India

New Liquor Rates in AP: ఇంకా అందుబాటులోకి రాని రూ.99కే క్వార్టర్ బాటిల్, ఏపీలో కొత్త లిక్కర్ ధరల పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే! ఈ మేరకు సోమవారం లాటరీల్లో కేటాయించిన షాపుల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి.

Medak Road Accident: మెదక్‌ జిల్లా రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

Hazarath Reddy

మెదక్‌ జిల్లా శివంపేట పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Chennai Rains: వాయుగుండం తుఫానుగా మారే అవకాశం లేదు, అయినా చెన్నైకి భారీ వర్షాల ముప్పు ఉందని తెలిపిన చెన్నై ఐఎండీ డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.

Andhra Pradesh Rains: నెల్లూరుకు దగ్గరగా వచ్చిన వాయుగుండం, రేపు తీరం దాటే అవకాశం, రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.

Advertisement

Medak Road Accident: మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డుపై ఉన్న గుంత, ఇందులో ముగ్గురు చిన్నారులు

Arun Charagonda

మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ దగ్గర రోడ్డుపై ఓ గుంత ఏర్పడింది.వేగంగా వెళ్లిన ఓ కారు ఆ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

Bhatti Vikramarka On Hyderabad Development: బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం..హైదరాబాద్ నగర విస్తరణకు చర్యలు తీసుకుంటాం అన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Arun Charagonda

హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు తీసుకుంటాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణరంగం విస్తరిస్తుందన్నారు. బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం అని తెలిపారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామన్నారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.

Vijaya Dairy Chairman Jagan Mohan Reddy: అఖిల ప్రియ రౌడీ రాజకీయానికి భయపడం, చంద్రబాబు మెప్పుకోసమే కొత్త నాటకాలు అని విజయ డైరీ ఛైర్మన్ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపాటు

Arun Charagonda

నంద్యాల జిల్లా విజయ డైరీలో భూమా అఖిల ప్రియ చేసిన హంగామా పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి. విజయ డైరీ అన్నది స్వతంత్ర సంస్థ అన్న విషయం కూడా అఖిలప్రియ మర్చిపోయిందన్నారు. అఖిలప్రియ రౌడీ రాజకీ యానికి ఇక్కడ భయప డేవారు లేరు అన్నారు.

Bihar Hooch Tragedy: బీహార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి, పలువురు ఆస్పత్రిల్లో చావు బతుకుల్లో, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలతో..

Hazarath Reddy

కౌడియా వైసీ తోలా గ్రామంలో మంగళవారం సాయంత్రం వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించిన వారిని చికిత్స నిమిత్తం భగవాన్‌పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు సివాన్ జిల్లా మేజిస్ట్రేట్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, రైలు డోర్ బయట రీల్ చేస్తూ స్తంభానికి గుద్దుకున్న యువకుడు, ఒక్కసారిగా ఫట్‌మని సౌండ్ రావడంతో రైలు ప్రయాణికులు...

Hazarath Reddy

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ డోర్ బయట డాన్స్ చేస్తూ రీల్స్ చేసే టైమ్‌లో స్థంభంకి తాకి ట్రైన్‌లో నుండి ఓ యువకుడు కింద పడ్డాడు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kadiyam Srihari: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ధర్నా, తొలి నుండి పార్టీలో ఉన్న వారిని పట్టించుకోవడం లేదని ఫైర్..కడియంకు వ్యతిరేకంగా నినాదాలు

Arun Charagonda

కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతుదారులు ఆందోళన చేశారు. పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాకుండా.. కడియం శ్రీహరి వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

Hanuman Temple Vandalized: వీడియో ఇదిగో, చిత్తూరు జిల్లాలో ఆంజేనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు చెప్పారు.

Astrology: అక్టోబర్ 23న రాహు కేతువుల కలయిక ఈ 3 రాశుల వారికి ఆర్థిక సమస్యలు కలుగుతాయి.

sajaya

జ్యోతిష శాస్త్రంలో రాహు కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశులను మార్చుకున్నప్పుడు 12 రాశుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీరికి జీవితంలో ఆనందం శాంతి తగ్గుతుంది.

Advertisement

Telangana: విద్యార్థిని చితక బాదిన క్లాస్ టీచర్..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..వీడియో చూసి అంతా కన్నీటి పర్యాంతం

Arun Charagonda

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెం మానస వికాస స్కూల్లో విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. ఏమైందని తల్లి అడగగా, క్లాస్ టీచర్.. విచక్షణ రహితంగా కొట్టాడంటూ కన్నీరు పెట్టుకున్నాడు బాలుడు.సీసీ టీవీలో దృశ్యాలు రికార్డు కాగా వీడియో చూసి కన్నీటి పర్యాంతమయ్యారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Astrology: అక్టోబర్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశం దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం న్యాయానికి అధిపతి అయిన శని గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుని దయ ఉండడం వల్ల జీవితంలో అనేక లాభాలను పొందుతారని నమ్ముతారు. అయితే అక్టోబర్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశం. దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.

Astrology: ఈరోజు నుండి అక్టోబర్ 27 వరకు శుక్రుని రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు ఐశ్వర్యానికి సుఖాలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు రాశి మార్పు వల్ల అనేక ప్రయోజనాలు పొంది ఉంటాడు. అక్టోబర్ 16 నుండి అనురాధ నక్ష విశాఖ నక్షత్రం నుండి అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..అయితే ఈ డ్రింక్స్ తో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైన అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు. మన శరీరంలో ప్యూరిన్లు అధికంగా పెరిగినప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

Advertisement

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఓవైసీ, కాల్పుల ఘటనలో విచారణకు హాజరైన ఓవైసీ...వీడియో ఇదిగో

Arun Charagonda

యూపీలో కోర్టు విచారణకు హాజరయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఫిబ్రవరి 3 2022న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటనపై, హాపూర్ కోర్టులో విచారణకు హాజరయ్యారు ఓవైసీ.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా. అయితే ఈ రోజే మీ ఆహారంలో జీరో క్యాలరీలు ఉన్న ఈ ఆహారాలను చేర్చుకోండి.

sajaya

బిజీ లైఫ్ వల్ల చాలామంది అధిక బరువుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం తక్కువ వ్యాయామం చేయడం జీవనశైలిలో మార్పు స్ట్రెస్ నిద్రలేకపోవడం వంటి వాటి వల్ల కూడా ఉబకాయం వస్తుంది.

UP Fan Meet Allu Arjun: వీడియో ఇదిగో, అల్లు అర్జున్‌ కోసం యూపీ నుంచి 1500 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని, ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్

Hazarath Reddy

యూపీలోని ‍అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్‌ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు.

APSRTC Driver Dies of Heart Attack: చీరాలలో తీవ్ర విషాదం, బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు, పొలాలలోకి దూసుకెళ్లిన బస్సు, డ్రైవర్ మృతి

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లాలో డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా కర్లపాలెం వద్ద డ్రైవర్‌ సాంబశివరావుకు గుండెపోటు వచ్చింది. బస్సు వేగాన్ని తగ్గించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement
Advertisement