తాజా వార్తలు

Telangana Assembly Session: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారిందని మండిపాటు, సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు

Arun Charagonda

బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.

Swapnil Kusale Wins Bronze Medal: ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, పురుషుల 50 మీటర్ల రైఫిల్‌లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే

Hazarath Reddy

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందారు

Telangana Shocker: కొడుకు బాగా చదవలేదని తండ్రి దారుణం, చితక బాది గోనె సంచిలో కుక్కి చెరువులో పడవేసిన కసాయి, పిల్లాడు ఏడుపులు విని స్థానికులు.

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కొడుకు చదువుకోవడం లేదని ఓ తండ్రి ఆ పిల్లాడిని చితక బాది గోనె సంచిలో కుక్కాడు. అనంతరం ఎవరికి కనిపించకుండా తన ఆటోలో మలపు రాజు కుంట చెరువులో పడవేసి కాళ్లతో తొక్కివేశాడు

New Parliament Building Leaking? కొత్త పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీక్, బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

నరేంద్ర మోదీ సర్కారు నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటర్ లీక్ కు సంబంధంచిన వీడియోలను ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement

Dogs Attack: వృద్దురాలి తల,కడుపు పీక్కుతిన్న కుక్కలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం, ఇంటికి తలుపులు లేకపోవడంతో దాడి

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తాండ లో దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న పిట్ల రాజ్యలక్మి (75) అనే వృద్ధురాలు పై కుక్కలు దాడి చేశాయి. తల, కడుపు భాగం పూర్తిగా తిన్నాయి కుక్కలు. రాత్రి దాడి చేసి చంపిన కుక్కలు, తెల్లవారి ఉదయం 9గంటలకు చూశారు కుటుంబ సభ్యులు.

Sudigali Sudheer Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్ట్ కమెడియన్ సుడిగాలి సుధీర్, క్రేజ్ మాములుగా లేదుగా..

Hazarath Reddy

జబర్దస్ట్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ తిరుమలలో సందడి చేశాడు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్, యాంక‌ర్ అయిన సుధీర్ తన కుటుంబంతో కలిసి తిరుమ‌ల‌ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు. వీడియో ఇదిగో..

Fouad Shokor Dead: ఇజ్రాయెల్ వైమానికి దాడిలో హిజ్బుల్లా టాప్ మిలటరీ కమాండర్ ఫౌద్ షోకోర్ మృతి, అధికారికంగా ధ్రువీకరించిన హెజ్‌బొల్లా గ్రూపు

Hazarath Reddy

మంగళవారం ఇజ్రాయెల్ దాడిలో మరణించిన హిజ్బుల్లా యొక్క టాప్ మిలటరీ కమాండర్ ఫౌద్ షోకోర్ మృతదేహం బీరుట్ యొక్క దక్షిణ శివారులోని దాహీలో శిథిలాల కింద కనుగొనబడిందని హిజ్బుల్లాకు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది.

Chicken or the Egg? కోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్నకు బలైన స్నేహితుడు, సమాధానం చెప్పలేదని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మరో స్నేహితుడు

Hazarath Reddy

కోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్న స్నేహితుడి హత్యకు దారి తీసింది. ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్‌లోని మునా రీజెన్సీలో జూలై 24న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండిపెండెంట్ ప్రచురించిన నివేదిక ప్రకారం , అనుమానితుడు DR గా గుర్తించబడ్డాడు, అతని స్నేహితుడు కదిర్ మార్కస్‌ని మందు పార్టీ కోసం ఆహ్వానించాడు.

Advertisement

CM Revanth Reddy On SC,ST Reservations: దేశంలో తొలిరాష్ట్రంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందన్న మందకృష్ణ

Arun Charagonda

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విధంగా అమలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం..దేశంలో తొలిరాష్ట్రంగా రిజర్వేషన్లను అమలు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లలో కూడా మాదిగ సోదరులకు రిజర్వేషన్లు వర్తించేలా ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించారు.

Ismail Haniyeh Dead: హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుకు భారీ షాక్, వైమానికి దాడిలో పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా మృతి

Hazarath Reddy

ఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుకు భారీ షాక్ తగిలింది. హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు.

New FASTag Rules: వాహనదారులు అలర్ట్, నేటి నుంచి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు అమల్లోకి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకుంటే బ్లాక్‌లిస్టులోకి..

Hazarath Reddy

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం ఈరోజు (August 1, 2024) నుండి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త రూల్స్‌ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్‌ 31లోగా తప్పనిసరిగా అప్‌డేట్‌ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

Cloudburst in Himachal: వీడియో ఇదిగో, భారీ వరదలకు 5 సెకండ్లలో కుప్పకూలిన భారీ భవనం, పార్వతీ నదిలో కొట్టుకుపోయిన భవన శిథిలాలు

Hazarath Reddy

సిమ్లా జిల్లాలోని రాంపూర్‌ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses). అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది (Building Washed Away). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Advertisement

Cloudburst in Himachal Pradesh: వయనాడ్ తర్వాత ప్రకృతి ప్రకోపానికి బలైన హిమాచల్‌ ప్రదేశ్‌, భారీ వరదలకు ఇద్దరు మృతి, మరో 36 మంది గల్లంతు

Hazarath Reddy

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి, సిమ్లా జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

Supreme Court On SC, ST Reservation: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు, వర్గీకరణ నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టత, వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది

Arun Charagonda

ఎస్సీ ,ఎస్టీ వర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్టీ, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం రాష్ట్రాలదేనని తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో తీర్పును వ్యతిరేకించారు జస్టిస్ బేలా త్రివేది. ఉప వర్గీకరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు త్రివేది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.

Andhra Pradesh: పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్‌ చల్‌, ట్యాంకర్‌కి నిప్పు పెడతానని బెదిరింపు, అడ్డుకున్న సిబ్బంది, వీడియో వైరల్

Arun Charagonda

ఏపీలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్‌చల్ చేశాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి చేర్చాలంటూ పెట్రోల్ బంక్ దగ్గర హల్‌చల్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త హంగామా చేశాడు. లేదంటే ట్యాంకర్‌కి నిప్పు పెడుతానంటూ సిలిండర్, లైటర్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. బంక్ సిబ్బంది ఎట్టకేలకు యువకుడిని అడ్డుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Shocker: అందమే ఆమె శాపమైంది, సినిమాల్లో ఛాన్స్‌ పేరుతో అత్యాచారం, మోసపోయిన సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాకం

Arun Charagonda

అంతమే ఆమె పాలిట శాపమైంది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారానికి ఒడగట్టాడు. హైదరాబాద్ పుప్పాలగూడలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Wayanad Landslides Live Updates: వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయ చర్యలు, పెరుగుతున్న మృతుల సంఖ్య, బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శ

Arun Charagonda

కేరళను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 200 మందికి పైగా మృతదేహాలు వెలికితీయగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్య్కూ కొనసాగుతోంది.

Uttar Pradesh: యూపీలో రెచ్చిపోయిన ఆకతాయిలు, బైక్‌పై వెళ్తున్న జంటపై నీళ్లు చల్లిన యువకులు, కిందపడిపోయిన జంట

Arun Charagonda

యూపీలోని లక్నోలో ఆకతాయిలు రెచ్చిపోయారు. తాజ్ హోటల్ బ్రిడ్జిపై వెళ్తున్న జంటపై నీళ్లు చల్లుతూ కొందరు యువకులు వికృతానందం ప్రదర్శించారు. ఆకతాయిల అల్లరి చేష్టల కారణంగా కిందపడిపోయింది ఆ జంట. ఈ వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Anshuman Gaekwad: క్యాన్సర్‌తో పోరాడి ఓడిన టీమిండియా లెజెండరీ అన్షుమాన్ గైక్వాడ్,ఆటగాడిగా,కోచ్‌గా,సెలక్టర్‌గా రికార్డ్స్ ఇవే

Arun Charagonda

భారత లెజండరీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ ఇకలేరు. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన గైక్వాడ్ బుధవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఆయన వయస్సు 71. గైక్వాడ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Delhi Rains: మళ్లీ ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు,నీట మునిగిన కాలనీలు, రెడ్ అలర్ట్ జారీ, స్కూళ్లకు సెలవు, విమానాలు దారి మళ్లింపు, ఆగస్టు 5 వరకు వర్షాలు

Arun Charagonda

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు మళ్లీ ముంచెత్తాయి. భారీ వర్షాలతో పలు కాలనీలు నీట మునగగా ఇళ్లు కూలిపోయాయి. పలు వాహనాల్లోకి నీరు చేరింది .భారీవర్షాలతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించింది. ఆగస్టు 5 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Advertisement
Advertisement