తాజా వార్తలు

Isha Foundation Row: ఈషా ఫౌండేష‌న్‌పై చర్యలు ఆపండి, తమిళనాడుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా

Hazarath Reddy

కోయంబ‌త్తూరులోని ఈషా ఫౌండేష‌న్ ఆశ్ర‌మంలో(Isha Foundation Row) ఉన్న త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌కు బ్రెయిన్‌వాష్ చేశార‌ని, దాంతో వాళ్లు ఇంటికి రావ‌డం లేద‌ని ఓ తండ్రి దాఖ‌లు చేసిన పిటీష‌న్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఈషా పౌండేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

Congress Leader Jhansi Reddy Injured: కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు, షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో తీవ్ర గాయాలు

Arun Charagonda

షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో కాంగ్రెస్‌ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే ఝాన్సీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.

CM Revanth Reddy On Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా?, దానిని కూల్చాలా వద్దా? అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటాకాలా అని ఆగ్రహం

Arun Charagonda

హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Pawan Kalyan Health Update: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, తిరుమల మెట్లు ఎక్కిన త‌ర్వాత తీవ్ర అస్వ‌స్థ‌త‌, వారాహి స‌భ‌లో పాల్గొంటారని తెలిపిన శ్రేణులు

Hazarath Reddy

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన త‌ర్వాత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆ సమయంలో ఆయ‌న‌ వెన్నునొప్పితో బాధపడ్డారు

Advertisement

Bathukamma Song On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్..

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాట పాడారు మూసీ బాధితులు. హైదరాబాద్ ఎల్బీనగర్ - చైతన్యపురిలో 'రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు మూసీ బాధితులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లుతున్న అమ్మాయిలపై దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Hazarath Reddy

కర్ణాటకలోని మంగళూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలపై కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మరణించగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jagan Meeting With YSRCP Leaders: 16 నెలల జైలు జీవితంపై జగన్ సంచలన వ్యాఖ్యలు, కేసులు పెట్టడం మినహా వీళ్లు ఏమీ చేయలేరంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్

Hazarath Reddy

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

Minister Sridhar Babu Convoy: మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు, వర్గల్ నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం, ఆస్పత్రిలో ముగ్గురు బాధితులకు చికిత్స

Arun Charagonda

కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరగగా.. మరో ఇద్దరికి కాళ్ళు విరిగాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Ludhiana: వీడియో ఇదిగో, కుప్పకూలిన మూడంతస్తుల భవనం, కూతురుని కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రయత్నానికి హ్యాట్సాప్

Hazarath Reddy

లూథియానాలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలోని చావల్ బజార్ సమీపంలోని బండేయ మొహల్లాలో శతాబ్దపు నాటి, మూడు అంతస్తుల భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది, ఒక మహిళ, ఆమె 2 ఏళ్ల కుమార్తె గాయపడ్డారు. 27 ఏళ్ల ఖుషీగా గుర్తించబడిన మహిళ తన బిడ్డను పడిపోతున్న శిథిలాల నుండి రక్షించడానికి ప్రయత్నించినప్పుడు సిసిటివి ఫుటేజీలో బంధించింది.

Delhi Firing: ఢిల్లీలో మరో డాక్టర్ దారుణ హత్య, వైద్యం కోసం వచ్చి తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరు అగంతకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలోని జైత్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్‌ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువకులు డాక్టర్‌ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపారు.

Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖను నాగార్జున లీగల్ నోటీసులు?, న్యాయపోరాటానికి సిద్దమవుతున్న నాగార్జున!

Arun Charagonda

మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యారు నటుడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని వెల్లడించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

Mobile Phones Addiction: దారుణం, మొబైల్ ఫోన్ లాక్కుందని తల్లిని బ్యాట్‌తో చావబాదిన కొడుకు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

పిల్లలు ఈ కాలంలో మొబైల ఫోన్ ఇవ్వకుంటే ఎంతకైనా తెగించేలా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఓ అబ్బాయి తన తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇది.

Advertisement

Money Laundering Case: హెచ్‌సీఏ మ‌నీలాండ‌రింగ్ కేసు, టీమిండియా మాజీ కెప్టెన అజారుద్దీన్‌కు ఈడీ నోటసులు, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Hazarath Reddy

హైద‌రాబాద్ క్రికెట్ సంఘంతో లింకున్న మ‌నీలాండ‌రింగ్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌(Azharuddin)కు ఇవాళ ఈడీ నోటీసులు జారీ చేసింది. 2020 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా అజారుద్దీన్ ప‌నిచేశారు.

Konda Surekha Comments Row: సినీ పెద్దలారా మీకు దండం పెడతా...ఈ అంశానికి ముగింపు పలకండన్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, కొండా క్షమాపణలు చెప్పారన్న కాంగ్రెస్ నేత

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపగా దీనిపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్. ఇందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు మహేశ్ కుమార్. సినీ పెద్దలారా మీకు దండం పెడతాం ఇక ఆపేయండని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండని సూచించారు.

Telangana High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ , సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరణ, ఈ నెల 24న వాదనలు వింటామన్న హైకోర్టు

Arun Charagonda

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు డివిజన్ బెంచ్ షాకిచ్చింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని తెలిపింది డివిజన్‌ బెంచ్‌.సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.

Russian Tik Toker Dies On Camera: రష్యన్ టిక్‌ టాకర్‌ అరినా గ్లాజునోవా మృతి, ప్రమాదవశాత్తూ మెట్లపై నుండి పడిపోవడంతో మృతి

Arun Charagonda

ప్రముఖ రష్యన్ టిక్‌టాకర్ అరినా గ్లాజునోవా(27) ప్రమాద వశాత్తూ మృతి చెందారు. జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో మృతి చెందారు. స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఉండగా బ్యాలెన్స్ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. ఆమెకు తలకు తీవ్ర గాయాలు కాగా కొద్దిసేపటికే మృతి చెందారు.

Advertisement

RGV On Konda Surekha: సారీ చెప్పినా మంత్రి కొండా సురేఖని వదలని ఆర్జీవీ, అక్కినేని కుటుంబాన్ని అవమానిస్తారా..సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేసిన వర్మ

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కొండా మురళి - సురేఖ జీవిత చరిత్ర నేపథ్యంలో కొండా సినిమాను తెరకెక్కించారు వర్మ. అయితే తాజాగా సమంత పై సురేఖ చేసిన వ్యాఖ్యలను తనదైన శైలీలో ఖండించారు.

ED Notices To Azharuddin: కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు, హెచ్‌సీఏలో రూ.20 కోట్ల అవకతవకలపై ఈడీ విచారణ

Arun Charagonda

కాంగ్రెస్ నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగియని అజారుద్దీన్‌కు నోటీసులు ఇచ్చింది.

Jani Master: జానీ మాస్టర్‌కు మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఈ నెల 6 నుండి 10 వరకు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం

Arun Charagonda

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇప్పటికే జానీ మాస్టర్‌ 14 రోజుల రిమాండ్‌లో పోలీసులు కీలక అంశాలను రాబట్టారు.

Konda Surekha On KTR Legal Notices: కేటీఆర్ లీగల్ నోటీసులపై కొండా సురేఖ , న్యాయపరంగానే ఎదుర్కొంటా...కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సురేఖ

Arun Charagonda

కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని తేల్చి చెప్పారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని...ఆయన పంపిన నోటీసులపై లీగల్‌గానే స్పందిస్తానని చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు అని.... నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని తెలిపారు కొండా.

Advertisement
Advertisement