ప్రపంచం
Beer Is Better For You Than Milk: గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న, ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే బెటర్ అంటున్న పెటా, బీరు తాగడం వల్ల ఎముకలు గట్టిపడతాయట, డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయట
Hazarath Reddyఇప్పటివరకు మద్యం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని విన్నాం. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ పెటా (People for the Ethical Treatment of Animals) మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది. రోజు పెగ్గు బీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతోంది. గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న(Beer Is Better For You Than Milk) అనే నినాదాన్ని లేవదీస్తోంది.
Maha Aghadi Sarkar: ‘మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ, మహాత్మా జ్యోతిరావ్ పూలే రుణాల రద్దు పథకం కింద అమల్లోకి, ప్రభుత్వంపై రూ.40వేల కోట్ల భారం, సీఎం ఉద్ధవ్‌పై మండిపడిన బీజేపీ
Hazarath Reddyధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra GOVT)సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర రైతులకు (Farmers)తీపికబురును అందిస్తూ ఉద్ధవ్ సర్కారు రైతు రుణమాఫీ(Farmer Loan Waiver) అమలు చేసింది.
DK Shivakumar: క్రికెట్ బ్యాటు పట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత, పాత్రికేయులతో కలిసి క్రికెట్ ఆడిన డికె శివకుమార్, యడ్డూరప్ప ప్రభుత్వంపై విమర్శలు, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ముఖ్యమంత్రి, హోం మంత్రే బాధ్యులన్న డీకే
Hazarath Reddyఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ ఆటవిడుపు కోసం సరదాగా ఏవైనా ఆటలు ఆడుతుంటారు. కొద్ది పాటి సమయం దొరికితే తమ ముచ్చటను ఆ విధంగా తీర్చుకుంటుంటారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ డికే శివకుమార్ (Senior Congress leader DK Shivakumar) కూడా క్రికెట్ బ్యాటు పట్టారు.
Jaipur Bomb Blast 2008: ఆ నలుగురికి ఉరిశిక్ష, 80 మంది ప్రాణాలను తీసిన ఉగ్రవాదులకు మరణశిక్ష విధించిన రాజస్థాన్ కోర్టు, మరో ముగ్గురు నిందితులు తీహార్ జైలులో.., ఒకరు నిర్దోషిగా బయటకు..
Hazarath Reddy2008 లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లకు(Jaipur Bomb Blast 2008) పాల్పడినట్లు తేలిన నలుగురికి రాజస్థాన్ కోర్టు ( Jaipur special court) మరణశిక్ష విధించింది. ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించారు. 2008 మే నెలలో జైపూర్‌ పాత నగరంలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి.
Jharkhand Exit Polls 2019: బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమిదే అధికారం, డిసెంబర్ 23న ఫలితాలు, హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్న ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే
Hazarath Reddyజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు (Jharkhand Assembly Elections 2019) ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది.(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Sonia Gandhi: ప్రజల హక్కులను ప్రభుత్వం పూర్తిగా తొక్కి వేస్తోంది, వారి గోడును అసలు పట్టించుకోవడం లేదు, బీజేపీ ప్రభుత్వంపై మండిపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
Hazarath Reddyదేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Congress president Sonia Gandhi) అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియోను (video message) విడుదల చేశారు.
Earthquake In Delhi: దేశ రాజధానిలో భూకంపం, వణికిన ఉత్తర భారతం, ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు, ఆఫ్గనిస్తాన్‌లోని హిందూ కుష్ రీజియన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన భూకంపం
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలు(earthquake) స్థానికులను వణికించాయి. ఢిల్లీ నుంచి కశ్మీర్‌ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం, (northern India)పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ సరిహద్దులో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Hazarath Reddyప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
AAP's New Slogan: అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్, మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును, కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్
Hazarath Reddyవచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో సార్వత్రిక సమరం (Delhi Assembly poll) మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను వెతికే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ (Arvind Kejriwal) మళ్లీ ఢిల్లీలో ఆప్ జెండాను పాతాలని చూస్తోంది.
Keonjhar Rape And Murder Case: 3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు, నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు
Hazarath Reddyదేశంలో మానవ మృగాలు వీర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల దగ్గర నుంచి పండు మసలి వరకు ఎవర్నీ వదలడం లేదు. మద్యం మత్తులో వారేం చేస్తున్నారో అర్థం కాకుండా ఉన్మాద ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి కోర్టు ఉరిశిక్ష విధించినా, పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసినా మార్పు రావడం లేదు. మొన్న దిశ ఘటనలో(Disha rape and murde case) పోలీసుల మీద ఎదురుదాడికి దిగిన నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter)చేశారు.
Donald Trump Impeached: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం, ఆమోదం తెలిపిన ప్రతినిధుల సభ, సెనేట్‌లో దర్యాప్తు, సిగ్గుచేటు రాజకీయాలని వైట్ హౌజ్ వ్యాఖ్య
Vikas Mandaఅమెరికా చరిత్రలో అత్యంత సిగ్గుపడే రాజకీయ ఎపిసోడ్లలో ఇది ఒకటి. తప్పు చేసినట్లు ఎలాంటి రుజువు లేకుండా, ఒక్క రిపబ్లికన్ ఓటు తీసుకోకుండా, డెమొక్రాట్లు ఆమోదించిన అభిశంసన చట్ట విరుద్ధమైంది" అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.....
PM's Open Challenge To Congress: దమ్ముంటే పాకిస్తానీలకు పౌరసత్వం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రజలే మీకు సమాధానం చెబుతారు, కాంగ్రెస్ చేతుల్లో పావులుగా మారొద్దని విద్యార్థులకు హితవు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం(Central GOVT) తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టంపై (Citizenship Act) దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Narendra Modi) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.
Sadistic Parents: శాడిస్టు తల్లిదండ్రులంటే వీళ్లే, ఇంటికి లేటుగా వచ్చాడని కఠిన శిక్ష, పిల్లాడి కాళ్లలో మొలకెత్తిన విత్తనాలు, రక్తమే ఆ విత్తనాలకు నీరు, తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyరష్యాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వేసిన శిక్షకు పిల్లాడు అల్లాడిపోయాడు. ఆ తల్లిదండ్రులు వేసిన శిక్ష వల్ల పిల్లాడి కాళ్లలో గింజలు మొలకెత్తాయి. ఆ పిల్లాడి శరీరంలోని రక్తమే నీరుగా ఆ విత్తనాలు(Buckwheat) మొలకెత్తాయి. కథనం వివరాల్లోకెళితే.. రష్యాకు చెందిన సార్జే కాజకోవ్, అలీనా యుమషేవ భార్యాభర్తలు, వీరికి 8 ఏళ్ల పిల్లవాడు(eight-year-old boy) ఉన్నాడు. ఆ ఎనిమిదేళ్ల ఆ పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్‌గా వచ్చాడు.
Musharraf: ముషారఫ్‌కు ఉరిశిక్ష, దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన పెషావర్ హైకోర్టు, నాలుగేళ్ల నుంచి దుబాయ్‌లో తలదాచుకుంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టుకు వెళ్లనున్న పర్వేజ్ ముషారఫ్ తరపు న్యాయవాదులు
Hazarath Reddyపాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు (former president Pervez Musharraf) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌కు(Pervez Musharraf) పాకిస్థాన్ (Pakistan)లోని పెషావర్ హైకోర్టు ( Peshawar High Court) ఉరిశిక్షను విధించింది. దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన హైకోర్టు... మరణదండనే (Death Penalty) ఆయనకు తగిన శిక్ష అని తేల్చింది. నాలుగేళ్ల నుంచి ముషారఫ్ దుబాయ్ లో తలదాచుకుంటున్నారు.
'Nitish Kumar Missing': బీహార్ సీఎం కనిపించుట లేదు, పాట్నాలో కలకలం రేపుతున్న పోస్టర్లు, కాబ్, ఎన్ఆర్‌సీలపై మౌనం వహించిన నితీష్ కుమార్, పోర్న్ సైట్లు వెంటనే బ్యాన్ చేయాలంటూ ప్రధానికి మోడీకి బీహార్ సీఎం లేఖ
Hazarath Reddyబీహార్ సీఎం (Bihar Chief Minister)కనిపించడం లేదంటూ రాజధాని పాట్నాలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై మౌనంగా ఉన్నందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను(Nitish Kumar) ఎగతాళి చేస్తూ సీఎం మిస్సింగ్ (Nitish Kumar Missing)అంటూ పాట్నాలో పోస్టర్లు అంటించారు.
Barack Obama: మహిళలకు అధికారం ఇచ్చి చూడండి, ప్రపంచమే మారిపోతుంది, సగం సమస్యలు ముసలివాళ్ల వల్లే, సోషల్ మీడియా వ‌ల్ల ఎక్కువ దుష్ప్ర‌చారం, మగవాళ్ల కన్నా ఆడవాళ్లే బెటర్ అంటున్న ఒరాక్ ఒబామా
Hazarath Reddyఅమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆడవాళ్లను తెగ పొగిడేశాడు. వారి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. సింగ‌పూర్‌లో (Singapore)జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒబామా పురుషుల క‌న్నా ఆడ‌వాళ్లే చాలా నయం (Women are better leaders than men)అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
Kamal Haasan: సుప్రీంకోర్టు గడప తొక్కిన కమల్‌హాసన్, సీఏఏను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఎంఎన్ఎం పార్టీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమంటున్న మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత
Hazarath Reddyపౌరసత్వ సవరణ చట్టానికి (Citizenship Amendment Act 2019) వ్యతిరేకంగా మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ (Kamal Haasan) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సీఏఏని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
Ram Temple In Ayodhya: అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం, నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తాం, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyదశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే తెరదించిన సంగతి తెలిసిందే. చారిత్రాత్మక తీర్పు ( Ayodhya verdict) వచ్చిన తర్వాత అందరిలోనూ ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం (Ram Temple In Ayodhya) ఎప్పుడు ప్రారంభిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
Narendra Modi On Anti-CAA Protest: స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, ఆవదంతులు నమ్మవద్దు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు, హింసాత్మక నిరసనలు మన ధర్మం కాదన్న ప్రధాని మోడీ
Hazarath Reddyజాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై(Citizenship Amendment Act) ఈశాన్య రాష్ట్రాలు సహా పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో (Jamia Millia Islamia University) పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi)విచారం వ్యక్తం చేశారు.
Jharkhand Polls: జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు, బరిలో ప్రముఖులు, అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.25 కోట్లు,75 మంది అభ్యర్థులకు నేర చరిత్ర, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
Hazarath Reddyజార్ఖండ్ (Jharkhand)రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగో విడత పోలింగ్ ( Jharkhand Assembly Elections 2019 Phase 4) ప్రశాంతంగా జరుగుతోంది. 15 అసెంబ్లీ స్థానాలకు (15-assembly-seats) పోలింగ్ జరుగుతుండగా.. మొత్తం 221 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇందులో 23 మంది మహిళలు. మొత్తం 47 లక్షల 85 వేల 009 ఓటర్లున్నారు.