India
Actor Subbaraju: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు, భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన టాలీవుడ్ నటుడు
Arun Charagondaప్రముఖ సినీ నటుడు సుబ్బరాజు ఒక ఇంటివాడయ్యాడు. 47 ఏళ్ల లేటు వయస్సులో వివాహం చేసుకున్నారు సుబ్బరాజు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. పెళ్లి గురించిన ఆలోచన లేదని చెబుతూ వచ్చిన సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్‌గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.
CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం
Arun Charagondaతెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థ (AAI)కి అందజేసినట్టు తెలిపారు.
SC Dismisses Plea for Ballot Paper: పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వాహించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
Hazarath Reddyపేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కేఏ పాల్ .. సుప్రీంకోర్టులో పిల్ వేసిన సంగతి విదితమే. నేడు జస్టిస్ విక్రమ్ నాథ్, పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ తర్వాత ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Tollywood: సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూత, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్..చికిత్స పొందుతూ మృతి
Arun Charagondaటాలీవుడ్ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కులశేఖర్ గతంలో మందుకు బానిసై, మానసిక స్థితిని కోల్పోయి.. దొంగగా మారి, పోలీసుల చేతికి చిక్కిన ఘటనలు కూడా ఉన్నాయి.
CM Revanth Reddy: కేంద్రమంత్రిని రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం అనుమతి కోరిన తెలంగాణ సీఎం
Arun Charagondaకేంద్రమంత్రిని రాజ్‌నాథ్ సింగ్‌ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాజ్‌నాథ్‌ని కలిసిన రేవంత్..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం అనుమతివ్వాలని కోరారు. అలాగే 222 ఎకరాల డిఫెన్స్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.
Akhil Akkineni Engagement: జైనబ్ రావడ్జీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్..అధికారికంగా ప్రకటించిన నాగార్జున
Arun Charagondaఅక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి చేసుకోబోతుండగా తాజాగా అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాగ్.. మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావడ్జీతో జరిగింది. జైనబ్ మా ఫ్యామిలీలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ యంగ్ కపుల్ కి మీ ఆశీర్వాదాలు అందించండి అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారగా అంతా షాక్‌కు గురవుతున్నారు.
Telangana: మాగనూర్ ప్రభుత్వ స్కూల్‌లో మళ్లీ ఫుడ్ పాయిజన్, మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత, మక్తల్ ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaమక్తల్ - మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులకు వాంతులు కాగా తల, కడుపు నొప్పితో విలవిలలాడారు విద్యార్థులు. దీంతో మక్తల్ ఆస్పత్రికి 20 మంది విద్యార్థులను తరలించారు.
Hyderabad: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో మంటలు...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పు తుండగా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్
Arun Charagondaగత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి. గత ఐదేళ్లలో జీవోలను రహస్యంగా ఉంచారు అని వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ , మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్
Arun Charagondaముఖ్యమంత్రి నిన్న అదానీ అంశానికి సంబంధించి మాట్లాడిన కారణంగా మాట్లాడాల్సి వస్తోంది... రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్...రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత నేను వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడు అన్నారు.
Telangana: జస్టిస్ జగన్నాధరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం, హైదరాబాద్‌లో జరగనున్న అంత్యక్రియలు
Arun Charagondaజస్టిస్ జగన్నాధరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జగన్నాధరావు తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం హైదరాబాద్‌లో జగన్నాధరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
Andhra Pradesh: ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్, వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలు..మూడు టీడీపీ ఖాతాలోకే!
Arun Charagondaఏపీలో రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉండనుంది.
Tollywood Actor Shritej: నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదు..కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు
Arun Charagondaయువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయగా కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు అయింది. గతంలో కూడా ఓ బ్యాంకు ఉన్నతాధికారి భార్యతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ విషయం తెలిసి గుండెపోటుతో మృతిచెందారు మహిళ భర్త. మాదాపూర్ పీఎస్‌లో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఓ సినిమాలో చంద్రబాబుగా నటించారు శ్రీతేజ్.
Astrology: నవంబర్ 30న రాహు కేతువులు రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువులు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే వీరు అనేక రకాల నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది.
Astrology: రాత్రి పడుకునే ముందు ఈ వస్తువును మీ దిండు కింద పెట్టి పడుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు..
sajayaచాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా డబ్బు నిలవదు. ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి వారి కోసం ఈరోజు మనం ఒక చిన్న రెమెడీ గురించి తెలుసుకుందాం. లవంగం అనేది ఒక సాధారణమైన మసాలా దినుసుగా చూస్తూ ఉంటారు.
Asttrology: డిసెంబర్ 2 బుధ గ్రహం దిశ మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహాల కదలిక వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 2 సోమవారం రోజు బుధ గ్రహం తన దిశను మార్చుకుంటుంది. బుధుడు ఈ తేదీన గ్రహణ సమయంలో ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు.
Health Tips: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటాము. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనము వెచ్చటి దుస్తులు వాడుతూ ఉంటాం.
Telangana: బస్సులోనే గుండెపోటుతో వ్యక్తి మృతి, పోచారం ఐటీ కారిడార్‌లో ఘటన, మృతుడు భువనగిరి పట్టణానికి చెందిన పాండుగా గుర్తింపు..
Arun Charagondaయాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన గీతాకార్మికుడు డొంకెని పాండు(59) ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..
sajayaచాలామందిలో చలికాలంలో పెరుగు తినాలా వద్ద అన్న అనుమానం ఉంటుంది. అయితే చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దాన్ని తీసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకొని తినడం ద్వారా ఆ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
Health Tips: షుగర్ పేషంట్స్ నెయ్యి తినవచ్చా, మితంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaసాంప్రదాయ వంటకాలలో నెయ్యిని తరచుగా వాడుతూ ఉంటారు. నెయ్యిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అయితే నెయ్యి వాడడంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.