ఎంటర్టైన్మెంట్

Jani Master Case: న‌న్నే ఆ అమ్మాయి వేధించింది! నా ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేక‌నే కుట్ర చేశారు! పోలీస్ క‌స్ట‌డీలో జానీ మాస్ట‌ర్ కీలక‌ విష‌యాలు

VNS

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో మూడో రోజూ జానీ మాస్టర్ ను (Jani Master) పోలీసులు విచారించారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో (Police Custody) జానీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Devara Movie Success Meet: నా త‌మ్ముడు హిట్ కొట్టేశాడు! దేవర రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్ పై క‌ల్యాణ్ రామ్ కామెంట్స్

VNS

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా, కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వ‌చ్చిన తాజా చిత్రం దేవ‌ర (Devara). ఈ సినిమా ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఆరేండ్ల త‌ర్వాత ఎన్టీఆర్ సోలోగా రావ‌డంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ దేవ‌ర సినిమా చూసి సంబ‌రాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా సాధించిన విజ‌యం ప‌ట్ల దేవ‌ర టీం స‌క్సెస్ మీట్ నిర్వ‌హించింది.

IIFA Utsavam 2024: ఐఫా వేదికపై సందడి చేయనున్న రెజీనా కసాండ్రా, 8 నిమిషాల పాటు స్టెప్పులేసి అలరించనున్న రెజీనా..ఎక్స్‌క్లూజివ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (IIFA) ఉత్సవం 2024 ఇవాళ్టి నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నేటి నుండి మూడు రోజుల పాటు ఐఫా ఉత్సవం జరుగనుండగా తొలిరోజు దక్షిణ భారతదేశ చిత్రాలకు సంబంధించిన అవార్డుల కార్యక్రమం ఉండనుంది. తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Actor Abhishek Arrest in Drug Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ అరెస్ట్, గోవాలో అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు

Hazarath Reddy

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ పై జూబ్లీహిల్స్, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. 2012 నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆయన పలు దఫాలుగా అరెస్ట్ అయ్యారు

Advertisement

Devara Movie Review: ఆరేళ్ల నిరీక్షణ, ఎట్టకేలకు బుడ్డోడి ఫ్యాన్స్ ఆకలి తీర్చిన కొరటాల, థియేటర్లలో పోటెత్తిన ఎర్రసముద్రం కెరటాలు, దేవర పార్ట్ 1 మూవీ రివ్యూ ఇదిగో..

Hazarath Reddy

‘దేవర’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కొరటాల ఆచార్య మూవీ జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడా.. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ మూవీ మరీ ప్రేక్షకులను ఆకట్టుకుందా ?

Jr NTR Fan: కడపలో విషాదం, దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి..సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన అభిమాని

Arun Charagonda

కడప న‌గ‌రంలోని అప్సర థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు ఓ అభిమాని. వెంట‌నే ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీక‌రించారు డాక్ట‌ర్లు.

Clash at Devara Movie: 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)

Rudra

కడపలోని రాజా ధియేటర్ లో 'దేవర' మూవీ ప్రదర్శన సమయంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టికెట్స్ లేకుండానే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది.

Devara: విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొట్టిన దేవర, ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో ఒక్క‌రోజే ఏకంగా 42 షోలు, 500 పైగా థియేట‌ర్‌ల‌లో మిడ్ నైట్ స్పెషల్ షోలు

Vikas M

ఆరేండ్లుగా ఆక‌లితో ఉన్న తార‌క్ అభిమానుల‌కు దేవ‌ర రుచి చూపించబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాను మిడ్ నైట్ 1 గంట‌ల‌కు స్పెష‌ల్ షో వేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడ‌యిపోయాయి. అయితే 1 గంట‌ల షోల ప‌రంగా ఈ సినిమా అరుదైన రికార్డును అందుకోనుంది.

Advertisement

Ayudha Pooja Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూన‌కాలే! ఎన్నోరోజులుగా వెయిట్ చేస్తున్న ఆయుధ పూజ సాంగ్ వ‌చ్చేసింది (వీడియో ఇదుగో)

VNS

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం దేవ‌ర‌ (Devara). నంద‌మూరి అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండ‌గా.. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ‘ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి

Kaun Banega Crorepati 16: కౌన్‌ బనేగా కరోడ్‌పతి, కోటి రూపాయలు గెలుచుకున్న ప్రశ్న ఇదే, ఏడు కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసినా క్విట్‌ అయిన చందన్ ప్రకాశ్

Hazarath Reddy

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) 16వ సీజన్‌లో 22 ఏళ్ల జమ్మూకశ్మీర్‌ కుర్రాడు చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ గా నిలిచాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు.

Devara Ticket Mafia: బ్లాక్ మార్కెట్‌లో దేవర సినిమా టికెట్లు, ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల తనిఖీలు, వాస్తవమేనని నిర్దారణ

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ లో " దేవర" సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులు పరిశీలించిన తహశీల్దార్.

IIFA 2024: ఐఫా ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, ఇంప్రెసివ్‌గా షారుఖ్ ఫోటోలు

Arun Charagonda

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపటి నుండి ఈ ఉత్సవం ప్రారంభంకానుండగా ఇప్పటికే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ నటులు దుబాయ్‌కి చేరుకున్నారు.

Advertisement

Prakash Raj vs Pawan Kalyan: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం, పవన్ కల్యాణ్‌పై మరో కౌంటర్ వదిలిన ప్రకాష్ రాజ్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా, ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?" అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు.

Save Steel Plant Slogans On Devara: దేవర సినిమాకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ, దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టర్లను అంటించిన కార్మికులు

Arun Charagonda

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలోనే ఈ మూవీకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సెగ తగిలింది. ఈ సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్‌‌ను కార్మికులు అతికించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు.

Jr NTR On Devara Movie: దేవర ప్రమోషన్స్‌లో బిజీగా ఎన్టీఆర్, తండ్రీకొడుకులుగా నేనే చేశానని వెల్లడి, వీడియో ఇదిగో

Arun Charagonda

'దేవర' ప్రమోషన్స్ భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ 'బియాండ్ ఫెస్ట్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'RRRలో రామ్ చరణ్ & మీరు ఇద్దరూ కలిసి నటించారు. దేవరలో ఎలా' అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ 'దేవరలో నాది డబుల్ యాక్షన్. తండ్రీకొడుకులుగా నేనే నటిస్తున్నా. దేవర& వర క్యారెక్టర్స్ చేశా' అని తెలిపారు.

Vettaiyan Preview Video: వేట్టయన్- ద హంట‌ర్‌ ప్రివ్యూ వీడియో ఇదిగో, మ‌న‌కు ఎస్‌.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు అంటూ..

Vikas M

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ వీడియోను విడుద‌ల చేసింది.

Advertisement

IIFA Utsavam 2024 In UAE: ప్రతిష్టాత్మక ఐఫా ఉత్సవం 2024కు సర్వం సిద్ధం, మెగాస్టార్ చిరంజీవికి ఐఫా వేదికగా ప్రతిష్టాత్మక అవార్డు, అలరించనున్న దక్షిణాది తారలు

Arun Charagonda

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 27, 2024న, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు ఒకే వేదికపై సందడి చేయనున్నారు.

KTR On Devara Pre Release: దేవర ప్రీ రిలీజ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్, ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రీ రిలీజ్ రద్దైందని వ్యాఖ్య..వీడియో ఇదిగో

Arun Charagonda

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనివార్య కారణాల వల్ల రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి అని మండిపడ్డారు.

Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ, రూ.10 లక్షలతో పారిపోయిన పనిమనిషి, సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్ బాబు భార్య

Arun Charagonda

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం లో రూ.10 లక్షలతో పారిపోయారు పనిమనిషి నాయక్. నిన్న రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.

Urmila Matondkar Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ, 8 సంవత్సరాల వివాహా బంధానికి బ్రేక్!

Arun Charagonda

ఊర్మిళ మటోండ్కర్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 8 ఏళ్ల వివాహా బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు కావాలంటూ కోర్టు వెళ్లింది ఊర్మిళ. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని, భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లినట్టు సమాచారం.

Advertisement
Advertisement