World
Mpox Outbreak: ప్రపంచదేశాలకు మరో వైరస్ ముప్పు, వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్ పై డబ్లూహెచ్ వో ఆందోళన, ఇంతకీ మంకీ పాక్స్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
VNSఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (Mpox) మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్ (Mpox Alert) సుమారు 70 దేశాలకు పాకింది. ఇప్పటివరకు 100 మంది ఎంపాక్స్‌తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
Texas Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టినా క్షేమంగా బయటపడ్డ ఇద్దరు పసిబిడ్డలు, టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Hazarath Reddyమంగళవారం జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, టెక్సాస్‌లోని ఫ్రీపోర్ట్‌లోని ఇంటర్‌స్టేట్ 10 ఈస్ట్ ఫ్రీవే మధ్యలో చాలాసార్లు పల్టీలు కొట్టిన కారు నుండి బయటకు తీయబడిన తర్వాత ఇద్దరు పసిబిడ్డలు అందులో చిక్కుకుపోయారు.
Weight Loss Story: అద్భుతం.. 610 కేజీల నుండి 63 కేజీలకు, కేవలం ఆరునెలల్లో 540 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి
Hazarath Reddyప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మోహ్‌సేన్ షరీ సుమారు 610 కిలోల బరువు నుండి ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు.
Vivek Ramaswamy on Bangladesh Hindus Attack: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన వివేక్ రామస్వామి, హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని మండిపాటు,
Arun Charagondaరిజర్వేషన్లు తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థుల ఆందోళనలకు కారణం కాగా వందలాది మంచి చనిపోయారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా బంగ్లాలో దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ఆ దేశంలో ఉంటున్న హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.
Mpox Outbreak in Africa: ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ కల్లోలం, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలకు పొంచి ఉన్న ముప్పు
Hazarath Reddyఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇందులో 96శాతానికిపైగా కేసులు ఒక్క కాంగోలో మాత్రమే గుర్తించారు. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్ మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.
Pakistan Horror: పాకిస్తాన్‌లో దారుణం, అయిదు రోజుల పాటు బంధించి బెల్జియం యువతిపై అత్యాచారం, కాళ్లు చేతులు కట్టేసి మరీ..
Hazarath Reddyపాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో 28 ఏళ్ల బెల్జియం యువతి ఐదు రోజుల పాటు అత్యాచారానికి గురైనట్లు తెలిసింది. ఆమె చేతులు మరియు కాళ్ళు బంధించబడ్డాయి. సంఘటన స్థలం నుండి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను విడిచిపెట్టారు.
Sheikh Hasina Seeks Justice: నాకు న్యాయం కావాలి,ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలి ప్రకటన చేసిన హసీనా,బంగ్లా విధ్వంసంపై దర్యాప్తు చేయాలని డిమాండ్
Arun Charagondaబంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశం తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు షేక్ హసీనా. ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటి ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో నిరసనల సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై దర్యాప్తు చేయాలని కోరారు.
China Girl’s Arangetram: భరతనాట్య ప్రదర్శనతో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల చైనా బాలిక
Rudraభారత సాంప్రదాయాలకు విదేశాల్లో ఎంతో గౌరవం ఉంది. మన ఆచార, వ్యవహారాలను విదేశీయులు ఎంతో ఇష్టపడుతారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. పొరుగు దేశం చైనాలో మన సంప్రదాయ నృత్యానికి కూడా ఆదరణ పెరుగుతోంది.
‘Pregnant’ Cars in China: ఇదేందయ్యా.. ఇది..!? చైనాలో ప్రెగ్నెంట్ కార్లు.. ఎండలే కారణం అంటున్న నిపుణులు.. ఎండల వల్ల కార్లు ప్రెగ్నెంట్ కావడం ఏంటి??
Rudraచైనాలో ప్రెగ్నెంట్ కార్లు హల్ చల్ చేస్తున్నాయి. అదేంటి..? కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా? అవును. మీరు చదువుతున్నది నిజమే.
Romania Wrestler Injured: పారిస్ ఒలింపిక్స్ లో విషాదం, అమాంతం ఎత్తి పడేసిన ప్రత్యర్ధి, మహిళా రెజ్లర్ విరిగిపోయిందా? ఆస్పత్రిలో సీరియస్ కండిషన్ లో రెజ్లర్
VNSఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఓ రెజ్లర్ (Wreaslig) కల చెదిరింది. ప్రత్యర్థి అమాంతం ఎత్తి పడేయంతో ఊహించని విధంగా ఆమె గాయపడింది. మహిళల ఫ్రీ స్టయిల్ 76 కిలోల విభాగం 16వ రౌండ్‌లో రొమేనియా రెజ్లర్ కటలినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాలపాలైంది
Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో కన్నుమూత, రెండేళ్ల పాటూ క్యాన్సర్ తో పోరాడి మరణించిన సుసాన్ వొజ్కికి, ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమంటూ పిచాయ్ ట్వీట్
VNSయూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు. సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్‌బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది.
Iraq Child Marriage Bill: బాలికల కనీస వివాహ వయసు 9కి తగ్గింపు.. పార్లమెంట్ లో ఇరాక్ ప్రభుత్వం బిల్లు
Rudraఒకవైపు బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వాలు కొత్త చట్టాలు, నిబంధనలు తీసుకువస్తుంటే.. ఇందుకు భిన్నంగా బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టింది.
Plane Crash in Brazil: బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)
Rudraబ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది.
Middle East Tension: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్
Hazarath Reddyఓ వైపు జ్రాయెల్- హమాస్ యుద్ధం (Israel Hamas conflict), మరోవైపు హెజ్‌బొల్లా, ఇరాన్ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది.
Iraq Barbaric Bill: అమ్మాయిలకు 9 ఏళ్లకే పెళ్లి, ఇరాక్‌లో కొత్త ప్రతిపాదిత చట్టం, అమలైతే అంతేనా?
Arun Charagondaప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తోడు వివాహేతర సంబంధాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్ లాంటి దేశంలో అనైతిక సంబంధాలు చాలా ఎక్కువ.
Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి
Hazarath Reddyనేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.
Earthquake in Japan Videos: జపాన్‌లో భారీ భూకంపం, స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు కంపించిన భూమి, సునామీ హెచ్చరికలు జారీ వీడియోలు ఇవిగో..
Hazarath Reddyజపాన్‌లో స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఓసారి 7.1, మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది.
Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం
Arun Charagondaబంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ భాద్యతలు స్వీకరించనున్నారు నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్. ఇవాళ దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు యూనస్. ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఉండే అవకాశం ఉంది.
Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో అక్కడ మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9 వేల మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు.