World
Lockdown 4.0: లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
Hazarath Reddyకరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి (PM Narendra Modi to address the nation) మాట్లాడారు. లాక్‌డౌన్‌ 4వ దశ (Lockdown 4.0) ఉంటుందని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు 18వ తేదీకి ముందే ప్రకటిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా (Coronavirus Pandemic) సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
India COVID-19: దేశంలో 70 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, గత 24 గంటల్లో 3604 కొత్త కేసులు, దేశ వ్యాప్తంగా 2293 మంది కరోనాతో మృతి
Hazarath Reddyదేశంలో కరోనా తీవ్రత (India COVID-19) రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య (Coronavirus Count in India) 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా, కొత్తగా 87 మంది బాధితులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య (Coronavirus Deaths) 2293కి చేరింది. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 22,455 మంది బాధితులు కోలుకోగా, మరో 46,008 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ సగటున రోజుకు 1073 కేసులు నమోదవగా, మే తొలి 11 రోజుల్లో 3409 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో రికవరీ రేటు31.15 శాతానికి పెరిగింది.
India Coronavirus: ఇండియాను వణికిస్తున్న 4 రాష్ట్రాలు, తమిళనాడులో 8 వేలు దాటిన కరోనా కేసులు, ముంబైలో 1000 మందికి పైగా పోలీసులకు కోవిడ్-19, గుజరాత్,ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలం
Hazarath Reddyప్రస్తుత పరిస్థితి చూస్తే 22,171 కరోనా కేసులతో దేశంలో మహారాష్ట్ర నెం.1స్థానంలో నిలవగా, గుజరాత్‌లో 8,194, తమిళనాడు 7,204 , ఢిల్లీ 6,923 కేసులతో ముందు వరుసలో ఉన్నాయి . అయితే,ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే మరో 7రోజుల్లో దేశంలో కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మే నెలాఖరులోగా కేసుల పెరుగుదల 2 లక్షలకు చేరుతుందని ఒక అంచనా వేస్తున్నారు.
COVID-19 in India: కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు, నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
Hazarath Reddyదేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (COVID-19 in India) విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. దేశంలో కరోనా (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య 67,152కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 4,200 కరోనా కేసులు నమోదవగా, 97 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2206 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడిన 20,916 మంది కోలుకోగా, 44,029 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
UK PM Boris Johnson: బ్రిటన్ ప్రధానికి విడాకులు, మరీనా వీలర్ నుంచి విడాకులు తీసుకున్న బోరిస్ జాన్సన్, సెటిల్మెంట్‌ రూపంలో వీరిద్దరికీ చెరో నాలుగు మిలియన్ పౌండ్లు
Hazarath Reddyబ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (British Prime Minister) తన బార్య, భారత సంతతికి చెందిన న్యాయవాది మరీనా వీలర్ నుంచి విడాకులు తీసుకున్నారు. పదవిలో ఉండగానే ఓ ప్రధాని విడాకులు పొందడం గత 250 ఏళ్లలో ఇదే తొలిసారి కావడంతో బోరిస్ (UK PM Johnson) చరిత్రకెక్కారు. ఫిబ్రవరిలోనే మరీనా వీలర్ (Marina Wheeler) విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇటీవల వారికి విడాకులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి.. సెటిల్మెంట్‌ రూపంలో వీరిద్దరికీ చెరో నాలుగు మిలియన్ పౌండ్లు లభించనున్నట్టు తెలుస్తోంది.
India Coronavirus: ముంబై సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం, 77మంది ఖైదీలకు,26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, దేశ వ్యాప్తంగా 56 వేలు దాటిన కరోనా కేసులు
Hazarath Reddyహారాష్ట్రలో (Maharashtra) 18వేలకు చేరువలో కేసులు ఉండగా కేవలం ముంబైలోనే ఈ సంఖ్య 11,300 దాటిపోయింది. అక్కడ ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబైలోని ఆర్డర్ రోడ్ సెంట్రల్ జైలును (Arthur Road Jail) కూడా కరోనా తాకింది. ఈ సెంట్రల్ జైలులో 2800 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్కో బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి (Mumbai police personnel) కూడా కరోనా పాజిటివ్ రావ‌డంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
Vande Bharat Mission: వందే భారత్‌ మిషన్ ప్రారంభం, 177 మందితో దేశానికి చేరుకున్న తొలి విమానం, మొత్తం 12 దేశాలకు భారత విమానాలు, రెండు దశల్లో స్వదేశానికి తరలింపు
Hazarath Reddyలాక్‌డౌన్‌ ( coronavirus Lockdown) కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌ మిషన్' (Vande Bharat Mission) పేరిట కేంద్రం అతిపెద్ద మిషన్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో, మూడు యుద్ధ నౌకల్లో 14,800 మందిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. మొత్తం 12 దేశాల నుంచి వారిని తరలించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కాగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తమను ఇండియాకు (India) తీసుకుపోవాలని 3 లక్షల మంది భారతీయ వలస కార్మికులు (Indian Nationals Abroad) ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు.
China Coronavirus: చైనాలో కరోనా పోలేదు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి, కీలక వ్యాఖ్యలు చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌
Hazarath Reddyకరోనా వైరస్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా (China Coronavirus) అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (China’s President Xi Jinping) దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా‌వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తూనే ఉందని.. కాబట్టి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.
Global Coronavirus: 2 లక్షల అరవై వేలకు చేరువలో మృతులు, ప్రపంచవ్యాప్తంగా ముఫ్పై ఏడు లక్షలకు పైగా కరోనా కేసులు, యుకెలో 12 లక్షల దాటిన కరోనా కేసులు
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Global Coronavirus) భారీన పడి మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 2,58,974 కు చేరుకున్నాయి. కరోనావైరస్ భారీన పడిన వారి సంఖ్య (Coronavirus Global Roundup) బుధవారం నాటికి 3,667,165 గా ఉంది. రికవరి అయిన వారి సంఖ్య 1,251,032గా ఉంది. యాక్టివ్ గా ఉన్న కేసులు సంఖ్య బుధవారం సాయంత్రానికి 2,237,498గా ఉంది. ఇదిలా ఉంటే ఇటలీకు (Italy) చెందిన వైద్య సంస్థ మానవ కణాలలో కరోనావైరస్ నవలని తటస్తం చేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
'Aggressive Chicken': ఏటీఎం వద్ద మనుషులపై కోడి దాడి, దర్యాప్తు చర్యలు చేపట్టిన వాల్కర్‌ పోలీసులు, అమెరికాలోని లూసియానాలో ఘటన
Hazarath Reddyఅమెరికాలోని ఓ ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై కోడి (Aggressive Chicken) దాడి చేసింది. ఏటీఎం సెంటర్ కు వెళ్లాలనుకునే వారిపై ఈ కోడి దాడి (terrorizing bank customers) చేస్తుండటంతో స్థానికులు భయపడిపోయి వాల్కర్‌ పోలీసులకు‌ (Walker Police) ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్‌ పోలీసులు శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోం‍ది.
COVID-19 Vaccine: కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ ఇదేనా?, శుభవార్త చెప్పిన ఇటలీ, ఎలుకలపై కరోనా వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతమయిందని ప్రకటన, వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 (COVID-19) మరణ మృదంగం మోగుతున్న వేళ ఇటలీ ప్రభుత్వం (Italy Govt) శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను (COVID-19 Vaccine) అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌కు తాము వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచం మొత్తం అటువైపు దృష్టి సారించింది. ఇటలీ ఈ ప్రకటన చేయగానే కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేకెత్తాయి. టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
Coronavirus In India: ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, 50 వేలకు చేరువలో కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 1,694 మంది మృతి, 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyదేశంలో కరోనా(COVID-19 In India) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతం అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 8, నేటి గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ 2016, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ కాలక్షేపం చేయండి. హాలోవీన్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ (Halloween 2016), 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి. ఇప్పటిదాకా 8 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, స్కోవిల్ లొటరియా, తాజాగా హాలోవీన్ . ఈ రోజు వచ్చిన హాలోవీన్ (Halloween) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
COVID19 Vaccine: కోవిడ్-19కు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల హెచ్చరిక, వైరస్‌తోనే ఎలా జీవించాలో సమాజం నేర్చుకోవాలని సూచన
Team Latestlyప్రతిచోటా, ప్రతీ సమాజం కరోనావైరస్ ముప్పు నుండి నిరంతరం తమను తామే రక్షించుకోగలిగే పరిస్థితులకు అలవాటుపడాలి. వైరస్ తో సహజీవనం చేస్తూనే సామాజిక జీవనం గడపాలి, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ చేసుకోవాలి.....
Indian Nationals Stranded Abroad: విదేశాల్లో భారతీయులు విలవిల, మే 7 నుంచి దశల వారీగా విమానాలు,నౌకల ద్వారా స్వదేశానికి తరలింపు, 14 రోజులపాటు పేమెంట్‌ ప్రాతిపదికన క్వారంటైన్‌లోకి..
Hazarath Reddyకోవిడ్‌-19 లాక్‌డౌన్‌లతో (Covid-19 Lockdown) విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను (Indian Nationals Stranded Abroad) మే 7 నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఏర్పాట్లు చేస్తోంది. వీరందరినీ దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి రప్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం నిర్థిష్ట విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు దేశానికి తిరిగివచ్చే భారత పౌరుల జాబితాలను సిద్ధం చేస్తాయి. అయితే స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.
COVID-19: విదేశాల్లోని భారతీయుల కోసం బయలు దేరిన మూడు యుద్ధ నౌకలు, యుఎఈ, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలింపు, వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19 pandemic) విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరంతా స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఇండియాకు (India) తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ముందుగా మాల్దీవులు (Maldives), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో (UAE) చిక్కుకున్న భారతపౌరులను స్వదేశానికి తరలించడానికి భారత నావికాదళం మూడు నౌకలను (Three Ships Sent to Evacuate Indians) పంపించినట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.
COVID-19 Pandemic: 24 గంటల్లో 195 మంది మృతి, దేశంలో 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, దడపుట్టిస్తున్న మహారాష్ట్ర, ముంబైలో మే 17 వరకు 144 సెక్షన్
Hazarath Reddyఇండియాలో కరోనా మహమ్మారి (2020 Coronavirus Pandemic in India) తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,900 కేసులు నమోదయ్యాయి. అలాగే 195 మరణాలు సంభవించాయి. భారతదేశంలో మొత్తం కొరోనావైరస్ కేసుల సంఖ్య 46,433 కు చేరుకుందని, ఇప్పటివరకు 1,568 మంది (Coronavirus deaths in india) మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భారీన పడిన వారి సంఖ్య 3,645,342గా ఉంది.
African Swine Flu: కరోనాకు తోడయిన మరో వైరస్, ‘ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ’ ధాటికి 2500 పందులు మృతి, మ‌నుషుల‌కు పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ంటున్న ఎన్ఐహెచ్ఎస్ఎడి
Hazarath Reddyదేశంలో కరోనా వైర‌స్ (Coronavirus) కల్లోలం మరచిపోకముందే మరో వైరస్ దేశంలోకి ఎంటరయింది. అస్సాంలో (Assam) తాజాగా మ‌రో వైర‌స్ వెలుగుచూసింది. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూగా (African Swine Flu) పిలి‌చే ఈ వైర‌స్ తొలిసారిగా అస్సాంలో బ‌య‌ట‌ప‌డిందని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ( NIHSAD) ఈ వైర‌స్‌ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఎఎస్ఎఫ్) అని ధృవీకరించిన‌ట్లు తెలిపింది. అయితే ఈ వైరస్ వల్ల మ‌నుషుల‌కు పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ని, దీనికి కోవిడ్‌తో ఎటువంటి సంబంధం లేద‌ని పేర్కొంది.
Coronavirus in India: దేశ వ్యాప్తంగా 11 వేల మందికి పైగా డిశ్చార్జ్, 42 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, 1300 దాటిన మరణాలు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0
Hazarath Reddyదేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in India) ఉద్ధృతి కొనసాగుతున్నది. కేసుల సంఖ్య 42 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరింది. మరోవైపు దేశంలో ఒక్కరోజే 83 మంది (Coronavirus Deaths) వైరస్‌ కారణంగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,373కుకు చేరినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 11,706 మంది (coronavirus cases) కొవిడ్‌-19 బారి నుంచి కోలుకున్నారని, 29,453 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉన్నదని వెల్లడించింది.
Cops Test Corona Positive: పోలీస్ శాఖలో కరోనా కల్లోలం, ముంబై పోలీసుల్లో 100 మందికి పైగా కోవిడ్-19 పాజిటివ్, దేశ వ్యాప్తంగా 35 వేలు దాటిన కరోనావైరస్ కేసులు
Hazarath Reddyముంబై పోలీసు శాఖ‌లో (Mumbai Police) క‌రోనావైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే 100కి పైగా పోలీసులు కోవిడ్-19 వైర‌స్ భారిన ప‌డ్డారు. తాజాగా వ‌డాలా పోలీసు స్టేష‌న్ (Wadala police statio) ప‌రిధిలోని 9 మంది కానిస్టేబుల్స్‌కు కోవిడ్ (Cops Test Corona Positive) సోకిందని అధికార వర్గాలు వెల్లడించాయి. గురువారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ (Coronavirus) అని తేలడంతో వీరంతా ముంబైలోని గురునాన‌క్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.వీరితో పాటు కుటుంస‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌లో ఉంచామ‌ని అధికారులు తెలిపారు.