Tollywood Diwali: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ టాప్‌ హీరోస్, రామ్‌చరణ్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌లో అరుదైన కలయికలు, కానీ ఒక్కటి మిస్సయిందంటున్న సినీ అభిమానులు
Tollywood Diwali (PIC@ X)

Hyderabad, NOV 12: దీపావళి పండగని టాలీవుడ్ (Tollywood Diwali) సెలబ్రిటీలంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ టాలీవుడ్ స్టార్స్ (Tollywood Stars) అందరికి చిరంజీవి ఇంటి ఒక దివాళీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ దివాళీ బ్యాష్‌ని రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన హోస్ట్ చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీకి మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ (Jr NTR) ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు, మంచు లక్ష్మి.. ఇలా పలువురు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు ఉన్న ఫోటో మార్నింగ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. తాజాగా చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్(Venkatresh), నాగార్జున (Nagarjuna) ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో బయటకి వచ్చింది. అలనాటి స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉండడం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

అయితే ఈ ఫ్రేమ్ లో బాలకృష్ణ కూడా ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేదని మరికొంత మంది అభిమానులు తన ఆశని వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్స్ తో మరొకొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

 

ఈ పార్టీలో అల్లు అర్జున్ ఫోటో కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణ కూడా ఫలించింది. వెంకీతో అల్లు అర్జున్ ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.