సినిమా
Game Changer Release Date: గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ మూవీ
Arun Charagondaఎట్టకేలకు రామ్ చరణ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కీలక ప్రకటన చేశారు దిల్ రాజు. 2025 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
Rudraప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.
Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)
Rudraతెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Sayaji Shinde Joins NCP: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు విలన్, త్వరలోనే జరుగబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
VNSఅజిత్ పవార్ నేతృత్వంలో (Ajit Pawar) ఉండే వర్గంలో ఆయన చేరారు. ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Election) జరగనున్నాయి.
Vishwambhara Teaser: విశ్వంభర వచ్చేస్తున్నాడు, టీజర్ ముహూర్తం ఖరారు చేసిన మేకర్స్, దసరాకు ఇక మెగాఫ్యాన్స్ కు పూనకాలే
VNSమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘విశ్వంభర’ టీజర్ (Vishwambhara Teaser) టైం వచ్చేసింది. దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 10 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ED Money Laundering Case: మనీలాండరింగ్ కేసు,శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట, ఈడీ నోటీసులపై స్టే
Hazarath Reddyమనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ ను ఈ నెల 13వ తేదీ లోగా ఖాళీ చేయాలని ఈడీ ఇచ్చిన నోటీసులను శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టులో సవాల్ చేసిన సంగతి విదితమే.
Prabhas Meets Rajendra Prasad: వీడియో ఇదిగో, రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్ ప్రభాస్, కూతురి మరణంపై సంతాపం వ్యక్తం
Vikas Mసినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్.... రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
Pushpa 2 Update: రూ. 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప-2, ఫస్ట్‌హాఫ్ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్ చేశారంటూ పోస్టర్
Vikas Mఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రమేదేనా ఉందంటే అది పుష్ప-2: ది రూల్ ఒకటే.పుష్పతో అందరి దృష్టిని ఆకర్షించిన సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం కోసం గత రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.
Congress on Jani Master Award Revoke: జానీ మాస్టర్‌కు అవార్డు రద్దుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టకూడదని స్పష్టం
Vikas Mఅసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును రద్దు చేయడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.
Sayaji Shinde Meet Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే, ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు ఇవ్వాలని సూచన
Vikas Mఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది.
NTR Speech At Devara Success Meet: చాలా సాదాసీదాగా దేవర సక్సెస్ మీట్, అభిమానుల గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు వింటే ఫిదా అవ్వాల్సిందే!
VNSఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తాజాగా సక్సెస్ ఈవెంట్‌ను (Devara Succes meet) నిర్వహించింది.
70th National Film Awards: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న రిషబ్ శెట్టి, కాంతార సినిమాకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం
Hazarath Reddy'కాంతారా' చిత్రంలో తన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
70th National Film Awards: ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏఆర్ రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ I చిత్రానికి 70వ జాతీయ చలనచిత్ర పురస్కారం
Hazarath Reddyలెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ 'పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ I' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు
70th National Film Awards: ఉంచై సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న సూరజ్ బర్జాత్యా
Hazarath Reddyన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు . 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఆగస్టు 2024లో ప్రకటించారు.
Defamation Case: నాగార్జునపై కూడా పరువు నష్టం దావా వేస్తాం, కొండా సురేఖ లాయర్ కీలక వ్యాఖ్యలు, కేసు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
Hazarath Reddyహీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.
Singham Again Trailer Out: అజయ్ దేవ్‌గణ్ సింగం అగైన్ ట్రైలర్ ఇదిగో, దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు మూవీ
Vikas Mబాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty), అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన సింగం సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది.
Aghathiyaa: జీవా, రాశీఖన్నా లేటెస్ట్ మూవీ Aghathiyaa నుంచి ఫస్ట్ లుక్ విడుదల, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో, హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రానున్న సినిమా
Vikas Mరంగం, యాత్ర 2 సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
Rajendra Prasad Daughter Dies: వీడియో ఇదిగో, మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించి వస్తానంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
Hazarath Reddyఅలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ను నిన్న కలవగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది. పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు.
Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ వీడియో ఇదిగో, ఏమున్నాడ్రా బాబు అంటున్న నెటిజన్లు, విదేశాలకు చెక్కేసిన సూపర్ స్టార్
Hazarath Reddyమహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి.