ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం రాయ్‌పూర్‌లో జరిగిన తర్వాత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఎంపికైన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని విష్ణు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొదటి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ హౌసింగ్ స్కీమ్ లబ్దిదారులకు 18 లక్షల ఇళ్లను మంజూరు చేయడమేనని ఆయన తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు నియమితులు కానున్నట్లు తెలిసింది. సమావేశానికి ముందు, బిజెపి సీనియర్ నాయకుడు రమణ్ సింగ్ మాట్లాడుతూ, డిప్యూటీ సిఎంను కూడా నియమిస్తారని చెప్పారు. ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రిని ప్రకటించకుండానే బీజేపీ పోటీ చేసింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని కాషాయ పార్టీ ఘనవిజయం సాధించింది.
#WATCH | Raipur: BJP leader Vishnu Deo Sai to become the next Chief Minister of Chhattisgarh. pic.twitter.com/PtAOM52JKa
— ANI (@ANI) December 10, 2023
బీజేపీ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, డిసెంబర్ 3న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పదవికి భూపేష్ బఘేల్ రాజీనామా చేశారు. సీఎం పదవికి ఎంపికైన విష్ణు సియో దాయ్‌ను ఆదివారం బఘెల్ అభినందించారు.