తాజా వార్తలు

Raj Tarun Gets Anticipatory Bail: రాజ్ త‌రుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు, పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపిన తెలంగాణ‌ హైకోర్టు

Vikas M

టాలీవుడ్ న‌టుడు రాజ్ త‌రుణ్‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అతడికి తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. త‌న‌ను మోసం చేశాడు అంటూ లావ‌ణ్య అనే యువ‌తి రాజ్ త‌రుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది

Rohit Sharma: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ, ఇంతకీ ఏ రికార్డో తెలుసా ?

Vikas M

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక​ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ తర్వాతి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఉన్నాడు

RBI On UPI Payments: ఇకపై యూపీఐ పేమెంట్స్ రూ.5 లక్షలు,యథాతథంగా రెపో రేటు, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

Arun Charagonda

ద్రవ్య పరమతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక రేపో రేటును 6.5% వద్దనే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు రోజుకు యూపీఐ పేమెంట్స్ లిమిట్ రూ.1 లక్ష మాత్రమే ఉండగా దానిని రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ అడ్డదారి తొక్కాడు. స్కూలులో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మండిపడిన తల్లిదండ్రులు అతగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులతో ఎడాపెడా వాయించి పడేశారు.

Advertisement

Bihar Shocker: వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..

Hazarath Reddy

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారీకి ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు గాయపడిన దారుణ ఘటన చోటుచేసుకుంది

Ola: క్విక్‌ కామర్స్‌ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్‌ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం

Vikas M

గతంలో క్విక్‌ కామర్స్‌ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్‌ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Waqf (Amendment) Bill 2024: వక్ఫ్‌ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం, విస్తృత పరిశీలన కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నట్లు ప్రకటన, వక్ఫ్‌ సవరణ బిల్లులో ఏముంది, ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ?

Hazarath Reddy

ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మైనారిటీ వ్యవహారాలమంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం, 1995 (2013లో సవరించిన విధంగా) కు దాదాపు 40 సవరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది

Andhra Pradesh Rain Update: ఏపీకి మరో మూడు రోజులు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక, దంచికొడుతున్న వానలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Pawan Kalyan Meets CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ భేటీ, ఎందుకో తెలుసా?

Arun Charagonda

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాలో ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అంతేగాదు ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కొల్పోయే పరిస్థితి వచ్చింది.

Telcos Disconnect 73 Lakh Mobile Connections: 73 లక్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్లు డిస్‌కనెక్ట్ చేసిన కేంద్రం, ఆయా మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను రీవెరిఫై చేయాలని టెల్కోల‌కు డాట్ ఆదేశం

Vikas M

వివ‌రాల ధ్రువీక‌ర‌ణలో విఫ‌ల‌మైన 73 ల‌క్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. ఆయా మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ (డాట్‌) టెల్కోల‌ను ఆదేశించింది.

RBI: ఆర్బీఐ కీలక అప్‌డేట్, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన

Vikas M

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పన్ను చెల్లింపుల UPI పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. దీనర్థం మీరు ఇప్పుడు UPIని ఉపయోగించి పెద్ద పన్ను మొత్తాలను త్వరగా, సులభంగా చెల్లించవచ్చు.ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు.

IOA On Antim Panghal: భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఐఓఏ చర్య

Arun Charagonda

భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఇండియన్ ఒలింపిక్ సంఘం.తన అక్రిడిటేషన్ సోదరికి ఇచ్చి ఒలింపిక్‌ గ్రామానికి పంపింది. ఒలింపిక్స్‌లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఐఓఏ

Advertisement

Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి

Hazarath Reddy

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.

Earthquake in Japan Videos: జపాన్‌లో భారీ భూకంపం, స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు కంపించిన భూమి, సునామీ హెచ్చరికలు జారీ వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

జపాన్‌లో స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఓసారి 7.1, మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

Telangana Rain Update: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

CM Kejriwal Custody Extended: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట, సీబీఐ కేసులో జ్యూడిషియల్ కస్టడీ పొడగింపు, తీహార్ జైలులోనే కేజ్రీవాల్

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. ఈడీ కేసులో మధ్యంత బెయిల్ దక్కిన సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ లభించడం లేదు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడగిస్తున్నట్లు

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టిన డ్రైవర్, త్రుటిలో తప్పించుకున్న చిన్నారి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లో ఓ డ్రైవర్‌ రోడ్డుపై పార్క్ చేసిన కారును స్టార్ట్ చేసి సర్వీస్ రోడ్డులోని కిల్లా మైసమ్మ దేవాలయం సమీపంలో ప్రయాణిస్తున్న బైక్‌ను అకస్మాత్తుగా ఢీకొట్టాడు. తన చిన్నారి బాబును స్కూల్ నుంచి తీసుకెళ్తున్న వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు,

Virat Kohli: విరాట్ కోహ్లీ 1300వ ఫోర్ చూశారా, ఎంత సింపుల్‌గా కొట్టేశాడో..వీడియో వైరల్

Arun Charagonda

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా శ్రీలంతో జరిగిన మూడో వన్డేలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ ఒక్కడే రాణిస్తుండగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవుతున్నారు. అయితే మూడో వన్డేలో అద్భుతమైన ఫోర్ కొట్టడం ద్వారా ఇప్పటివరకు 1300 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు విరాట్.

Cyberabad Police: సైబర్‌ కేటుగాళ్ల ఉచ్చులో పడకండి..పోలీసుల ప్రాథమిక జాగ్రత్తలు, ప్రతిఒక్కరూ తెల్సుకోవాల్సిన వీడియో

Arun Charagonda

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుడా ఉండటానికి తీసుకోవాల్సి ప్రాథమిక జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Dog Attack in Karimnagar: షాకింగ్ వీడియో, ఆడుకుంటున్న 18 నెలల బాలుడుపై వీధి కుక్క దాడి, తృటిలో తప్పించుకున్న మరో బాలుడు

Hazarath Reddy

కరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది నెలల బాలుడుపై వీధీ కుక్క దాడి చేసింది. శాతావాహన యూనివర్సిటీ సమీపంలోని విద్యానగర్ వీధీలో రోడ్డుపై ఆడుకుంటున్న హరినందన్ అనే చిన్న పిల్లాడిపై‌ వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటుండగా ఎక్కడనుంచి వచ్చిందో అకస్మాత్తుగా నల్ల కుక్క దూసుకొచ్చింది

Advertisement
Advertisement