Tamannaah And Kajal To Be investigated

Hyd, Feb 28:  క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్స్ తమన్నా(Tamannaah), కాజల్‌(Kajal)లను విచారించనున్నారు పోలీసులు( Crypto Currency Fraud Case). పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి సినీ తారలు తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.

పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చింది క్రిప్టో కరెన్సీ మోసం(Crypto Currency Fraud). 10 మంది వద్ద నుంచి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆకర్షించి, సుమారు రూ.2.40 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 2022లో కోయంబత్తూరును ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైంది.

నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

నటి తమన్నా ఈ ఆఫీస్‌ను ప్రారంభించగా(Crypto Currency Fraud) ఆ తర్వాత మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన కంపెనీ ఈవెంట్‌కు నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. దీంతో ఈ క్రిప్టో కరెన్సీపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడింది.

ఆ తర్వాత వేలాది మంది నుండి డబ్బులు సేకరించారు నిర్వాహకులు. ఇక ఈ కేసులో నితీష్ జైన్ (36), అరవింద్ కుమార్ (40)లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ లను విచారించనున్నారు పోలీసులు.