ప్రపంచం

Lunar New Year 2025: చాంద్రమాన నూతన సంవత్సరం(లూనార్ న్యూ ఇయర్‌) ..గూగుల్ డూడుల్ సెలబ్రేట్, ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా!

Arun Charagonda

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle). ఇవాళ లూనార్ న్యూ ఇయర్‌(Lunar New Year 2025)ను జరుపుకుంది.

PM Modi To Visit White House In February: వచ్చే నెలలో వైట్‌ హౌజ్‌ కు ప్రధాని మోదీ.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

Rudra

ప్ర‌ధాని నరేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో అంటే వచ్చే నెల మోదీ వైట్‌ హౌజ్‌ ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు.

4-Day Work Week Culture: వారానికి 4 రోజుల ప‌నే.. మా కంపెనీల్లో ఇంతే.. ఎలాంటి శాల‌రీ కటింగ్ కూడా వుండదు!.. బ్రిటన్‌ లోని 200 కంపెనీల సంచ‌ల‌న నిర్ణ‌యం

Rudra

ప‌ని గంట‌ల విష‌య‌మై భార‌త్‌ తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలు దేశాల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తున్న సమయంలో బ్రిటన్ లోని దాదాపు 200 కంపెనీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.

Planet Parade 2025: గ్రహాల పరేడ్.. ఆకాశంలో అద్భుతం, ఖగోల శాస్త్రంపై ఆసక్తిగల వారికి అంతులేని ఆనందం

Arun Charagonda

ఆకాశంలో అద్భుతం జరిగింది. ఒకేసారి ఆరు గ్రహాలు పరేడ్ చేసిన విధంగా ఆకాశంలో అద్భుతం చేశాయి. ఆరు గ్రహాలు—శుక్ర, కుజ, గురు, శని, నెప్ట్యూన్, యురేనస్—అందంగా సమూహమై “గ్రహాల పరేడ్” చేశాయి.

Advertisement

Google Doodle Republic Day 2025: నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్‌ చూశారా?

Rudra

గణతంత్ర దినోత్సవాన్ని నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది.

Kush Desai: వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌.. నియ‌మించిన అధ్యక్షుడు ట్రంప్‌

Rudra

భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌ ని వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నియ‌మించారు. ఈ విష‌యాన్ని శ్వేత‌సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Trump's Deportation Warning: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ..అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు, కారణం ఏంటంటే..

Hazarath Reddy

ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం.. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు.చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో (ఆన్ క్యాంపస్) వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది.

Birthright Citizenship Panic: అమెరికా పౌరసత్వం కోసం భారత మహిళలు దారుణం, 9 నెలలకు పుట్టాల్సిన బిడ్డను మధ్యలోనే సీజేరియన్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఆస్పత్రులకు పరుగులు

Hazarath Reddy

ఇప్పటికే గర్భిణులుగా ఉన్న మహిళలు ఫిబ్రవరి 20 లోగానే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా డెలివరీకి దగ్గరగా ఉన్నవారు సిజేరియన్ ద్వారా (C-Sections On Rise As Indians In US) పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికాలోని ఆసుపత్రులు ఒక్కసారిగా కిక్కిరిసిపోతున్నాయి.

Advertisement

Therapy For Depressive Disorder: నిరాశ, నిస్పృహలకు చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన స్ప్రావటోకు ఎఫ్ డీఏ అనుమతులు

Rudra

నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయి దైనందిన జీవితంలో ఎన్నో కోల్పోతున్న వారికి శుభవార్త. మేజర్ డిప్రేసివ్ ఆర్డర్ (ఎండీడీ)తో సతమతమవుతున్న వారికి ఊరట కలిగించేలా.. ఈ వ్యాధికి చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్ అందుబాటులోకి రానున్నది.

New Pandemic Infection Of H5N1 Virus: ముంచుకొస్తున్న మరో మహమ్మారి, పలుదేశాల్లో పెరగుతున్న కొత్త వైరస్ కేసులు, కరోనా కంటే డేంజరస్ అంటున్న నిపుణులు

VNS

ఈ వైరస్‌ను ఆవుల్లో గుర్తించడం ఇదే తొలిసారని సీడీసీ సైతం పేర్కొంది. వైరస్‌ ఆవు నుంచి మనుషులకు సైతం వ్యాపించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది జూన్‌లో భారత్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు పెరిగాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది.

EAM Jaishankar on US Deportation: యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

యునైటెడ్ స్టేట్స్‌లో పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న భారతీయులను చట్టబద్ధంగా తిరిగి తీసుకురావడానికి భారతదేశం సుముఖంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం ధృవీకరించారు.ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కొనసాగుతున్న చర్చల మధ్య ఈ ప్రకటన వెలువడింది.

Winter Storm Hits US: అమెరికా విలవిల..మంటల కార్చిచ్చు ఓ వైపు, మంచు తుఫాను మరో వైపు, మంచు తుఫాన్‌ బీభత్సానికి 8 మంది మృతి, 2200 విమానాలు రద్దు, వీడియో ఇదిగో

Hazarath Reddy

దక్షిణ అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ నుంచి ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు విస్తరించిన ఈ మంచు తుపాను (Winter Storm Hits US) ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా న్యూఓర్లీన్స్, అట్లాంటా, జాక్సన్‌విల్లే నగరాలు గడ్డకట్టుకుపోయాయి.

Advertisement

Los Angeles Wildfires: వీడియోలు ఇవిగో, లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు, గంటల వ్యవధిలోనే 9 వేల 400 ఎకరాలు కాలి బూడిద, దాదాపు 50వేల మందిని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు

Hazarath Reddy

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు చెలరేగింది. ఇటీవల అక్కడ చెలరేగిన దావానలం చల్లారక ముందే మరోమారు మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడుతున్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు (Los Angeles wildfires) ఎగసిపడుతున్నాయి.

CM Revanth Reddy: చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్‌,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్

Arun Charagonda

దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పై ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).

Hezbollah Leader Sheikh Muhammad Ali Hamadi Shot Dead: హిజ్బుల్లా కమాండర్‌ హతం, కుటుంబ కలహాలతో కాల్చి చంపినట్లు అంతర్జాయ కథనాలు

VNS

హిజ్బుల్లా అగ్రనేత షేక్ ముహమ్మద్ అలీ హమాదీ తన ఇంటి వెలుపల ఉండగా గుర్తుతెలియని ముష్కరులు రెండు వాహనాల్లో వచ్చి కాల్చి చంపినట్లు సమాచారం. హిజ్బుల్లా నాయకుడు గుర్తు తెలియని ముష్కరుల చేతుల్లో కాల్చి చంపబడ్డాడని జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ కాల్పుల్లో హమాదీ ప్రాణాలు కోల్పోయాడు.

Viral Video: భారత్ పరువు తీసారు, థాయ్‌లాండ్‌ బీచ్‌లో మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన భారత పర్యాటకుడు, తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఐదు నుండి ఆరుగురు భారతీయ పర్యాటకుల బృందం జనవరి 16, 2025న థాయ్‌లాండ్‌లోని పట్టాయా బీచ్‌లో బహిరంగంగా సముద్రంలో మూత్ర విసర్జన చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. స్థానిక థాయ్ టూరిస్ట్ తెలివిగా బంధించిన ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది.అక్కడ ఉన్న ఇతర పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Advertisement

Turkey Fire: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం, 66 మంది మృతి, మరో 55 మందికి గాయాలు, 12 అంత‌స్తులు ఉన్న గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో ఎగసిన మంటలు, వీడియో ఇదిగో

Hazarath Reddy

ట‌ర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోట‌ల్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం(Hotel Fire) చోటు చేసుకుంది. ఆ ప్ర‌మాదంలో 66 మంది మృతిచెంద‌గా, 51 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోలో ప్రావిన్సులో ఉన్న 12 అంత‌స్తులు గల గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో తెల్ల‌వారుజామున 3.30 నిమిషాల‌కు ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. హోట‌ల్ మంట‌ల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో దూకిన ఇద్ద‌రు బాధితులు కూడా మృతిచెందారు

Donald Trump 2.0: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చిన డొనాల్డ్ ట్రంప్,అంతర్జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్‌ కొనుగోలుకు సరికొత్త వ్యూహం

Hazarath Reddy

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును కొత్తగా "గల్ఫ్ ఆఫ్ అమెరికా"గా పేరు మార్చడానికి ఒక ఆర్డర్ ఉంది.ఈసందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని తెలిపారు.

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్‌ దేశాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్‌(యూఎస్‌ డాలర్‌ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రష్యా అధినేతను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకోవాలి. సంధి కుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని అనుకొంటున్నాను.

Advertisement
Advertisement