Musk (Credits: Twitter)

Newdelhi, Nov 4: సోషల్ మీడియా (Social Media) దిగ్గజం ట్విట్టర్ (Twitter) ను హస్తగతం చేసుకున్న టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తయి... ఆ సంస్థ తన చేతిలోకి రాగానే... సంస్థ సీఈఓగా (CEO) ఉన్న పరాగ్ అగర్వాల్ తో పాటు ఆ సంస్థలో ముఖ్య స్థానంలో ఉన్న విజయ గద్దె, మరికొంత మంది కీలక అధికారులను తొలగించిన మస్క్... తాజాగా ఏకంగా సంస్థలోని దాదాపుగా సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే దిశగా అడుగులు వేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ మొదలు కానున్నట్టు రాయిటర్స్ వెల్లడించింది. ట్విట్టర్ నిర్వహణ ఖర్చును తగ్గించుకునే దిశగానే ఎలాన్ మస్క్ ఉద్యోగుల కోతపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపుగా 3,700 మంది ఉద్యోగులను ఇంటికి పంపే దిశగా మస్క్ ఆలోచన చేస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు ఎంతమేర పరిహారం ఇవ్వాలనే దానిపైనే మస్క్ తర్జనభర్జన పడుతున్నట్లుగా సమాచారం.

మునుగోడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఆ పార్టీదే విజయమట.. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ లో ఏ ఏజెన్సీ ఏం చెప్పింది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి??

ఇక కరోనా నేపథ్యంలో అమలులోకి వచ్చిన వర్క్ ఫ్రం హోమ్ కు ట్విట్టర్ లో పూర్తిగా చెల్లు చీటి ఇవ్వాలన్న దిశగానూ మస్క్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఒకేసారి భారీ నిర్ణయం తీసుకోకుండా.. కొన్ని మినహాయింపులను పక్కనపెట్టి మిగిలిన వారందరూ ఆఫీసుకు వచ్చి పనిచేయాలని మస్క్ నుంచి త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. ఇటు సగం మంది ఉధ్యోగుల తొలగింపు, మరోపై వర్క్ ఫ్రం హోంలకు ఉద్వాసన వార్తలతో ట్విట్టర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో వున్నారు.