలోని న‌లుగురు వ్య‌క్తులు సౌదీ అరేబియాకు వెళ్లొచ్చినా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించడంతో విదేశాల‌కు వెళ్లొచ్చిన వారితో క‌లిపి మొత్తం 25 మంది ఇప్పుడు కరోనావైరస్ వ్యాధి భారీన పడ్డారు. కాగా వారంతా ఇరుకుగా ఉండే ఒకే ఇంట్లో ఉండ‌టంతో అందరికీ క‌రోనా మ‌హ‌మ్మారి సోకిందని అధికారులు తెలిపారు.
Wuhan Deaths Mystery: వుహాన్‌ కరోనా చావుల మిస్టరీ, కరోనా వల్ల వుహాన్‌లో 42 వేల మందికి పైగా మృతి, 3200 మంది చనిపోయారంటూ చైనా అధికారిక ప్రకటన, RFA కథనంలో నిజమెంత ?
Hazarath Reddyచైనాలో 2019లో పుట్టిన కరోనావైరస్ (Coronavirus outbreak in China) ఆ దేశాన్ని 4 నెలల పాటు వణికించిన సంగతి విదితమే. కాగా ఈ వైరస్ దెబ్బకు చైనాలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అయితే వైరస్ తీవ్రత ఆ స్థాయిలో ఉన్నప్పటికీ చైనాలో కోవిడ్ 19 కారణంగా వుహాన్ లో (Wuhan) కేవలం 3200మంది మాత్రమే చనిపోయారని ఆ దేశం అధికారికంగా వెల్లడించింది. అయితే ఇది అంతా అవాస్తవమని ((Wuhan Deaths Mystery) RFA సంచలన కథనాన్ని వెలువరించింది.
COVID-19 Death Toll In India: ఇండియాలో 29కు చేరిన మృతులు, 24 గంటల్లో 106 కొత్త కేసులు, పాజిటివ్‌ కేసులు సంఖ్య 979, కోవిడ్‌-19పై హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
Hazarath Reddyఇండియాలో చాపకింద నీరులా కరోనా (Coronavirus) విస్తరిస్తోంది. రోజు రొజుకు దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో (India) 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్‌-19 కారణంగాంఖ ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 29కు (COVID-19 Death Toll In India) చేరింది. తాజాగా కోవిడ్‌-19పై (COVID-19) కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది.