SSMB28 Update:ఈ సారి త్రివిక్రమ్ గట్టిగానే ప్లాన్ చేశాడు, సూపర్‌స్టార్ కొత్తమూవీ క్రేజీ అప్‌డేట్, మాస్ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ (SSMB28) వస్తుందని తెలిసినప్పటి నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు మహేష్-త్రివిక్రమ్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు కూడా చెబుతున్నాయి.
Hyderabad, March 26: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ (SSMB28) వస్తుందని తెలిసినప్పటి నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు మహేష్-త్రివిక్రమ్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే విషయం తప్ప, ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవవుతూ వచ్చారు. కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.
The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH
— Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023
ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనే వార్తలకు తాజాగా చెక్ పెట్టారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు ఓ బ్లాస్టింగ్ అప్డేట్‌ను ఇచ్చారు. ఈమేరకు ఓ మాస్ పోస్టర్‌తో (SSMB28) అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో మహేష్ ఊరమాస్ అవతారంలో సిగరెట్ తాగుతూ, నడుచుకుంటూ వస్తున్నాడు. మహేష్‌ను త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడో ఈ పోస్టర్‌తోనే చెప్పేశాడు.
ఇక ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ పోస్టర్ చేసిందని చెప్పాలి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Mar 26, 2023 08:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

