India
Health Tips: ఖాళీ కడుపుతో అంజీర్ నీరును తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.
sajayaడ్రై ఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జీడిపప్పు బాదం పప్పు ,వాల్నట్, ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అంజీర్ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Mohan Babu: ఎక్కడికి పారిపోలేదు..రూమర్స్‌ని ఖండించిన నటుడు మోహన్ బాబు, తప్పుడు ప్రచారం చేయోద్దని అందరికీ విజ్ఞప్తి
Arun Charagondaతనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు నటుడు మోహన్ బాబు. తాను పారిపోలేదు-ఎటూ పోలేదు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇంట్లోనే ఉన్నాను ట్రీట్మెంట్ లో ఉన్నాను అని తెలిపారు. తప్పుడు ప్రచారం చేయొద్దు-మీడియా నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
MP Chamala Kirankumar Reddy: చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
Arun Charagondaసినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సినిమా నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరిగిందంటూ.. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. సామాన్య ప్రజల కంటే సెలబ్రిటీలు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాలి అని ట్వీట్ చేశారు.
Health Tips: ఎసిడిటీ, గ్యాస్ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుందా ,అయితే ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు జాగ్రత్తపడండి..
sajayaఈ మధ్యకాలంలో తరచుగా కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుంది. ఇది 25 నుంచి 40 ఏళ్ల వయసు వారి మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైంది.
Allu Arjun: మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, రేవతి కుటుంబానికి అండగా ఉంటాం..బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడి
Arun Charagondaఅభిమానుల ప్రేమ, మద్దతుకు సినీనటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...తనపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటాం... సంధ్య థియేటర్‌లో జరిగింది అనుకోని ఘటన అందులో నా ప్రమేయం లేదు అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు.
Rana At Allu Arjun Home: బన్నీని పరామర్శించిన రానా, గట్టిగా హాగ్ చేసుకుని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్...వీడియోలు ఇవిగో
Arun Charagondaఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. రానా దగ్గుబాటిని గట్టిగా హాగ్ చేసుకోని ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా బన్నీ ఫోన్ కింద పడగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Allu Aravind: అల్లు అర్జున్ ఎపిసోడ్..మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన అల్లు అరవింద్...వీడియో
Arun Charagondaఇవాళ ఉదయం చెంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీ నివాసానికి పెద్ద ఎత్తున సెలబ్రెటీలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు అల్లు అరవింద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారేఉ. నిన్నటి నుంచి అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు అల్లు అరవింద్.
MLA Danam Nagender: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం కానీ ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందనడం సరికాదన్న ఎమ్మెల్యే నాగం నాగేందర్...బెయిల్ దొరకడం సంతోషంగా ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
Arun Charagondaఅల్లు అర్జున్ మా చుట్టం.. ఆయన అరెస్ట్ బాధాకరం అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన జాతీయ నటుడే కాదు.. ప్రపంచ స్థాయి నటుడు అన్నారు. బన్నీ అరెస్ట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం, అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారు అన్నారు.అల్లు అర్జున్‌ను ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు అన్నారు.
Harsha Kumar: నటుడు మోహన్ బాబును ఇమిటేట్ చేసిన మాజీ ఎంపీ హర్ష కుమార్, జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న హర్ష కుమార్
Arun Charagondaజర్నలిస్టు రంజిత్ పై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులకు మద్దతుగా నిలిచారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ సందర్భంగా మోహన్ బాబును ఇమిటేట్ చేశారు. దీంతో ఒక్కసారి అంతా నవ్వుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Haryana Farmers Protest: మరోసారి రైతుల ఛలో ఢిల్లీ, హర్యానా - పంజాబ్ సరిహద్దుకు భారీగా చేరుకుంటున్న రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసులు
Arun Charagondaపంటలకు కనీస మద్దతు ధఱకు చట్టబద్దత కల్పించడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఇవాళ మరోసారి ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా - పంజాబ్ సరిహద్దుకు భారీగా రైతులు చేరుకుంటున్నారు. రైతుల ఛలో ఢిల్లీకి అనుమతి లేకపోవడంతో ఢిల్లీ సరిహద్దులో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి భార్య సురేఖ, బన్నీని పరామర్శించిన విజయ్ దేవరకొండ, సుకుమార్...వీడియోలు ఇవిగో
Arun Charagondaఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి భార్య, మేనత్త సురేఖమ్మ. అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని బన్నీకి ధైర్యం చెప్పారు హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్, పుష్ప సినిమా నిర్మాతలు .
Telangana: వివాదంలో జగిత్యాల జిల్లా వైద్య సిబ్బంది, రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైనం, విచారణ జరిపిన కలెక్టర్..చర్యలకు ఆదేశం
Arun Charagondaజగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు నర్సులు, సిబ్బంది. కోలాటాలతో నృత్యాలు చేశారు. మీడియా రాకను చూసి డ్యాన్స్ ఆపగా దీనిని కప్పిపుచ్చే యత్నం చేశారు ఆర్ఎంఓ సుమన్. విషయం తెలిసి ఆస్పత్రిలో విచారణ జరిపారు అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి. తక్షణమే చర్యలకు ఆదేశించారు.
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ఐదుగురు కేంద్రమంత్రులను కలిసిన రేవంత్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చ
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఐదుగురు కేంద్ర మంత్రులని కలిశారు రేవంత్ రెడ్డి. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు.రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ (పీవోహెచ్) వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిందని గుర్తుచేస్తూ ఆ తర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని చెప్పారు.
Allu Arjun Fan: బన్నీ కోసం ఆత్మహత్య చేసుకోబోయిన ఫ్యాన్, అభిమాని చేతిలో నుండి పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీసులు...వీడియో ఇదిగో
Arun Charagondaఅల్లు అర్జున్ కోసం ఓ అభిమాని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఓ అభిమాని. నిన్న రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉండిపోవడంతో అభిమాని తీవ్ర మనస్థాపం చెందాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫ్యాన్‌ని అదుపులోకి తీసుకుని నచ్చజెప్పారు.
Allu Arjun Released: చట్టానికి కట్టుబడి ఉంటా.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడగానే పరిగెత్తుకొచ్చిన అయాన్ (వీడియోలతో)
Rudraచట్టానికి తాను కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.
Allu Arjun Released: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సీఐ బానోతు రాజు నాయక్.. బన్నీకి నాయక్ వీరాభిమాని??
Rudraఅల్లు అర్జున్ ను నిన్న అరెస్టు చేసిన పోలీసు అధికారి సీఐ బానోతు రాజు నాయక్ అని తెలిసింది. ఆయన బన్నీకి వీరాభిమాని అని కొందరు చెప్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
Cream Vaccine: సూది టీకాకు గుడ్ బై.. క్రీమ్ లాంటి వ్యాక్సిన్.. చర్మం పైన రాసుకుంటే చాలు.. నొప్పికి బైబై.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraవ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Allu Arjun Released: నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ (వీడియో)
Rudraవిడుదలైన నాన్న ఎప్పుడు ఇంటికి వస్తారంటూ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇంట్లో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allu Arjun At Geetha Arts Office: జైలు నుంచి డైరెక్టుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్.. కార్యాలయానికి క్యూకట్టిన పలువురు సినీ ప్రముఖులు
Rudraజైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు.
Allu Arjun Released: అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..
Rudraనిన్న రాత్రంతా చంచల్ గూడ జైలులో గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్ లైన్ లో అప్‌లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.