Hyderabad, Oct 27: ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో (Work Culture) తక్షణ మార్పులు రావాలని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) అభిప్రాయపడ్డారు. యువత కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలని, వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఆయన సూచించారు. 3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ అనే ఎపిసోడ్ లో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు.
🚨 Indian youngsters should work 70 hours a week if India wants to compete advanced economies - Infosys co founder Narayana Murthy. pic.twitter.com/h5oVw0T45B
— Indian Tech & Infra (@IndianTechGuide) October 26, 2023
యువత ప్రతిజ్ఞ చేయాలని..
రెండో ప్రపంచయుద్ధం తరువాత జపాన్, జర్మనీ దేశాలు తమ పని సంస్కృతిలో మార్పులు చేసుకున్నాయని, యువత అధికసమయం పనికి కేటాయించేలా ప్రోత్సహించాయని తెలిపారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని చెప్పారు. ‘‘ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను’’ అని యువత ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు.