India
Andhra Pradesh: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడి సెల్ఫీ వీడియోపై స్పందించిన నరసరావుపేట డీఎస్పీ, ఏమన్నారంటే..
Hazarath Reddyసెల్పీ వీడియోపై నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు స్పందించారు. మదార్ వలీ పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అతణ్ణి నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు నగదు అడగలేదు. తప్పు తనదేనని, భయపడి అలా చెప్పానని మదార్ వలీ విచారణలో ఒప్పుకున్నాడు.
AP Assembly Session: అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సవాల్ విసిరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
Hazarath Reddyజగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపిన నేపథ్యంలో జగన్ స్పందించారు. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అంటూ సవాల్ విసిరారు. కాగా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు
Animal Cruelty in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మూడు కుక్కలను విచక్షణారహితంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు, కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి, వీడియో ఇదిగో...
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్‌లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి.
Chennai Shocker: వీడియో ఇదిగో, తల్లికి సరైన వైద్యం చేయలేదని ప్రభుత్వ వైద్యుడిపై కత్తితో దాడి, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసిన డాక్టర్లు
Hazarath Reddyచెన్నైలో ప్రభుత్వ వైద్యుడిపై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి సరైన వైద్యం చేయలేదని గిండి కలయాన్ సెంటినరీ ఆస్పత్రికి చెందిన అంకాలజిస్ట్ డాక్టర్ బాలాజీపై తన స్నేహితులతో కలిసి విఘ్నేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. బాలాజీకి ట్రీట్మెంట్ చేసిన ఇతర డాక్టర్లు.
YS Jagan Slams CM Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు నటన ముందు NTR నటన నథింగ్, సూపర్ సిక్స్ అడుగుతారని ఇన్ని రోజులు బడ్జెట్ సాగదీశారని మండిపాటు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు.
Actress Sri Reddy: ఈ సారి శ్రీరెడ్డి వంతు..క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు, అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ
Hazarath Reddyసోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మరియు ఇతర టిడిపి జనసేన నాయకులు పై శ్రీ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Ram Gopal Varma: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Hazarath Reddyసినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు... హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ నివాసంలో నోటీసులు అందించారు.
Astrology: నవంబర్ 15 నుండి శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం, శనిదేవుని రాశుల అనుగ్రహం వల్ల ఈ మూడు వారికి అదృష్టం..
sajayaనవంబర్ 15న శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం. అంతేకాకుండా నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం నేరుగా కుంభరాశిలోకి వెళుతుంది.
Health Tips: కడుపులో వచ్చే క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? దీనికి రావడానికి గల కారణాలు తెలుసుకుందాం..
sajayaఈమధ్య కాలంలో చాలామందిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. మనం తీసుకున్న ఆహార పదార్థాలలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఇది ఈ సమస్య ఏర్పడుతుంది.
YS Jagan on Budget: ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందో చెప్పాలి, కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డి నిలదీశారు.
Nitish Kumar Tries to Touch PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం
Hazarath Reddyబీహార్‌లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాదాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నమస్కరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Telangana: హైదరాబాద్ అబిడ్స్‌లో ఘరానా చోరి, కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లు...సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు మెనర్లు. అక్కడి నుండి వెళ్లి వాకింగ్ చేస్తున్న న్యాయవాది కళ్యాణ్ వద్ద ఉన్న సాంసంగ్ ఫోన్ కోసం కత్తితో బెదిరించారు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు కాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Happy Children's Day Wishes In Telugu: పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా... అయితే చక్కటి హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ మీకోసం..
sajayaమన భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీ. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనందరి ముందు ఉన్న కర్తవ్యం. పిల్లలను భవిష్యత్తు విధాతలుగా మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.
AI Generated Taj Mahal Video: ఏఐ పరిజ్ఞానంతో తాజ్ మహల్ నిర్మాణం, 400 ఏళ్ల క్రితం నిర్మాణం ఇలానే జరిగిందా అనేలా కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఇదిగో
Arun CharagondaAI పరిజ్ఞానంతో తాజ్‌మహల్ నిర్మాణం పునః సృష్టించారు. 400 ఏళ్ల క్రితం తాజ్‌మహల్ నిర్మాణం ఇలాగే జరిగిందా అనేలా ఓ వీడియోని రూపొందించారు. తాజ్‌మహల్ నిర్మాణం వెనక కార్మికుల కష్టాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tirupathi Reddy On Lagacherla Incident: ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు..లగచర్ల దాడి వెనుక ఎవరున్న వదిలిపెట్టమన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ
Arun Charagondaవికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.
Hydra: మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు, రాంపల్లిలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా అధికారులు...వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. మేడ్చల్ - నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు చేపట్టారు అధికారులు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసిబి సహాయంతో కూల్చివేస్తున్నారు
Nara Lokesh on DSC: ఏపీలో త్వరలో 595 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ వేదికగా నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు, 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అసెంబ్లీలో డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించారు.
Telangana: వీడియో ఇదిగో, పొలంలోకి వెళ్లేందుకు రైతులు అవస్థలు, వాగు దాటడానికి పైప్‌నే బ్రిడ్జిగా వాడుతున్న గ్రామంలోని అన్నదాతలు
Hazarath Reddyనిర్మల్ - కుంటాల పరిధి కల్లూరు-పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. వాగుకు అవతలి వైపు ఉన్న తమ పొలాల వద్దకు వెళ్లేందుకు ప్రస్తుతం పైపే బ్రిడ్జిగా మారిందని రైతులు వాపోతున్నారు.
Kodangal Lagacherla Incident: ఏ1గా బోగమోని సురేష్, లగిచర్ల ఘటనపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్, పథకం ప్రకారమే దాడి చేశారని వెల్లడి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు
Arun Charagondaఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలెక్టర్, అధికారులపై దాడి వెనుక కుట్ర కోణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐజి నారాయణ రెడ్డి.
HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం
Hazarath Reddyసోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది.