World

Bill Gates: మైక్రోసాఫ్ట్‌‌కు బిల్ గేట్స్ రాజీనామా, పూర్తిగా సామాజిక సేవ వైపు బిలియనీర్, 2014లో ఛైర్మెన్ పదవికి రాజీనామా, మిళిందా ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్

Hazarath Reddy

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ (Bill Gates) మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఇకపై మైక్రోసాఫ్ట్ (Microsoft) సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇకపై బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు.

Coronavirus Scare In Bengaluru: ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్, బెంగుళూరులో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ఖాళీ, ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేలడంతో అందర్నీ బయటకు పంపిన టెక్ గెయింట్

Hazarath Reddy

కరోనా (Coronavirus)దెబ్బకు దేశం కుదేలవుతోంది. ఎక్క చూసినా జనం భయం భయంగా బతుకుతున్నారు. ఇక కంపెనీలో పనిచేసే వారయితే కరోనా కేసు తగలగానే ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. తాజాగా టెక్ గెయింట్ ఇన్ఫోసిస్ కూడా దీని భారీన చిక్కుకుంది. బెంగుళూరులో (Bengaluru) ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు (Infosys) చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు.

Excise Duty Hike: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంపు, పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చే అవకాశం

Hazarath Reddy

కోవిడ్‌-19 అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న వేళ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున సుంకాన్ని పెంచినట్లు పేర్కొంది. అదే విధంగా పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకాన్ని రూ. 2 నుంచి 8 రూపాయలకు, డీజిల్‌పై రూ.4కు పెంచుతున్నట్లు ప్రకటనలో తెలిపింది.

Indian Markets: మార్కెట్లను కుదిపేస్తున్న కరోనావైరస్ భయం, భారీగా పతనమవుతున్న మార్కెట్లు, 45 నిమిషాల పాటు నిలిచిపోయిన ట్రేడింగ్, ఆ తర్వాత పున:ప్రారంభం

Vikas Manda

నష్టాలు విపరీతంగా కొనసాగుతుండటంతో ట్రేడింగ్ ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం ఉదయం 10:20 తర్వాత ట్రేడింగ్ పున: ప్రారంభమైంది. ఇప్పుడు మార్కెట్లు ఎలా పని చేస్తాయనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.....

Advertisement

Stock Market Crash: 12 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనావైరస్ భయాందోళనలతో మార్కెట్లు పతనం, 2,919 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 10 వేల దిగువనకు నిఫ్టీ

Vikas Manda

గురువారం మార్కెట్లు 52 వారాల కనిష్ఠ స్థితిని చూశాయి. బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు కుప్పకూలాయి. కనీసం 10 శాతం పతనం చూశాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, మహింద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.....

COVID-19 Outbreak: స్వీయ నిర్బంధం విధించుకున్న భారత్, ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలు రద్దు, కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం చర్యలు

Vikas Manda

మార్చి 13, 2020 ఉదయం 12 AM నుండి అమల్లోకి వస్తుంది, ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇంకా ఎలాంటి మార్గాల ద్వారా అయిన భారత్ నుంచి విదేశాలకు రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి.....

COVID 19 in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు, వందల సంఖ్యలో ఆంధ్రా మరియు తెలంగాణ విద్యార్థులు ఇటలీలో నిర్బంధం

Vikas Manda

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు (COVID 19 Positive Case in AP) నమోదైంది. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకి (Nellore) చెందిన యువకుడికి కరోనావైరస్ సోకినట్లు రిపోర్టుల్లో తేలింది.....

Coronavirus Threat: కరోనా చికిత్సకు ఎయిడ్స్ మందులు, జైపూర్ ఆసుప్రతిలో ఇటలీ పేషంట్లకు ట్రీట్‌మెంట్, అనుమతించిన ఆరోగ్య శాఖ, కరోనా బాధితులు

Hazarath Reddy

కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దీనికి ఇప్పటిదాకా ఎటువంటి విరుగుడు కనిపెట్టలేదు. దీని నివారణకు మార్కెట్లో ఎటువంటి మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్స కోసం హెచ్‌ఐవి పేషంట్లు వాడే మందులును (Anti-HIV Drugs) ఉపయోగిస్తున్నారు.

Advertisement

MP Political Turmoil: సింధియా దెబ్బకు కాంగ్రెస్ విలవిల, కూలుతున్న కమల్ నాథ్ సర్కార్, రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా, పార్టీల బలబలాలు ఇవే

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు (MP Political Turmoil) శరవేగంగా మారిపోతున్నాయి. కమల్ నాథ్ సర్కార్ ను (CM Kamal Nath) కూల్చడమే లక్ష్యంగా అక్కడి రాజకీయాలు ఊపందుకున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.

Coronavirus Effect: ఖైదీలకు బెయిల్ ఇచ్చిన కరోనావైరస్, కరోనా భయంతో 70,000 వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్ దేశం, వారితో సమాజానికి ఎలాంటి అభద్రత ఉండదని సమర్థత

Vikas Manda

ఎక్కువ మంది ఒకేచోట కలిసున్న చోట కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు చెప్పిన నేపథ్యంలో జనం ఒకే చోట ఉండకుండా ఇరాన్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న 70 వేల మంది ఖైదీలకు తాత్కాలిక స్వేచ్ఛ కలిపించింది.....

Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో వరుస బాంబు పేళుళ్లు, తల తెగినా ఇక్కడి నుంచే కదిలే ప్రసక్తి లేదన్న అష్రఫ్ ఘనీ, అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వేళ విరుచుకుపడిన తాలిబన్లు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) బాంబులతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబుల్‌లో (Kabul) అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Mohammad Ashraf Ghani) ప్రమాణ స్వీకార సమయంలో తాలిబన్లు బాంబు దాడులకు పాల్పడ్డారు. అనంతరం తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు.. తాలిబన్లపైకి ఎదురుకాల్పులు చేపట్టారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దాడితో ప్రమాణస్వీకారానికి వచ్చిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు.

Coronavirus Terrifies: తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు, దగ్గు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని కోరిన టీటీడీ అధికారులు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని స్విమ్స్‌కు తరలించాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశంలో రోజు రోజుకు పంజా విప్పుతున్న కరోనా వైరస్ (Coronavirus Terrifies) ధాటికి రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై (Lord Venkateswara Swamy temple) ఆంక్షలు విధించారు.కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమలలోని శ్రీవారి దర్శనానికి (Tirumala Temple) రావద్దని టీటీడీ (TTD Management) సలహా ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Peculiar Wedding: 103 ఏళ్ళ తాత 27 ఏళ్ళ యువతిని గర్భవతిని చేశాడు, ఆపై ప్రేమ వివాహం చేసుకున్నాడు, ఇండోనేషియాలో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

ఈ న్యూస్ వినడానికి చాలా చిత్రంగా ఇది నిజం, ప్రేమకు వయస్సుతో సంబంధంలేదని మరోసారి ఈ జంట రుజువు చేశారు. ఇండేనేషియాకు (indonesia) చెందిన 107 ఏళ్ల వ్యక్తి (103-Year-Old Elderly Man), అదే దేశానికి చెందిన 27 ఏల్ల యువతిని పెళ్లాడాడు. కాగా పెళ్లికి ముందే వీరు ప్రేమలో పడ్డారు. ఆ సమయంలనే శారీరకంగా ఒకటయ్యారు. ఆ తర్వాత గర్భవతి అని తెలియగానే వెంటనే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 76 ఏళ్లు. పెళ్లికి వచ్చిన వారంతా వీరిద్దరి జంటని చూసి ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో (Social Media) వీరి పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.

Coronavirus In India: కరోనా ఉగ్రరూపం, ఇండియాలో 40కి చేరిన కరోనా కేసులు, తాజాగా కేరళలో 5మందికి, తమిళనాడులో ఒకరికి పాజిటివ్, కరోనాపై వదంతులను నమ్మొద్దని ప్రధాని పిలుపు

Hazarath Reddy

కరోనావైరస్‌(COVID 19) కేసుల సంఖ్య భారత్‌లో రోజు రోజుకీ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నా, వాటిలో పాజిటివ్ కేసులు వేళ్లమీద లెక్కబెట్టే విధంగానే ఉన్నాయి. ఇప్పటికే దీని భారీన దేశ వ్యాప్తంగా (Coronavirus in India) 34 మంది పడగా తాజాగా మరో ఆరు మందికి కరోనా పాజిటివ్ (Coronavirus) వచ్చింది. దీంతో ఈ కేసుల సంఖ్య ఇండియాలో 40కి చేరింది.

Bird Flu In Kerala: కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్, 13 వేల కోళ్ల కాల్చివేతకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు, కరోనా మరచిపోకముందే వణికిస్తున్న మరో వ్యాధి, ఈ వ్యాధికి 2016లో వేలాది బాతులు మృత్యువాత

Hazarath Reddy

కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం (Bird Flu Scare Hits Kerala) రేగింది. కోజికోడ్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో కోళ్లకు (Chickens) బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు.ఈ వైరస్ 12 వేల 900 కోళ్లకు బర్డ్ ఫ్లూ (Bird Flu In Kerala) సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ కోళ్లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోజికోడ్ జిల్లాల్లో రెండు గ్రామాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు.

India-EU Summit: కరోనా దెబ్బ, ప్రధాని మోదీ బ్రస్సెల్ పర్యటన రద్దు, సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీ వెల్లడిస్తామని తెలిపిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌

Hazarath Reddy

ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ (Coronavirus Outbreak) ఇప్పటికే విస్తరించింది. పలు దేశాలకు ఈ వైరస్ విస్తరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధికారిక విదేశీ పర్యటన రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో (India-European Union Summit) భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్‌ పర్యటన (Brussels Visit) రద్దయింది. సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు.

Advertisement

Holi Milan: హోళీ వేడుకలు లేవు, హోళీ మిలన్‌కు దూరంగా అగ్రనేతలు, ఈ ఏడాది వేడుకలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్, ఇండియాలో 28కి చేరిన కరోనా మరణాలు

Hazarath Reddy

హోళీ మిలన్ వేడుకలు (Holi Milan 2020) భారతీయులకు చాలా కీలకం. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus Spread) చెందేందుకు అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది హోళీ వేడుకలకు (Holi Milan) ప్రముఖులు ఒక్కొక్కరే దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah) 'హోళీ మిలన్'లో తాను పాల్గొనడం లేదని బుధవారంనాడు ప్రకటించారు.

COVID-19 In India: ఇండియాపై కరోనా దాడి, 15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్‌-19 వైరస్, షాక్‌కు గురయిన ఎయిమ్స్ వైద్యులు, ఆఘమేఘాల మీద ఐటీబీపీ కేంద్రానికి తరలింపు

Hazarath Reddy

చైనాలోని (China) వుహాన్‌లో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 (Coronavirus) తాజాగా భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప‍్పటికే ఢిల్లీ, తెలంగాణలో వైరస్‌లను గుర్తించగా ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఇటలీ దేశం నుంచి భారతదేశ సందర్శనకు వచ్చిన 15 మంది పర్యాటకులకు కరోనా వైరస్ పాజిటివ్ (Coronavirus Outbreak) అని పరీక్షల్లో తేలడం సంచలనం రేపింది. 15 మంది ఇటాలియన్ టూరిస్టులకు (15 Italian Tourists) కరోనా వైరస్ సోకిందని బుధవారం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు ప్రకటించారు.

#SheInspiresUs: 'నా సోషల్ మీడియా మొత్తం స్పూర్థినిచ్చే మహిళలకు అంకితం, అది మీరూ కావొచ్చు'. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న ప్రధాని మోదీ ఆలోచనలో మరో కోణం

Vikas Manda

మోదీ ఆలోచన ప్రకారం, మార్చి 08, 2020 మహిళా దినోత్సవం రోజున, నేరుగా ప్రధానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే #SheInspiresUs అనే హ్యాష్‌ట్యాగ్‌ను శక్తివంతమైన మహిళల కథలను పంచుకోవచ్చు.....

COVID-19 Outbreak: ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్-19, 3 వేలు దాటిన కరోనావైరస్ మృతుల సంఖ్య, సుమారు 90 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య

Vikas Manda

60 ఏళ్లు పైబడి, రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వారిపైనే కోవిడ్ 19 ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన బాధితుల్లో చాలా మందికి తేలికపాటి వ్యాధి లక్షణాలను మాత్రమే అనుభవిస్తారు, అయితే అందులో 14 శాతం మంది మాత్రమే న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారని...

Advertisement
Advertisement