New Delhi, June 08: దేశంలో తొలితరం మహిళా ఇంగ్లిష్ న్యూస్ యాంకర్లలో (News anchor) ఒకరైన గీతాంజలి అయ్యర్ (Gitanjali Aiyar) కన్నుమూశారు. గతకొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) సంతాపం తెలిపారు. దూరదర్శన్ (Doordarshan), ఆల్ ఇండియా రేడియోలో మొదటి ఇంగ్లిష్ న్యూస్ యాంకర్లలో (English news presenter) ఆమె ఒకరని చెప్పారు. దూరదర్శన్‌కు ఆమె చేసిన సేవలను కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Deeply saddened to hear about the passing of Gitanjali Aiyar, one of the first and finest English news anchors on Doordarshan and All India Radio.
A trailblazer & pioneer, she brought credibility, professionalism, and a distinct voice to every news report, leaving an indelible… pic.twitter.com/MvaR7kgLmB
— Anurag Thakur (@ianuragthakur) June 7, 2023
కోల్‌కతాలోని లొరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన గీతాంజలి.. 1971లో దూరదర్శన్‌లో చేరారు. 30 ఏండ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు. దూరదర్శన్‌లో కెరీర్ ముగిశాక.. కార్పొరేట్ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్ (Khandaan) అనే సీరియల్‌లోనూ నటించారు.
నాలుగుసార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. మీడియా రంగానికి చేసిన సేవలకుగాను 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ ఉమెన్ పురస్కారాన్ని దక్కించుకున్నారు.