India
Palla Srinivasarao: సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం, ఏపీలో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
Arun Charagondaఅల్లు అర్జున్ ఉదంతం తరువాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం అన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అని చెప్పారు.
Pushpa 2 Controversy: అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం.. కేటీఆర్‌ను నమ్ముకుంటే బన్నీ రోడ్డున పడటం ఖాయమని హెచ్చరించిన బాబా ఫసీయుద్దీన్
Arun Charagondaఅల్లు అర్జున్‌పై మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సంచలనవ్యాఖ్యలు చేశారు. ఆయన కేటీఆర్ డైరెక్షన్‌లో నటిస్తున్నారని ఆరోపించారు. నిన్న అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందేనని విమర్శించారు. కేటీఆర్‌ను నమ్ముకుంటే అర్జున్ కుటుంబం రోడ్డున పడుతుందని వ్యాఖ్యానించారు.
Pushpa 2 Leaked Online: ఆన్‌లైన్‌లో పుష్ప 2 హెచ్‌డీ వెర్షన్, సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం
Arun Charagondaఅల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. విడుదలై 17 రోజులు గడుస్తున్న వసూళ్ల జోరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా తాజాగా పుష్ప 2 అల్ట్రా హెచ్‌డీ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది.
Jeff Bezos To Marry Lauren Sanchez: రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం , లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్న జెఫ్ బెజోస్
Arun Charagondaరూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 2023, మేలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. వింటర్ వండర్‌ల్యాండ్ వెడ్డింగ్ పద్దతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోండగా జెఫ్ బెజోస్‌కి ఇది రెండో పెళ్లి.
Actor Jagapathi Babu: శ్రీతేజ్‌ను పరామర్శించిన హీరో జగపతిబాబు, షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ని పరామర్శించిన జగపతిబాబు, రేవతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
Arun Charagondaషూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించానని చెప్పారు హీరో జగపతిబాబు. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని... పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు.. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందన్నారు జగపతిబాబు.
Stone Pelting On Allu Arjun House: వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు
Arun Charagondaఅల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల కుండీలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
MP Anil Kumar Yadav: 3 బంతుల్లో 35 రన్స్ ఇచ్చిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్...ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ను మార్చిన అంపైర్లు, వీడియో ఇదిగో
Arun Charagondaరాజ్యసభ ఎంపీలకు, లోక్‌సభ ఎంపీలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 3 బంతుల్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వేసిన 13 బంతుల్లో 10 వైడ్స్ ఉన్నాయి. ఎంతకీ ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ని మార్చారు అంపైర్ల. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి
Arun Charagondaఅల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని మండిపడ్డారు ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏసీపీ...మా పోలీసులు తలచుకుంటే అల్లు అర్జున్ రీల్స్ కట్ అవుతాయి - ఏసీపీ విష్ణు మూర్తి చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ లంచం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో
Arun Charagondaఅల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడికి పాల్పడింది ఓయూ జేఏసీ. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. రేవతి కుటుంబానికి బన్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అతడి వల్లే రేవతి చనిపోయిందంటూ జేఏసీ ఆరోపణలు చేసింది.
Astrology: కొత్త సంవత్సరంలో ఈ రాశిలో వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajaya2025వ సంవత్సరం కొన్ని రాష్ట్ర వారికి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు వారి జీవితంలో ప్రతి అంశంలో కూడా విజయాన్ని పొందుతారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.
Astrology: డిసెంబర్ 25వ తేదీన గురు శని శుక్ర గ్రహాల కలయిక దృష్టియోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 25 చాలా ప్రత్యేకత కలిగి ఉంది ఈ రోజున మూడు ప్రధాన గ్రహాలు కలయిక శుభయోగాలను ఇస్తుంది. డిసెంబర్ 25 బుధవారం నాడు గురు గ్రహం శని గ్రహం సూర్యుడు మూడు కూడా కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది.
Health Tips: ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా అయితే సాయంత్రం స్నాక్స్ గా టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ స్నాక్స్ భలే రుచిగా ఉంటుంది..
sajayaరోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు మనకు కాస్త వెరైటీగా ఫుడ్ తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా కరకరలాడే టేస్టీగా ఉండే ఫుడ్ ను తినాలని అందరూ కోరుకుంటారు.
PV Sindhu Weds Venkata Datta Sai: ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు
Arun Charagondaరాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం వెంకట దత్తసాయితో జరగనుండగా ఇందుకు సంబంధించిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వివాహ వేడుక పూర్తయిన అనంతరం మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ
Arun Charagondaసినిమా లో హీరో లు బయట పౌరులేనన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన జితేందర్..అందరూ చట్టానికి లోబడి ఉండాలన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటాం.. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకత కాదు అన్నారు.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా. ఎటువంటి ఆహారాలు తినాలి ఎటువంటి ఆహారాలు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్ సమస్య. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అనగా కాలేయంలో అధికంగా కొవ్వు ఏర్పడే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Health Tips: చలికాలంలో కాళ్లు చేతులు ఎందుకు తిమ్మిరిగా మారుతాయి, కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో కాళ్లు చేతులు ఎప్పుడూ తిమ్మిర్లుగా లాగినట్టుగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది చాలా కాలం మీ శరీరంలో కనిపించినట్లయితే మీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి
Arun Charagondaఅల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి. అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు అని...సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదు.. అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. ఈ కేసులో ఇతరులను అరెస్ట్ చేయకుండా, A11గా ఉన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదు అన్నారు.
Raghuveera Reddy: అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన కామెంట్స్ ఆక్షేపనీయం, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి
Arun Charagondaప్రజాస్వామ్య భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేనన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. మన రాజ్యాంగం దేశ ప్రజల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంథం అని...ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ బాధ్యతలు అప్పగించి గౌరవించిందన్నారు. రాజ్యసభలో అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆక్షేపనీయం అన్నారు రఘువీరారెడ్డి.
Telangana: భద్రాచలంలో 5.25 కిలోల బాల భీముడు జననం, ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ..ఇది మూడో కాన్పు
Arun Charagondaబూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మదకం నందినికి పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాఉ. ఆపరేషన్ చేసి 5.25 కిలోలు ఉన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు వైద్యులు. కాగా, నందినికి ఇది మూడవ కాన్పు.. అంతకు ముందు ఇద్దరు కూడా మగ పిల్లలే.
Earthquake In Prakasham District: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, సెకను పాటు కంపించిన భూమి..ప్రజల భయాందోళన
Arun Charagondaప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం రాగా వరుస భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.