India

Harishrao Praises KTR: కేటీఆర్‌పై హరీశ్‌ రావు ప్రశంసలు, ఐటీలో తెలంగాణను నెంబర్‌ 1 చేసిన కేటీఆర్ అంటూ కితాబు, ప్రశ్నించే గొంతుకలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి సరికాదని ఆగ్రహం

Arun Charagonda

కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేటీఆర్ ఐటీలో తెలంగాణను నంబర్ 1 చేసిండు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు.. ముంబై, ఢిల్లీ, బెంగళూరును కాదని హైదరాబాదుకు పెట్టుబడులు కేటీఆర్ తెచ్చిండన్నారు.

Health Tips: మీ శరీరంలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లే.

sajaya

ఈరోజుల్లో చాలామందిలో ఎక్కువగా కనిపించే సమస్య కొలెస్ట్రాల్ జీవనశైలి, ఆహారపాలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి

Health Tips: ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఇటువంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో ఎసిడిటీ గ్యాస్ కడుపు వంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకుంటే ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని తీసుకోకూడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

Vangalapudi Anitha On Pawan Kalyan: ఏపీలో బాలికపై దారుణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు స్పందించిన హోంమంత్రి అనిత, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు స్పందించారు హోంమంత్రి అనిత. నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13)ను 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీర మహిళ విభాగం ట్వీట్ చేసింది.

Advertisement

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే కాఫీ తో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో అనేక రకాల మార్పుల వల్ల వారిలో ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఏర్పడుతుంది. ఎవరంటే కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.

Borugadda Anil: ఏకంగా పోలీస్ స్టేషన్‌లో బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే బోరుగడ్డ అనిల్ కు పోలీసుల రాచ మర్యాదలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చారు బోరుగడ్డ అనిల్. ఆయనకు పడుకునేందుకు దిండు, దుప్పటి ఇచ్చి రాచ మర్యాదలు చేశారు పోలీసులు.

Nagarjuna Sagar Project: మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం, తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ

Arun Charagonda

మరోసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం నెలకొంది. KRMB ఆదేశాల ప్రకారం.. ప్రతిరోజు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల వివరాలు నమోదు చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.

Pakistan: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, క్వెట్టా రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు..20 మంది మృతి..వీడియో ఇదిగో

Arun Charagonda

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించగా స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Minister Sridhar Babu: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ, దీపావళి రోజున సెల్ ఫోన్ కొట్టేసిన దొంగలు..పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి

Arun Charagonda

తెలంగాణలో మరో మంత్రి ఇంట్లో చోరీ జరిగింది. నెల రోజుల క్రితం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరగగా ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉంటున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ఈనెల 31వ తేదీన దీపావళి రోజున సెల్ ఫోన్ చోరీ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి శ్రీధర్ బాబు.

Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు, ఏకంగా సీపీ సీవీ ఆనంద్‌ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్, అలర్ట్‌గా ఉండాలని పోలీసుల సూచన

Arun Charagonda

సైబర్ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఈసారి ఏకంగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ డీపీతో ఫేక్‌ వాట్సాప్ కాల్స్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ప్లాన్ వేశారు. పాకిస్థాన్‌ కోడ్‌ ఉన్న నంబర్లతో కాల్స్ వస్తుండగా సైబర్‌ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు సీపీ సీవీ ఆనంద్.

Hyderabad: ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను కూల్చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికారులు...వీడియో ఇదిగో

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురంలో ఫుట్ పాత్ లపై వెలిసిన అక్రమ నిర్మాణాలను GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ మరియు రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఫుట్ పాత్ ను కబ్జా చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిపారు అధికారులు.

Prabhas Look In Kannappa: కన్నప్ప మూవీ ప్రభాస్ లుక్ లీక్..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రభాస్ స్టిల్!

Arun Charagonda

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటివరకు లుక్ రిలీజ్ చేయలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌కి సంబంధించిన లుక్ లీక్ అయింది. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Advertisement

Telangana: వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు, కీలక పత్రాలు స్వాధీనం

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వడ్డీ వ్యాపారులపై కొరడా ఝుళిపించారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యపారుల ఇల్లు, ఆఫీసులపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. చెక్కులు, ప్రామిసరీ నోట్లు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ATMs Shutting Down: 12 నెలల్లో 4 వేల ఏటీఎంలు మూత.. డిజిటల్‌ లావాదేవీల పెరుగుదలే కారణం

Rudra

దేశంలో నగదు చలామణి కొత్త రికార్డులకు చేరుకొంటున్నాయి. అయితే, విచిత్రంగా దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌ వర్క్‌ లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.

Andhra Pradesh: అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సంఘటన, ఫ్లాట్ ఫామ్‌ - రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి, ఫ్లాట్ ఫామ్‌కి మధ్య ఇరుక్కున్నాడు ఓ ప్రయాణికుడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్‌ని తవ్వి ప్రయాణికుడిని రక్షించారు.

Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం, అతివేగంతో కారును ఢీకొట్టిన బస్సు...పోలీసులకు ఫిర్యాదు చేసిన కారు డ్రైవర్

Arun Charagonda

హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ - ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద అతివేగంతో దూసుకొచ్చి కారును ఢీకొట్టింది. అనంతరం కారును ఈడ్చుకెళ్లింది గో టూర్ ట్రావెల్స్ బస్సు. వాహనదారులు, జనం కేకలు వేయడంతో కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు కారు డ్రైవర్. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు కారు డ్రైవర్.

Advertisement

Road Accident at KPHB: బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న పాదచారుడు మృతి.. హైదరాబాద్ కేపీహెచ్‌ బీలో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న పాదచారుడిని వేగంగా వచ్చిన ఓ బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Andhra Pradesh: కరెంట్ పోల్ ఎక్కి తమిళనాడు యువకుడి ఆత్మహత్య, అత్తిలి రైల్వే స్టేషన్‌లో ఘటన...వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అత్తిలి రైల్వే స్టేషన్‌లో కరెంట్ పోల్ ఎక్కి తమిళనాడు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంట్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్టేషన్ మాస్టర్. ఈ క్రమంలో కరెంట్ తీగలను తాకి కింద పడి చనిపోయాడు యువకుడు.

Car Burial Ceremony: కారుకు అంత్యక్రియలు.. 1,500 మంది సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం.. ఎందుకంటే? (వీడియోతో)

Rudra

గుజరాత్‌ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. మీరు చదువుతున్నది నిజమే.

Destruction Of Katta Maisamma's Trident: సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయ త్రిశూలం ధ్వంసం.. దుండగుడికి స్థానికుల దేహశుద్ధి.. హైదరాబాద్ శంషాబాద్ లో మరో ఘటన (వీడియో)

Rudra

హిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం ధ్వంసం ఘటనను మరవక ముందే శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు బరితెగించాడు.

Advertisement
Advertisement